మోటో G82 5G మొదటి సేల్స్ లో భారీ డిస్కౌంట్లు!! అదనంగా రూ.5,049 విలువైన జియో ప్రయోజనాలు

|

మోటరోలా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటో ఇండియాలో గతవారం మోటో G82 5G మిడ్-రేంజ్ మోడల్‌ను విడుదల చేసింది. 120Hz AMOLED డిస్‌ప్లే మరియు ట్రిపుల్ రియర్ కెమెరా, ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 SoC వంటి గొప్ప ఫీచర్లతో లభించే ఈ మిడ్-రేంజ్ ఫోన్ నేడు ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్ మరియు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌ల ద్వారా మొదటిసారి కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రానున్నది. 5G స్మార్ట్‌ఫోన్ విభాగంలో రెడ్మీ నోట్ 11 ప్రో+, వన్‌ప్లస్ నార్డ్ CE 2 లైట్ వంటి ప్రీమియం ఫోన్లతో పోటీపడే దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

మోటో G82 5G స్మార్ట్‌ఫోన్ ధరలు & మొదటి సేల్స్ ఆఫర్లు

మోటో G82 5G స్మార్ట్‌ఫోన్ ధరలు & మొదటి సేల్స్ ఆఫర్లు

మోటో G82 5G మిడ్-రేంజ్ కొత్త స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రెండు విభిన్న వేరియంట్లలో లాంచ్ అయింది. ఇందులో 6GB RAM + 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ యొక్క ధర రూ.21,499 కాగా 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌ మోడల్ రూ.22,999 ధరను కలిగి ఉంది. ఈ రోజు మధ్యాహ్నం 12PM నుంచి ఫ్లిప్‌కార్ట్ మరియు రిలయన్స్ డిజిటల్ ద్వారా మొదలయ్యే మొదటి సేల్ లో దీనిని మెటోరైట్ గ్రే మరియు వైట్ లిల్లీ వంటి కలర్ ఎంపికలలో కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌ల ద్వారా ఇది అందుబాటులో ఉంటుంది. ఈ రోజు ప్రారంభమయ్యే మొదటి సేల్స్ లో SBI క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి కొనుగోలు చేసే వారికి రూ.1,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా రూ.5,049 విలువైన రిలయన్స్ జియో యొక్క ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

తెలంగాణలో రూ.24,000 కోట్ల విలువైన కొత్త ప్రాజెక్ట్!! 3000లకుపైగా జాబ్స్తెలంగాణలో రూ.24,000 కోట్ల విలువైన కొత్త ప్రాజెక్ట్!! 3000లకుపైగా జాబ్స్

మోటో G82 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ వివరాలు

మోటో G82 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ వివరాలు

మోటో G82 5G స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 12తో రన్ అవుతుంది. ఇది 20:9 యాస్పెక్ట్ రేషియో మరియు 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల ఫుల్-HD+ (1,080x2,400 పిక్సెల్‌లు) AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే హుడ్ కింద స్నాప్‌డ్రాగన్ 695 SoC తో శక్తిని పొందుతూ 8GB వరకు LPDDR4X RAMతో జతచేయబడి లభిస్తుంది. అలాగే ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫ్యూన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మద్దతుతో పాటుగా f/1.8 లెన్స్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంది. కెమెరా సెటప్‌లో అల్ట్రా-వైడ్ షూటర్ & డెప్త్ సెన్సార్‌గా 8-మెగాపిక్సెల్ మరియు 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్‌ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్ కోసం ఫోన్ ముందు భాగంలో f/2.2 లెన్స్‌తో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది.

Airtel కొత్తగా 'స్మార్ట్ మిస్డ్ కాల్ అలర్ట్' ఫీచర్‌ని ప్రారంభించింది!! ప్రయోజనాలు ఎలా ఉన్నాయో తెలుసాAirtel కొత్తగా 'స్మార్ట్ మిస్డ్ కాల్ అలర్ట్' ఫీచర్‌ని ప్రారంభించింది!! ప్రయోజనాలు ఎలా ఉన్నాయో తెలుసా

 

 

మోటో G82 5G

మోటో G82 5G స్మార్ట్‌ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.1, GPS/ A-GPS, NFC, USB టైప్-C మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. బోర్డులోని సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్, సామీప్య సెన్సార్ మరియు సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటివి ఉన్నాయి. దీనితో పాటుగా ఇది డాల్బీ అట్మోస్ మద్దతుతో డ్యుయల్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంటాయి. ఇది 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇది మైక్రో SD కార్డ్ ద్వారా మెమొరీని 1TB వరకు విస్తరించడానికి మద్దతున ఇస్తుంది. చివరిగా ఇది 30W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Best Mobiles in India

English summary
Moto G82 5G Smartphone First Sale Starts Today in India Via Flipkart and Reliance Digital: Price, Specs sales Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X