మోటోరోలా స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేస్తున్నారా.. అయితే ఈ ప్రయోజనాల కోసం తెలుసా?
మోటోరోలా సంస్థ (Motorola) కీలక ప్రకటన చేసింది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 (MWC 2024) ఈవెంట్‌తో కార్నింగ్‌తో కొత్త ఒప్పందాన్ని ప్రకటించింది. ఫలితంగా ఈ సంవత్సరంలో విడుదలయ్యే అన్ని మోటోరోలా మోడళ్లు కార్నింగ్ గ్లాస్ రక్షణతో రానున్నాయి. అయితే 2024 రెండో భాగం నుంచి మోటోరోలా స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు గొరిల్లా గ్లాస్ రక్షణతో రానున్నాయి.
వినూత్న ఆవిష్కరణ - స్మార్ట్ కనెక్ట్ : దీంతోపాటు మోటోరోలా సంస్థ స్మార్ట్ కనెక్ట్‌ను (Motorola Smart Connect) ఆవిష్కరించింది. ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా స్మార్ట్ ఫోన్లను, కంప్యూటర్లను సులభంగా కనెక్ట్ చేయవచ్చు. మరియు మోటోరోలా స్మార్ట్ ఫోన్లను లెనోవా ల్యాప్ టాప్‌లను సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు.

ఎంట్రీ లెవల్ స్మార్ట్ఫోన్లు కూడా డిస్‌ప్లే రక్షణ : మోటోరోలా డివైస్‌లు మొత్తం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణను కలిగి ఉంటాయి. ఈ సంవత్సరం రెండో భాగం నుంచి ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం కేవలం ఖరీధైన స్మార్ట్‌ఫోన్లు మాత్రమే డిస్‌ప్లే రక్షణను కలిగి ఉన్నాయి. తాజా ఒప్పందంతో ఎంట్రీ లెవల్ స్మార్ట్ఫోన్లు కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణను పొందుతాయని మోటోరోలా సంస్థ ప్రకటన చేసింది.
లెనోవా పరికరాల్లోనూ..! : మరియు ఈ ఒప్పందంలో భాగంగా లెనోవాతో భాగస్వామ్యం కారణంగా ల్యాప్ టాప్, ట్యాబ్లెట్‌లు కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణను పొందుతాయి. అయితే ప్రస్తుతానికి ఎంపిక చేసిన మోడళ్లు మాత్రమే ఈ విధమైన రక్షణను కలిగి ఉంటాయని సంస్థ పేర్కొంది.

ఈ ఒప్పందం కారణంగా ధరలు పెరుగుతాయా? : అయితే ఈ ఒప్పందంలో భాగంగా ఈ డివైజ్‌లకు ఎటువంటి కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌లు వినియోగిస్తారనే ప్రకటన చేయలేదు. అయితే గొరిల్లా గ్లాస్ 5 మరియు గొరిల్లా గ్లాస్ విక్టస్ 2.. రక్షణ కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ భాగస్వామ్యం వల్ల వినియోగదారులకు లాభం కలగనుంది.
స్క్రాచ్, డ్రాప్ రిసిస్టెన్స్ వంటి ప్రయోజనాలు పొందుతారు. అది కూడా కేవలం బడ్జెట్ రేంజ్ సెగ్మెంట్‌లోనే అందుబాటులోకి వస్తాయి. అయితే ధరల పెరుగుదలపై స్పష్టత రావాల్సి ఉంది. దీంతోపాటు మోటోరోలా మరో ప్రకటన చేసింది. స్మార్ట్ కనెక్ట్ ప్రారంభం సందర్భంగా.. వివిధ బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లను కంప్యూటర్లతో సులభంగా కనెక్ట్ చేయవచ్చు.
మరియు లెనోవా ల్యాప్ టాప్‌లతో కనెక్ట్ చేయవచ్చు. వివిధ బ్రాండ్ల వస్తువుల మధ్య మెరుగైన కనెక్టివిటీ ఉండే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మోటోరోలా వెల్లడించింది. ప్రస్తుతం ఈ రకమైన వ్యవస్థలు ఆపిల్, శాంసంగ్, గూగుల్ మరియు కొన్ని చైనా సంస్థలు కలిగి ఉన్నాయి.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications