మోటోరోలా నుంచి అదిరే ఫీచర్లతో రెండు స్మార్ట్‌ఫోన్లు

ప్రముఖ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ మోటరోలా తాజాగా రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను దేశీయ విపణిలోకి తీసుకువచ్చింది. మోటో జీ7, మోటరోలా వన్ స్మార్ట్ ఫోన్లను ఇండియాలో లాంచ్ చేసింది. అందరూ మోటోరోలా కంపె

|

ప్రముఖ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ మోటరోలా తాజాగా రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను దేశీయ విపణిలోకి తీసుకువచ్చింది. మోటో జీ7, మోటరోలా వన్ స్మార్ట్ ఫోన్లను ఇండియాలో లాంచ్ చేసింది. అందరూ మోటోరోలా కంపెనీ కేవలం మోటో జీ7 స్మార్ట్‌ఫోన్‌నే మాత్రమే మార్కెట్‌లో లాంచ్ చేయబోతోందని అంచనా వేశారు. అయితే మోటరోలా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ వన్ ఫోన్‌ను కూడా లాంచ్ చేసింది.

 
మోటోరోలా నుంచి అదిరే ఫీచర్లతో రెండు స్మార్ట్‌ఫోన్లు

ఈ రెండు ఫోన్లను ఫ్లిప్‌కార్ట్, మోటో హబ్ స్టోర్లు, ఇతర ఔట్‌లెట్స్‌లోనూ కొనుగోలు చేయవచ్చు. ఫీచర్లు ధరను ఓ సారి పరిశీలిస్తే..

మోటోరోలా వ‌న్ ధర

మోటోరోలా వ‌న్ ధర

మోటోరోలా వ‌న్ రూ.13,999 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్న‌ది.మోటరోలా వన్ ఫోన్‌లో 5.9 అంగుళాల స్క్రీన్, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 8.0 ఆపరేటింగ్ సిస్టమ్, 64 జీబీ మెమరీ, 13 ఎంపీ+2 ఎంపీ డ్యూయెల్ రియర్ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మోటోరోలా వ‌న్ పూర్తి ఫీచ‌ర్లు

మోటోరోలా వ‌న్ పూర్తి ఫీచ‌ర్లు

5.9 ఇంచ్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 625 ప్రాసెస‌ర్‌, 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13, 2 మెగాపిక్సల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, పీ2ఐ వాట‌ర్ రీపెల్లెంట్ నానో కోటింగ్‌, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌

మోటో జీ7 ధర
 

మోటో జీ7 ధర

మోటో జీ7 రూ.16,999 ధ‌రకు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్న‌ది. 6.2 అంగుళాల స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ 632 ప్రాసెసర్, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ పై ఆపరేటింగ్ సిస్టమ్, 64 జీబీ మెమరీ, 12 ఎంపీ+5 ఎంపీ డ్యూయెల్ రియర్ కెమెరా, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి

మోటో జీ7 పూర్తి ఫీచ‌ర్లు

మోటో జీ7 పూర్తి ఫీచ‌ర్లు

6.24 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2270 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్‌, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 632 ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, వాట‌ర్ రీపెల్లెంట్ పీ2ఐ కోటింగ్‌, 12, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ట‌ర్బో చార్జింగ్‌.

Best Mobiles in India

English summary
Moto G7, Motorola One launched in India: Price and specifications

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X