లీకైన మోటో Z4 & మోటో Z4 ఫోర్స్ మొబైల్స్ స్పెసిఫికేషన్స్

చాలా సంవత్సరాల నుంచి Motorola ఫోన్ల సమాచారాన్ని విడుదల చేస్తున్నమరో టిప్సర్ ఆండ్రీ యాటిమ్ కూడా మోటో Z4 ధర ట్యాగ్ ను వెల్లడించింది.

|

నిన్న ప్రముఖ టిప్స్టర్ ఇవాన్ బ్లాస్ రాబోయే Moto Z4 ఫోన్ యొక్క అన్ని ఫీచర్స్ మరియు ప్రైస్ గురించి బహిర్గతం చేసింది.

moto z4 and z4 force price and specifications leaked

చాలా సంవత్సరాల నుంచి Motorola ఫోన్ల సమాచారాన్ని విడుదల చేస్తున్నమరో టిప్సర్ ఆండ్రీ యాటిమ్ కూడా మోటో Z4 ధర ట్యాగ్ ను వెల్లడించింది. అంతేకాకుండా Moto Z4 ఫోర్స్ ఫ్లాగ్షిప్ ఫోన్ కీ లక్షణాలు మరియు ధరను కూడా వెల్లడించారు.

మోటో Z4 స్పెసిఫికేషన్స్

మోటో Z4 స్పెసిఫికేషన్స్

Yatim ద్వారా షేర్ చేయబడిన సమాచారం ప్రకారం Moto Z4 ఫుల్ HD + రిజల్యూషన్ మద్దతుతో 6.4-inch OLED డిస్ప్లే ఉంటుంది. ఈ మొబైల్ లో స్క్రీన్ పై ఫింగర్ ప్రింట్ రీడర్ పొందుపర్చబడి ఉంటుంది. స్నాప్ డ్రాగన్ 675 మొబైల్ ప్లాట్ఫాం స్మార్ట్ ఫోన్ కు ఇంధనంగా ఉంటుంది. Soc 6 GB RAM తో మద్దతు ఇస్తుంది. హ్యాండ్ సెట్ 128 GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది.

కెమెరా విషయంలో ఫోన్ వెనుక వైపు భాగానికి 48M మెగాపిక్సెల్ యొక్క స్మార్ట్ AI కెమెరా f /1.6 ఎపర్చరు ఉంటుంది.సెల్ఫీస్ కోసం మొబైల్ ముందు వైపు f/1.9 ఎపర్చరుతో 24.8-మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. హ్యాండ్ సెట్ కు 3,632mAh సామర్థ్యం గల బ్యాటరీ ఉంటుంది. టర్బో ఛార్జ్ వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీకి మద్దతుతో ఇది రాబోతుందని తెలిసింది.

 

మోటో Z4 ధరలు:

మోటో Z4 ధరలు:

మోటో Z4 ఒక సరసమైన ధర $ 399కు అందుబాటులో ఉండవచ్చు. Moto G4 4GB RAM + 64 GBస్టోరేజి మరియు 6 GB RAM + 128 GBస్టోరేజి వంటి వేరియంట్లలో విడుదల అవుతుందని గత నివేదికలు పేర్కొన్నాయి.

మోటో Z4 ఫోర్స్ స్పెసిఫికేషన్స్:

మోటో Z4 ఫోర్స్ స్పెసిఫికేషన్స్:

మోటో Z4 ఫోర్స్ స్నాప్డ్రాగెన్ 855 మొబైల్ ప్లాట్ఫారమ్ ద్వారా విడుదలయ్యే ఒక అధునాతన ఫోన్. Tipster Z4 ఫోర్స్ స్మార్ట్ ఫోన్ యొక్క వివరాలు షేర్ చేయలేదు. అది మోటో Z4 అదే ఫీచర్స్ తో రావచ్చు అనే అవకాశం ఉంది. ఇందులో కూడా స్క్రీన్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ సిస్టమ్ ఉంటుంది.

కెమెరా విషయంలో ఫోన్ వెనుక వైపు భాగానికి 48M మెగాపిక్సెల్ యొక్క స్మార్ట్ AI కెమెరా f /1.6 ఎపర్చరుతో మరియు 13-మెగాపిక్సిల్ సెకండరీ కెమెరా f/2.0ఎపర్చరుతో ఉంటుంది.సెల్ఫీస్ కోసం మొబైల్ ముందు వైపు f/1.9 ఎపర్చరుతో 24.8-మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. హ్యాండ్ సెట్ కు 3,230mAh సామర్థ్యం గల బ్యాటరీ ఉంటుంది. టర్బో ఛార్జ్ వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీకి మద్దతుతో ఇది రాబోతుందని తెలిసింది.

 

మోటో Z4 ఫోర్స్ ధరలు:

మోటో Z4 ఫోర్స్ ధరలు:

ఇది 6 GB RAM+128 GB ఇంటర్నల్ స్టోరేజీతో SD 855చిప్సెట్ తో మోటో Z4 ఫోర్స్ అందుబాటులోకి వస్తుంది. మోటో Z4 ఫోర్స్ధర $650కు మార్కెట్ లో అందుబాటులోకి ఉంటుంది.

Best Mobiles in India

English summary
moto z4 and z4 force price and specifications leaked

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X