Home
News

Motorola కొత్త 4K ఆండ్రాయిడ్ టీవీ స్టిక్ లాంచ్!! సరసమైన ధరలోనే...

ఇండియాలో మోటరోలా సంస్థ నేడు మరొక కొత్త డివైస్ ను విడుదల చేసింది. మోటరోలా యొక్క 4K ఆండ్రాయిడ్ టివి స్టిక్ ను రూ.3,999 ధర వద్ద విడుదల చేసింది. దీనిని ఈ నెల మూడవ వారంలో ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నది. సరసమైన ధరలో లభించే ఈ స్ట్రీమింగ్ స్టిక్ 4K HDR మరియు బాహ్య స్మార్ట్ కనెక్టివిటీకి మద్దతు ఇవ్వడానికి ఉపయోగించబడుతుంది. ఇది నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్ మరియు Zee5 తో సహా కీ స్ట్రీమింగ్ యాప్ లు మరియు వాటి యొక్క సర్వీసుల మద్దతుతో ఆండ్రాయిడ్ టీవీ 9 పై రన్ అవుతుంది. ఇది HDR ఫార్మాట్‌లలో అల్ట్రా-హెచ్‌డి మరియు 3840x2160 పిక్సెల్స్ రిజల్యూషన్ల వరకు వీడియో కంటెంట్‌ను ప్రసారం చేయడానికి కూడా ఈ స్ట్రీమింగ్ స్టిక్ అనుమతిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

మోటరోలా 4K ఆండ్రాయిడ్ టీవీ స్టిక్ ధరలు & లభ్యత

మోటరోలా 4K ఆండ్రాయిడ్ టీవీ స్టిక్ ధరలు & లభ్యత

మోటరోలా 4K ఆండ్రాయిడ్ టివి స్టిక్ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ప్రారంభించబడింది. అలాగే ఈ ప్లాట్‌ఫారమ్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్న వివిధ బ్రాండ్ల యొక్క స్ట్రీమింగ్ స్టిక్స్ మరియు బాక్స్‌లకు పోటీగా ఈ నెల మూడవ వారం నుంచి కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రానున్నది. మోటరోలా, నోకియా మరియు మార్క్యూ బ్రాండ్‌తో సహా వివిధ లైసెన్స్ పొందిన స్ట్రీమింగ్ స్టిక్స్ బ్రాండ్లను ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే మార్కెట్ చేస్తుంది. మోటరోలా 4K ఆండ్రాయిడ్ టీవీ స్టిక్ రూ.3,999 ధరను కలిగి ఉంది. దీనిని ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా పొందవచ్చు. భారతదేశంలో ఇది Mi బాక్స్ 4K మరియు అమెజాన్ ఫైర్ టివి స్టిక్ 4K ల నుండి బలమైన పోటీని ఎదురుకోనున్నది.

మోటరోలా 4K ఆండ్రాయిడ్ టీవీ స్టిక్ స్పెసిఫికేషన్స్

మోటరోలా 4K ఆండ్రాయిడ్ టీవీ స్టిక్ స్పెసిఫికేషన్స్

మోటరోలా సంస్థ యొక్క 4K ఆండ్రాయిడ్ టివి స్టిక్ 60fps ‌లో 4K HDR వీడియో స్ట్రీమింగ్ ను అనుమతిస్తుంది. దీని యొక్క ముఖ్యమైన ఫీచర్లలో ఒకటి ఈ ఆండ్రాయిడ్ టివి స్టిక్ ఆండ్రాయిడ్ టివి 9 పై రన్ అవ్వడం. ఇది నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్ మరియు Zee5 వంటి స్ట్రీమింగ్ సేవలను చూడడానికి వీలుగా వీటికి యాక్సిస్ ను అందిస్తుంది. ఈ డివైస్ 2GHz కార్టెక్స్ A53 క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అలాగే ఇది 2GB RAM మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉండి HLG మరియు HDR10 ఫార్మాట్‌లకు డ్యూయల్-బ్యాండ్ వై-ఫై అనుకూలతతో పాటుగా HDR మద్దతును కలిగి ఉంది.

మోటరోలా 4K ఆండ్రాయిడ్ టీవీ స్టిక్ ఫీచర్స్

మోటరోలా 4K ఆండ్రాయిడ్ టీవీ స్టిక్ ఫీచర్స్

ఇండియాలో ఇప్పటికే విడుదల అయిన చాలా ఆండ్రాయిడ్ టీవీ డివైస్ ల మాదిరిగానే మోటరోలా 4K ఆండ్రాయిడ్ టీవీ స్టిక్ అంతర్నిర్మిత క్రోమ్‌కాస్ట్‌ను కలిగి ఉంది. దీనిలో లభించే రిమోట్ లో గూగుల్ అసిస్టెంట్‌కు యాక్సిస్ ను కలిగి ఉంది. దీని యొక్క రిమోట్‌లో నాలుగు స్ట్రీమింగ్ సేవలకు హాట్‌కీలు కూడా ఉన్నాయి. అలాగే దీని ప్లాట్‌ఫామ్ లో అదనపు యాప్ లు మరియు గేమ్ లను డౌన్‌లోడ్ చేయడానికి Android TV కోసం Google Play Store ని యాక్సెస్ చేయగలవు. ఈ డివైస్ టీవీ యొక్క HDMI పోర్ట్‌లోకి ప్లగ్ చేస్తుంది మరియు Wi-Fi మరియు బ్లూటూత్ ద్వారా స్మార్ట్ కనెక్టివిటీతో స్వతంత్ర డివైస్ గా పనిచేస్తుంది.

Best Mobiles in India

English summary
Motorola 4K Android TV Stick Released in India: Price, Specs, Sale Date, Features and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X