2018లో రానున్న మోటో ఎక్స్ 5!
ఈమధ్యనే మోటోరోలా తన నూతన స్మార్ట్ ఫోన్ మోటో ఎక్స్4ను రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయిన కొన్ని నెలల్లోనే...దానికి సీక్వెల్ గా మరో స్మార్ట్ ఫోన్ రానున్నట్లు ఆన్ లైన్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

మోటో ఇండస్ట్రి అంతర్గత ఇవాన్ బ్లాస్ ప్రకారం, మోటోలా మొబిలిటీ మోటోఎక్స్ 4 వారసుడిగా తయారు అవుతోందన్నారు. ఇది మోటో ఎక్స్ 5 గా మార్కెట్లోకి రిలీజ్ కానున్నట్లు తెలిపారు. త్వరలో రిలీజ్ కానున్న స్మార్ట్ ఫోన్ పిక్చర్ను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అయితే ఈ ఏడాది ప్రారంభంలోనే మోటో ఎక్స్ 4 లోగోను షేర్ చేసింది. అయితే ఈ స్మార్ట్ ఫోను రిలీజ్ కావడానికి ఫస్ట్ సోర్స్ ఇదేనని చెప్పవచ్చు.
మోటో ఎక్స్ 5 లోగో బహిర్గం కానప్పటికీ...ఇంటర్నల్ గా స్మార్ట్ ఫఓన్ గురించి ఎలాంటి సమాచారం అందించలేదు. మోటోరోలా సాధారణ ప్రయోగ షెడ్యూల్ ఇచ్చిన సమాచారం ప్రకారం 2018మిడిల్లో ఈ ఫోన్ను రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు మోటో ఎక్స్ 4 కేవలం కొన్ని నెలల క్రితమే విడుదల చేశారు. ఇది IFA 2017 టెక్ షోలో ఆవిష్కరించబడింది. అక్టోబర్ లో అమ్మకాలు ప్రారంభమయ్యాయి.
ఇక మోటో X లైనప్ గురించి మాట్లాడుకుంటే..ప్రీవియస్ జనరేషన్ మోడళ్లు హై ఎండ్ మరియు ప్రీమియంలు అయితే మోటో ఎక్స్ 4 ప్రీమియం డివైస్ గా రూపొందించబడింది. ఇది మిడిల్ రేంజ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ సెగ్మెంట్ కోసం ఉద్దేశించబడింది. మోటో ఎక్స్ 5 కూడా ఒక డ్యయల్ కెమెరా సెటప్ కలిగి ఉంది.
మోటో ఎక్స్ 5 ఫీచర్స్ , స్పెసిఫికేషన్స్ , మోటో ఎక్స్ 4 కంటే ఎక్కువగా యూజర్లను అట్రాక్ట్ చేయనున్నాయి. అయితే స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ కు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేవు.
మోటో ఎక్స్ 4 మాదిరిగానే...రాబోయే స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్స్ లో పనిచేయవచ్చు. 3జిబి ర్యామ్ మరియు 32జిబి స్టోరేజి మరియు స్పేస్ ను కలిగి ఉంది. 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజి స్పేస్ను కలిగి ఉంటుంది. అయితే మోటో ఎక్స్ 5 గురించి మరిన్ని వివరాల కోసం వేచి చూడాల్సిన అవసరం ఉంది.


Click it and Unblock the Notifications








