Moto Tab G62, G62 LTE టాబ్లెట్ల వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి...
మోటరోలా బ్రాండ్ స్మార్ట్‌ఫోన్లతో పాటుగా టాబ్లెట్ లను కూడా విడుదల చేస్తూ వినియోగదారులను తనవైపుకు ఆకట్టుకున్నది. ఇటీవల ఈ సంస్థ ఇండియాలో బడ్జెట్ మరియు మిడ్-రేంజ్ ధరలో రెండు స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. అయితే మరికొన్ని రోజులలో తన యొక్క టాబ్లెట్లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. మోటరోలా సంస్థ మోటో ట్యాబ్ G62 మరియు మోటో ట్యాబ్ G62 లైట్ పేరుతో విడుదల చేయనున్న రెండు టాబ్లెట్ ల యొక్క ఫోటోలను మరియు వాటి యొక్క స్పెసిఫికేషన్‌ల వివరాలను ఇప్పుడు ఆన్‌లైన్‌లో లీక్ చేసింది.

మోటరోలా సంస్థ యొక్క కొత్త టాబ్లెట్లకు సంబందించిన ఆన్‌లైన్ లీక్ వివరాల ప్రకారం మోటో ట్యాబ్ G62 కేవలం Wi-Fi మోడల్‌గా ఉండే అవకాశం ఉంది. అయితే మరొకటి 4G కనెక్టివిటీ ఎంపికతో వచ్చే అవకాశం ఉంది. ఈ టాబ్లెట్‌లు గూగుల్ ప్లే కన్సోల్‌లో కనిపించిన వాటి వివరాలను టిప్‌స్టర్ షేర్ చేసింది. ఆన్‌లైన్‌లో జాబితా చేయబడిన స్పెసిఫికేషన్ల ఆధారంగా చూసుకుంటే కనుక కొత్త టాబ్లెట్‌లు ఈ సంవత్సరం జనవరిలో భారతదేశంలో లాంచ్ అయిన మోటో ట్యాబ్ G70 LTE యొక్క అప్ గ్రేడ్ గా ఉంటాయని ఊహించబడింది. దీనికి సంబందించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Moto Tab G62, Moto Tab G62 LTE టిప్‌స్టర్ లీక్స్
టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ట్విట్టర్ లో షేర్ చేసిన వివరాల ప్రకారం మోటో ట్యాబ్ G62 మరియు మోటో ట్యాబ్ G62 LTE టాబ్లెట్‌లు రెండు వరుసగా XT2261-1 మరియు XT2261-2 మోడల్ నంబర్‌లను కలిగి ఉన్నాయి. అలాగే ఈ రెండు టాబ్లెట్‌లు డేటెడ్ క్వాల్‌కామ్ యొక్క స్నాప్‌డ్రాగన్ SoCల ద్వారా శక్తిని పొందుతాయి. ఇందులో Wi-Fi వెర్షన్ 2020 సంవత్సరంలో విడుదల అయిన స్నాప్‌డ్రాగన్ 678 SoC చిప్ ద్వారా అందించబడుతుందని సమాచారం. అలాగే దీని యొక్క 4G మోడల్ హుడ్ కింద స్నాప్‌డ్రాగన్ 665 విభాగంలో ఉంటుందని జాబితా చూపుతోంది.

మోటో ట్యాబ్ G62 మరియు మోటో ట్యాబ్ G62 LTEలు లిస్టింగ్ ప్రకారం 4GB RAMతో ఒకే ఒక వేరియంట్‌తో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ రెండు టాబ్లెట్‌లు 2,000x1,200 పిక్సెల్‌ల రిజల్యూషన్ మరియు 240hdpi పిక్సెల్ సాంద్రతతో కూడిన డిస్‌ప్లేలను కలిగి ఉంటాయని ఆన్‌లైన్‌లో షేర్ చేయబడిన సమాచారం సూచిస్తుంది. ఈ మోటో రెండు టేబుల్‌లు కూడా ఆండ్రాయిడ్ 12 తో రన్ అవుతూ రెండు కూడా ఒకే లాంటి స్పోర్ట్ డిజైన్‌ను కలిగి ఉంటాయి అని సమాచారం.

మోటరోలా సంస్థ తన యొక్క రెండు మోటో ట్యాబ్ G62 టాబ్లెట్‌లను ఈ సంవత్సరం జనవరిలో భారతదేశంలో లాంచ్ చేయబడిన మోటో ట్యాబ్ G70 LTE యొక్క అప్ గ్రేడ్ గా విడుదల చేయనున్నాయి. ముఖ్యంగా మోటో ట్యాబ్ G70 LTE టాబ్లెట్ 2,000x1,200 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 11-అంగుళాల IPS 2K LCD డిస్‌ప్లేను కలిగి ఉందని గమనించాలి. లీక్ అయిన Moto Tab G62 టాబ్లెట్‌లు కూడా Tab G70 లాగానే డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది.

మోటో G82 5G
మోటరోలా సంస్థ ఇటీవల ఇండియాలో మోటో G82 5G మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ ను రెండు వేరియంట్లలో లాంచ్ చేసింది. ఇందులో 6GB RAM + 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ యొక్క ధర రూ.21,499 కాగా 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ మోడల్ రూ.22,999 ధర వద్ద మెటోరైట్ గ్రే మరియు వైట్ లిల్లీ వంటి కలర్ ఎంపికలలో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 12తో రన్ అవుతుంది. ఇది 20:9 యాస్పెక్ట్ రేషియో మరియు 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల ఫుల్-HD+ (1,080x2,400 పిక్సెల్‌లు) AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే హుడ్ కింద స్నాప్‌డ్రాగన్ 695 SoC తో శక్తిని పొందుతూ 8GB వరకు LPDDR4X RAMతో జతచేయబడి లభిస్తుంది.

మోటో G82 5G స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫ్యూన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మద్దతుతో పాటుగా f/1.8 లెన్స్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంది. కెమెరా సెటప్‌లో అల్ట్రా-వైడ్ షూటర్ & డెప్త్ సెన్సార్‌గా 8-మెగాపిక్సెల్ మరియు 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్ కోసం ఫోన్ ముందు భాగంలో f/2.2 లెన్స్‌తో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. మోటో G82 5G స్మార్ట్‌ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.1, GPS/ A-GPS, NFC, USB టైప్-C మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. బోర్డులోని సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్, సామీప్య సెన్సార్ మరియు సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటివి ఉన్నాయి. దీనితో పాటుగా ఇది డాల్బీ అట్మోస్ మద్దతుతో డ్యుయల్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంటాయి. ఇది 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇది మైక్రో SD కార్డ్ ద్వారా మెమొరీని 1TB వరకు విస్తరించడానికి మద్దతున ఇస్తుంది. చివరిగా ఇది 30W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.


Click it and Unblock the Notifications