Home
News

12GB ర్యామ్‌, 5000mAh బ్యాటరీ మోటో స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు.. స్పెసిఫికేషన్లు, సేల్‌ వివరాలు..!

మోటోరోలో ఇటీవల తన విక్రయాలను పెంచుకొనేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు (Motorola Smartphones Pricecut) తెలుస్తోంది. రెండు రోజుల క్రితం తన మోటో G54 5G స్మార్ట్‌ఫోన్‌ ధరను రూ.3000 తగ్గించింది. అయితే తాజాగా మరో హ్యాండ్‌సెట్‌ ధర తగ్గింపుపై నిర్ణయం తీసుకుంది. మిడ్‌ రేంజ్‌ స్మార్ట్‌ఫోన్‌ మోటో G84 స్మార్ట్‌ఫోన్‌ ధరను తగ్గించింది.

ఆండ్రాయిడ్ 14కు అప్‌డేట్‌ : మోటో G84 5G స్మార్ట్‌ఫోన్‌ (Moto G84 5G) ఆండ్రాయిడ్‌ 13 OSను కలిగి ఉంటుంది. ఈ OS త్వరలో ఆండ్రాయిడ్ 14కు అప్‌డేట్‌ అవుతుంది. ఈ హ్యాండ్‌సెట్‌ పుల్‌ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. మరియు క్వాల్‌కాం చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది.

 moto-g84-5g-smartphone-price-drop-in-india

10 శాతం అదనపు తగ్గింపు : మోటో G84 స్మార్ట్‌ఫోన్‌ 12GB ర్యామ్‌, 256GB స్టోరేజీతో గత సంవత్సరం సెప్టెంబర్‌లో రూ.19,999 ధరకు లాంచ్ అయింది. ప్రస్తుతం ఈ ఫోన్‌ ధరను రూ.1000 తగ్గించింది. దీంతోపాటు బ్యాంక్ ఆఫ్‌ బరోడా కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం అదనపు తగ్గింపును పొందవచ్చని మోటో వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ మిడ్‌నైట్‌ బ్లూ, వివా మెజెంటా, బ్లూ మార్ష్‌మల్లా రంగుల్లో అందుబాటులో ఉంది.

మోటో G84 5G స్పెసిఫికేషన్లు : ఈ మోటో స్మార్ట్‌ఫోన్‌ 6.55 అంగుళాల పుల్‌ HD+ pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 1080*2400 పిక్సల్‌ రిజల్యూషన్‌తో వస్తుంది. ఈ స్క్రీన్‌ 1300 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్ సహా 120Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంటుంది. 240Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌తో వస్తుంది.

 moto-g84-5g-smartphone-price-drop-in-india

స్టోరేజీని 1TB వరకు పెంచుకోవచ్చు : ఈ హ్యాండ్‌సెట్‌ ఆక్టా కోర్‌ క్వాల్‌కాం స్నా్ప్‌ డ్రాగన్‌ 695 చిప్‌సెట్‌ 12GB ర్యామ్‌తో జతచేయబడి ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత My UX OSపైన పనిచేస్తుంది. మరియు ఈ స్మార్ట్‌ఫోన్‌ 256GB గరిష్ఠ అంతర్గత స్టోరేజీని కలిగి ఉంది. మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.

మోటో G84 5G కెమెరా వివరాలు : మోటో G84 5G స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. f/1.8 అపేచర్‌తో కూడిన 50MP ప్రధాన కెమెరా సహా 8MP రెండో కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ హ్యాండ్‌సెట్‌ ముందువైపు 16MP కెమెరాతో వస్తుంది.

 moto-g84-5g-smartphone-price-drop-in-india

మోటో G84 ఫోన్‌ 30W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. మరియు IP54 రేటింగ్‌తో వాటర్‌ రెసిస్టెన్స్‌తో రానుంది. ఈ ఫోన్‌ డ్యూయల్‌ సిమ్‌కార్డును సపోర్టు చేయనుంది. మోటోరోలా స్టోర్‌ సహా ఇతర ఈ కామర్స్‌ ప్లాట్‌ఫాంలో తగ్గింపు ధరకు ఈ హ్యాండ్‌సెట్‌ అందుబాటులో ఉంది.

* మోటో G54 5G స్మార్ట్‌ఫోన్‌ ధరను రూ.3000 తగ్గిస్తూ సంస్థ రెండు రోజుల క్రితం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మోటోరోలా ఆన్‌లైన్‌ స్టోర్‌ సహా ప్రముఖ ఈ కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌లో మోటో G54 5G స్మార్ట్‌ఫోన్‌ బేస్‌ వేరియంట్‌ (8GB ర్యామ్ +128GB) ధర రూ.13999గా ఉంది అదే 12GB ర్యామ్ +256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.15,999గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Moto G84 5G smartphone price slashed in india specs and sale details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X