Moto Tab G62 టాబ్లెట్ విడుదలైంది!! ధరల మీద ఓ లుక్ వేయండి...

|

మోటరోలా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ నేడు భారతదేశంలో మోటో ట్యాబ్ G62 టాబ్లెట్ ని లాంచ్ చేసింది. ఈ టాబ్లెట్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 680 SoC ద్వారా శక్తిని పొందుతూ 4GB LPDDR4X RAMతో జతచేయబడి అందించబడింది. ఇది 2K+ రిజల్యూషన్‌తో 10.61-అంగుళాల IPS LCD డిస్‌ప్లేను 16:10 యాస్పెక్ట్ రేషియో మరియు TUV రైన్‌ల్యాండ్ బ్లూ లైట్ ఎమిషన్ సర్టిఫికేషన్‌తో లభిస్తుంది. వెనుక భాగంలో 8-మెగాపిక్సెల్ ఆటో-ఫోకస్ సింగిల్ రియర్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఇందులోని మరిన్ని గొప్ప ఫీచర్ల గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

మోటో ట్యాబ్ G62 టాబ్లెట్ ధరల వివరాలు

మోటో ట్యాబ్ G62 టాబ్లెట్ ధరల వివరాలు

మోటో ట్యాబ్ G62 టాబ్లెట్ ఇండియాలో రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. ఇందులో Wi-Fi-ఓన్లీ వేరియంట్ యొక్క ధర రూ.15,999 కాగా LTE వేరియంట్ రూ.17,999 ధర వద్ద ఫ్రాస్ట్ బ్లూ కలర్ ఎంపికలో లభిస్తుంది. ఈ టాబ్లెట్ యొక్క Wi-Fi వేరియంట్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. అయితే మోటో ట్యాబ్ G62 టాబ్లెట్ యొక్క LTE వేరియంట్ ప్రస్తుతం ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది. ఇది ఫ్లిప్‌కార్ట్ లో ఆగస్టు 22 మధ్యాహ్నం 12 గంటల నుండి విక్రయించబడుతుంది.

మోటో ట్యాబ్ G62 టాబ్లెట్ స్పెసిఫికేషన్స్

మోటో ట్యాబ్ G62 టాబ్లెట్ స్పెసిఫికేషన్స్

మోటో ట్యాబ్ G62 టాబ్లెట్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ 12లో రన్ అవుతూ 4G నెట్‌వర్క్‌లకు మద్దతునిస్తుంది. ఇది ఒకే ఒక నానో-సిమ్ స్లాట్ మరియు ప్రత్యేక మైక్రో SD కార్డ్ స్లాట్‌ను కలిగి ఉంటుంది. ఈ టాబ్లెట్ 2K+ (2,000x1,200 పిక్సెల్‌లు) రిజల్యూషన్, 16:10 యాస్పెక్ట్ రేషియో మరియు TUV రైన్‌ల్యాండ్ బ్లూ లైట్ ఎమిషన్ సర్టిఫికేషన్‌తో 10.61-అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే LTE వేరియంట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 SoC ద్వారా శక్తిని పొందుతూ 4GB LPDDR4X RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జత చేయబడి ఉంటుంది. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్ ను 1TB వరకు పొడిగించవచ్చు. ఇది దుమ్ము మరియు నీటి నిరోధకత కోసం IP52 రేటింగ్‌ను కూడా పొందుతుంది.

ఆప్టిక్స్

మోటో ట్యాబ్ G62 టాబ్లెట్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఇది 8-మెగాపిక్సెల్ ఆటో-ఫోకస్ బ్యాక్ కెమెరాను కలిగి ఉంది. ఇది 30fps వద్ద గరిష్టంగా 1080p వీడియోలను రికార్డ్ చేయగలదు. ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ ఫిక్స్‌డ్-ఫోకస్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఇది 30fps వద్ద గరిష్టంగా 1080p వీడియోలను రికార్డ్ చేయగలదు. సెల్ఫీ షూటర్‌లో డ్యూయల్ క్యాప్చర్, స్పాట్ కలర్, టైమ్‌లాప్స్, ఫేస్ బ్యూటీ, వీడియో స్నాప్‌షాట్ మరియు ఎఫిషియెంట్ వీడియోలు వంటి కొన్ని కెమెరా మోడ్‌లు కూడా ఉన్నాయి.

క్వాడ్ స్పీకర్ సెటప్‌

మోటో ట్యాబ్ G62 టాబ్లెట్ డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో క్వాడ్ స్పీకర్ సెటప్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో ఇది బ్లూటూత్ v5.1, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, USB టైప్-C పోర్ట్ మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ను కలిగి ఉంది. ఇది GPS/ A-GPS మరియు GLONASS వంటి ఫీచర్లను కూడా కలిగి ఉంది. టాబ్లెట్‌లో ఫేస్ అన్‌లాక్, యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, హాల్ సెన్సార్ మరియు గైరోస్కోప్ వంటివి కూడా ఉన్నాయి. ఇది 20W ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,700mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Best Mobiles in India

English summary
Moto Tab G62 Tablet Launched in India With 7,700mAh Large Battery: Price, Specs, Features and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X