మోటో X4 లాంచ్, ఫీచర్లు అదుర్స్..!

By: Madhavi Lagishetty

ఎన్నో రూమర్లు...మరెన్నో అంచనాల మధ్య చివరకు మోటో ఎక్స్ 4 అధికారింగా లాంచ్ అయ్యింది. ఊహించిన విధంగానే స్మార్ట్ ఫోన్ IFA2017 టెక్ ఫోలో ఈ స్మార్ట్ ఫోన్ను విడుదల చేశారు.

మోటో X4 లాంచ్, ఫీచర్లు అదుర్స్..!

మోటో ఎక్స్ 4 లో అట్రాక్ట్ చేసే ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. వాటర్ , డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP68సర్టిఫికేట్ తో వస్తుంది. అమెజాన్ అలెక్సాకు సపోర్ట్ చేసే మెయిన్ ఫీచర్ను కలిగి ఉంది. డ్యుయల్ రెర్ కెమెరా, రియల్ టైమ్ డెప్త్ సెటప్ మోటో ఎక్స్ 4 హైలెట్స్ అని చెప్పొచ్చు. డ్యుయల్ కెమెరా సెటప్ తో ల్యాండ్ మార్క్ మరియు ఆబ్జెక్ట్ రికగ్నైజ్ కోసం, బిజినెస్ కార్డులు, బార్ కోడ్లు, QRకోడ్స్ ను స్కాన్ చేయడానికి ఉపయోగించవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిజైన్ మరియు డిస్ ప్లే...

మోటో ఎక్స్ 4 డిజైన్ మరియు డిస్ ప్లే విషయానికొస్తే...ఫేమిలర్ గ్లాస్, మెటర్ డిజైన్ తో పాటు డివైజ్ బ్యాక్, ఫ్రంట్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. డ్యుయల్ కెమెరా మాడ్యూల్ సర్క్యూలర్ విజర్ తో చుట్టబడి ఉంటుంది. ఈ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ 5.2అంగుళాల ఫుల్ హెచ్ డి, 1080 పిక్సెల్స్ డిస్ ప్లేను కలిగి ఉంది.

ఇక హార్డ్ వేర్ స్పెక్స్ చూసినట్లయితే...మోటో ఎక్స్ 4 ఆక్టాకోర్ స్నాప్ డ్రాగెన్ 630SoC పవర్తో వస్తుంది. ఈ డివైస్ ను రెండు వేరియంట్స్ లో ప్రకటించారు. ఈ మోటా ఎక్స్ 4 ఫోన్ 3జిబి ర్యామ్, 32జిబి స్టోరేజ్ వేరియంట్ గాను, ఇతర గ్లోబల్ మార్కెట్లకు 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజ్ ఆప్షన్ తో వస్తుంది.

3000ఎంఏహెచ్ బ్యాటరీతోపాటు, దాని హుడ్ కింద ఉన్న ఫోన్ను టర్బో ఛార్జింగ్ మద్దతుతో కేవలం 15నిమిషాల్లో 6గంటల వరకు నిరంతరంగా ఫోన్ను వాడుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్ తో స్టాక్ UI బాక్స్ ప్రారంభించబడింది. ఈ హ్యాండ్ సెట్లో 4జి ఎల్టీఈ, Wi-Fi, బ్లుటూత్ 5.0, NFC, GPS, 3.5mm ఆడియో జాక్ మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి.

డ్యుయల్ కెమెరా...

మోటో ఎక్స్ 4 ఆటోఫోకస్ పిక్సెల్ టెక్నాలజీతో ఉన్న డ్యుయల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. బ్యాక్ సైడ్ వైడ్ యాంగిల్ లెన్స్ తో పాటు ప్రైమరీ 12మెగాపిక్సెల్ సెన్సర్, సెకండరీ 8మెగాపిక్సెల్ సెన్సార్ను కలిగి ఉంటుంది. ఇది బాకే ఎఫెక్ట్ అనే డెప్త్ ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ ను కాప్చర్ చేసే ఎబిలిటీని కలిగి ఉంటుంది.

వినియోగదారులు ల్యాండ్ మార్క్ డిటెక్షన్ ఫీచర్ ద్వారా కెమెరా యాప్ లోని లోకేషన్ వివరాలు తెలుసుకునేందుకు సహాయపడుతుంది. ఫేస్ ఫిల్టర్లను ఫీచర్ ఫోటోలు మరియు వీడియోలకు యానిమేషన్ యాడ్ చేయడానికి అనుమతిస్తుంది. ఫ్రంట్ సైడ్ f/2.0ఎపర్చరు, LED ఫ్లాష్ తో 16మెగాపిక్సెల్ సెల్ఫీస్నాపర్ ఉంటుంది. ఇది తక్కువ కాంతిలోనూ సెల్ఫీలు తీసుకునుందుకు సపోర్ట్ చేస్తుంది.

అమెజాన్ అలెక్సా మరియు ఇతర ఫీచర్స్...

మోటో ఎక్స్ 4 యొక్క ఇన్బిల్ట్ అమెజాన్ అలెక్సాలో ఉంది. డివైస్ లాక్ అయితే...వాయిస్ కమాండ్ ద్వారా యాక్సిస్ చేయబడుతుంది. అమెజాన్ అలెక్సాచే సపోర్ట్ ఉన్న అన్ని మార్కెట్లకు ఈ ఫీచర్ లభిస్తుంది.

వాయిస్ అసిస్టెంట్ కు సపోర్ట్ గా కాకుండా, మోటోకీ4, మోటో కీ క్విక్ స్ర్కీన్ షాట్, కొత్త వైర్లెస్ ఆడియో స్ట్రీమింగ్ ఫీచర్ వంటి న్యూ ఫీచర్సతో ప్రీలోడెడ్, మోటోకీ స్మార్ట్ ఫోన్లో ఒక ట్యాప్తో ల్యాప్ టాప్ మరియు పీసీలో వినియోగదారుల పాస్ వర్డ్-ప్రొటెక్టెడ్ వెబ్ పేజీలను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుది.

క్విక్ స్క్రీన్ షాట్ వినియోగదారులు మూడు వేళ్లతో స్క్రీన్ పై నొక్కడంతో స్క్రీన్ షాట్ ను తీసుకోవచ్చు. వైర్లెస్ ఆడియో స్ట్రీమింగ్ ఆప్షన్ అదే సమయంలో డివైస్ 4 వైర్లెస్ స్పీకర్లకు కనెక్ట్ చేయడానికి అనుమతిస్తుంది.

ఫోన్ అంటే ఇదే...

ధర మరియు లభ్యత...

మోటో ఎక్స్ 4 సూపర్ కలర్ తోపాటు స్టెర్లింగ్ బ్లూ-రెండు కలర్స్ వేరియంట్లలో రిలీజ్ చేశారు. తొలుత ఈ నెలలో యూరప్ లో ఈ హ్యాండ్ సెట్ లాంచ్ అవుతుంది. దీని బేస్ వేరియంట్ సుమారు 30,300రూపాయలు. ప్రపంచ మార్కెట్లో రానున్న కొన్నినెలల్లోనే అందుబాటుల్లో ఉండనుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Moto X4 has been launched at the IFA 2017 tech show with interesting features and specifications.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot