ఫ్లిప్‌కార్ట్‌లో మోటో ఎక్స్4

|

మోటరోలా అప్‌కమ్మింగ్ స్మార్ట్‌ఫోన్ మోటో ఎక్స్4, మరికొద్ది రోజుల్లో భారత్‌లో లాంచ్ కాబోతోంది. నవంబర్ 13న విడుదల కాబోతోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతోంది. మోటో ఎక్స్4కు సంబధించిన ప్రత్యేక బ్యానర్ పేజీని ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే తన సైట్‌లో లాంచ్ చేసింది.

 
ఫ్లిప్‌కార్ట్‌లో మోటో ఎక్స్4

ఈ ఫోన్‌కు సంబంధించి పలు లాంచ్ ఆఫర్స్‌ను కూడా త్వరలోనే అనౌన్స్ చేసే అవకాశం ఉంది. మోటో ఎక్స్ సిరీస్ నుంచి గతంలో విడుదలైన స్మార్ట్‌ఫోన్‌లను కూడా ఫ్లిప్‌కార్ట్ ద్వారానే మోటరోలా సేల్ చేయటం జరిగింది.

మోటరోలాతో మరోసారి కుదిరిన ఎక్స్‌క్లూజివ్ ఒప్పందం పై ఫ్లిప్‌కార్ట్ సీనియర్ డైరెక్టర్ (స్మార్ట్‌ఫోన్‌ల విభాగం) అయ్యప్పన్ రాజగోపాల్ స్పందిస్తూ మోటో ఎక్స్4 లాంచ్ ద్వారా తమ రెండు కంపెనీల మధ్య కుదిరిన భాగస్వామ్యం ఉన్న శిఖరాలను అధిరోహిస్తుందని అన్నారు. డిజైన్ ఇంకా పెర్ఫామెన్స్ పరంగా మోటో ఎక్స్4 సరికొత్త బెంచ్ మార్క్స్‌ను సెట్ చేస్తుందని ఆయన ధీమావ్యక్తం చేసారు.

జియో దెబ్బకు విలవిల, భారీగా నష్టపోయిన దేశీయ కంపెనీజియో దెబ్బకు విలవిల, భారీగా నష్టపోయిన దేశీయ కంపెనీ

Moto X4 స్మార్ట్‌ఫోన్‌ను బెర్లిన్ వేదికగా సెప్టంబర్‌లో జరిగిన IFA 2017 టెక్నాలజీ ట్రేడ్‌ షోలో అఫీషియల్ గా లాంచ్ చేయటం జరిగింది. ఆ తరువాత ఈ ఫోన్‌కు సంబంధించిన ఆండ్రాయిడ్ వన్ వేరియంట్‌ను కూడా మోటరోలా అనౌన్స్ చేయటం జరిగింది.

మోటో ఎక్స్4 స్పెసిఫికేషన్స్...

 • 5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఎల్టీపీఎస్ ఐపీఎస్ డిస్‌ప్లే,
 • కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,
 • ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం,
 • 2.2GHz క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 630 ఆక్టా-కోర్ సాక్,
 • 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
 • 12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్,
 • 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
 • గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్, అమెజాన్ అలెక్సా వాయిస్ ఇంటిగ్రేషన్,
 • ఫింగర్ ప్రింట్ సెన్సార్, మెటల్ యునిబాడీ డిజైన్,
 • 3000mAh బ్యాటరీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్,
 • 3.5 ఎమ్ఎమ్ ఆడియో జాక్.
Most Read Articles
Best Mobiles in India

English summary
Just confirmed, Lenovo's upcoming Moto X4 smartphone will be a Flipkart exclusive in India.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X