Home
News

Moto G8 Power Lite సేల్!! 10వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ ఇదే...

మోటరోలా సంస్థ ఇటీవల తన మోటరోలా వన్ ఫ్యూజన్ + స్మార్ట్ ఫోన్ యొక్క ధరను పెంచింది. కానీ బడ్జెట్ ధరలో విడుదలైన మోటో G8 పవర్ లైట్ యొక్క ధరను మాత్రం పెంచలేదు. ఈ రోజు ఫ్లిప్‌కార్ట్ ద్వారా మధ్యాహ్నం 12:00 గంటల నుంచి దీనిని అమ్మకానికి ఉంచింది. మీడియాటెక్ హెలియో P35 SoC, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉన్న దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

మోటో G8 పవర్ లైట్ స్మార్ట్‌ఫోన్‌ ధరల వివరాలు

మోటో G8 పవర్ లైట్ స్మార్ట్‌ఫోన్‌ ధరల వివరాలు

మోటరోలా యొక్క మోటో G8 పవర్ లైట్ స్మార్ట్‌ఫోన్‌ రూ.9,499 ధర వద్ద కేవలం ఒకే ఒక 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌లో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో గల ప్రత్యేకమైన SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 256GB వరకు విస్తరించవచ్చు. ఈ ధర వద్ద ఇన్ఫినిక్స్ మరియు రియల్ మి వంటి బ్రాండ్లకు గట్టి పోటీని ఇస్తున్నది. ఈ విభాగంలో వినియోగదారులు మోటో G8 పవర్ లైట్, రియల్ మి నార్జో 10a , రియల్మే C3 మరియు రెడ్‌మి 8A వంటి స్మార్ట్‌ఫోన్‌లలో మీకు నచ్చిన దానిని ఎంచుకోవచ్చు.

 

మోటో G8 పవర్ లైట్ స్మార్ట్‌ఫోన్‌ సేల్స్ ఆఫర్స్

మోటో G8 పవర్ లైట్ స్మార్ట్‌ఫోన్‌ సేల్స్ ఆఫర్స్

ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ రోజు జరిగే అమ్మకంలో ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డులను వినియోగించిన వారికి అదనంగా 10 శాతం తగ్గింపు లభిస్తుంది. అలాగే నెలకు రూ.750 నుండి ప్రారంభమయ్యే నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా లభిస్తాయి. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ల మీద 5 శాతం వరకు అపరిమిత క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

 

మోటో G 8 పవర్ లైట్ IPS LCD మాక్స్ విజన్ డిస్ప్లే

మోటో G 8 పవర్ లైట్ IPS LCD మాక్స్ విజన్ డిస్ప్లే

మోటో G8 పవర్ లైట్‌ స్మార్ట్‌ఫోన్‌ 6.5-అంగుళాల డిస్ప్లే 20: 9 కారక నిష్పత్తితో IPS LCD మాక్స్ విజన్ ప్యానల్‌ను కలిగి ఉంది. ఇది వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్డ్ డిస్‌ప్లేను HD + రిజల్యూషన్‌తో కలిగి ఉంటుంది. ఇది మీడియాటెక్ హెలియో P 35 చిప్‌సెట్ ను కలిగి ఉండి ఆండ్రాయిడ్ 9 పై ఓఎస్‌తో రన్ అవుతుంది.

మోటో G 8 పవర్ లైట్ ట్రిపుల్ కెమెరా సెటప్‌

మోటో G 8 పవర్ లైట్ ట్రిపుల్ కెమెరా సెటప్‌

మోటో G8 పవర్ లైట్‌ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఈ సెటప్‌లో ఎఫ్ / 2.0 ఎపర్చర్‌తో 16 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. అలాగే ఈ సెటప్‌లో ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ సెకండరీ కెమెరా మరియు ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు జతచేయబడి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియోల కోసం ఫోన్ యొక్క ముందుభాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఇది డ్యూయల్ కెమెరా బోకె, ఫేస్ బ్యూటీ, హెచ్‌డిఆర్, గూగుల్ లెన్స్ వంటి మరిన్ని ఫీచర్లకు కూడా మద్దతు ఇస్తుంది. ముందు మరియు వెనుక కెమెరా సెన్సార్లు రెండూ 30fps 1080p వీడియో రికార్డింగ్ కోసం మద్దతునిస్తాయి.

మోటో G8 పవర్ లైట్ 5000mAh బ్యాటరీ, 4G కనెక్టివిటీ

మోటో G8 పవర్ లైట్ 5000mAh బ్యాటరీ, 4G కనెక్టివిటీ

మోటో జి 8 పవర్ లైట్ స్మార్ట్‌ఫోన్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఎంపికతో లభిస్తుంది. ఈ ఫోన్‌లో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 500GB వరకు విస్తరించవచ్చు. కనెక్టివిటీ ఎంపికలలో డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11 b/g/n, బ్లూటూత్ 4.2, జిపిఎస్, మైక్రో యుఎస్‌బి పోర్ట్ మరియు 3.5mm ఆడియో జాక్ లు ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ గల ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం ఒక ఛార్జ్‌లో రెండు రోజుల లైఫ్ ను అందిస్తుంది. ఇది స్ప్లాష్-రెసిస్టెంట్ ను కలిగి ఉండి 200 గ్రాముల బరువు ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Moto G8 Power Lite Goes on Sale at Rs.9,499 Today via Flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X