ఈ యాప్ మీ చెంత ఉంటే ట్రాఫిక్ ఫైన్ గండం నుంచి గట్టెక్కినట్లే

By Gizbot Bureau
|

ఇప్పుడు దేశ వ్యాప్తంగా ట్రాఫిక్ రూల్స్ కఠినతరం చేశారు. ట్రాఫిక్ చెకింగ్ సమయంలో వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలను చూపించాల్సిందే. లేదంటే ట్రాఫిక్ పోలీసుల నుంచి భారీ జరిమానాలు తప్పవు. ఎన్ని జాగ్ర్తత్తలు తీసుకున్నా, ఒక్కోసారి కొన్ని రకాల పత్రాలు మరచిపోతుంటాం. కాబట్టి ప్రతీ సారి హార్డ్ కాపీలను వాహనంతో పాటు తీసుకెళ్లాల్సిందే. ఈ నేపథ్యంలో పత్రాలన్నీ ఒకచోట పెట్టుకునేందుకు ఏవైనా యాప్స్ ఉన్నాయా అని చాలామంది వెతుకుంటారు. అలాంటి వారికోసం ఆన్ లైన్ లో కొన్ని యాప్స్ సిద్ధంగా ఉన్నాయి. డిజిలాకర్, ఎంపరివాహన్ అనే యాప్స్ వారి కోసం సిద్ధంగా ఉన్నాయి.

Digilocker

Digilocker

నేషనల్ డిజిటల్ లాకర్ సిస్టమ్ గా పిలిచే Digilocker యాప్ లో మీ వాహనాలకు సంబంధించిన పత్రాలు అన్నీ భద్రపరుచుకోవచ్చు. ట్రాఫిక్ పోలీసు చెకింగ్ సమయాల్లో నేరుగా ఈ యాప్ నుంచే వారికి చూపించవచ్చు. హార్డ్ కాపీలను చూపించలేనప్పుడు డీజీ లాకర్ యాప్ ద్వారా పత్రాలను చూపించి జరిమానాల నుంచి తప్పించుకోవచ్చు. 

డిజిలాకర్ అకౌంట్

డిజిలాకర్ అకౌంట్

అయితే ఇందుకోసం వాహనదారులు తప్పనిసరిగా డిజిలాకర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో తమ వాహనానికి సంబంధించిన ఆర్ సీ, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులు భద్రపరుచుకోవచ్చు. ట్రాఫిక్ పోలీసులు వాహనాలు చెకింగ్ చేసే సమయాల్లో వాహనదారులు డిజిలాకర్ ద్వారా సాఫ్ట్ కాపీ పత్రాలను చూపించవచ్చునని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. 

ట్విట్టర్ వేదికగా సందేహాలు 
 

ట్విట్టర్ వేదికగా సందేహాలు 

చాలామంది వాహనదారులు సోషల్ మీడియా వేదికగా తమ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. హార్డ్ కాపీ తప్పనిసరిగా ఉండాలా లేదా సాఫ్ట్ కాపీ ఉంటే సరిపోతుందా? అనేదానిపై ట్రాఫిక్ పోలీసులకు ట్విట్టర్ వేదికగా సందేహాలు వ్యక్తం చేశారు. దీనిపై బెంగుళూరు సిటీ ట్రాఫిక్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. మోటార్ వెహికల్ యాక్ట్ 1988 కింద రవాణా శాఖ అధికారులు జారీ చేసిన వాహన డాక్యుమెంట్లు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, ఇన్సూరెన్స్ సహా ఇతర డాక్యుమెంట్లు ఏమైనా సరే Digilocker లేదా mParivahan ప్లాట్ ఫాంల్లో ఉంటే అన్ని చెల్లుబాటు అవుతాయి. మినిస్టరీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ ఫోర్ట్ అండ్ హైవేస్ (MoRTH) జారీ చేసిన అడ్వైజరీ ప్రకారం ఈ పత్రాలన్నీ చెల్లుబాటు అవుతాయని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. 

సెప్టెంబర్ 2 నుంచి కర్ణాటకలో 

సెప్టెంబర్ 2 నుంచి కర్ణాటకలో 

ఈ కొత్త రూల్స్ సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కాగా సెప్టెంబర్ 2 నుంచి కర్ణాటకలో అమల్లోకి తెచ్చారు. ఇదిలా ఉంటే బెంగళూరు నివాసికి పదేపదే ట్రాఫిక్ ఉల్లంఘించినందుకు అతడికి రూ.17వేల వరకు భారీగా జరిమానా విధించారు. ఇతను హెల్మట్ ధరించకుండా లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ దొరికాడు. అందులోనూ అతడు మద్యం సేవించి ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ కారణాలతో బెంగుళూరు ట్రాఫిక్ పోలీసులు అతడికి భారీ జరిమానా విధించారు.

Best Mobiles in India

English summary
Motorists can show docs in Digilocker during traffic checks: Bengaluru cops' U-turn

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X