Motorola E6s రివ్యూ, ఆకట్టుకునే ఫీచర్లు, ఆకట్టుకోని ఫీచర్లు మీకోసం

By Gizbot Bureau
|

ఇండియా మార్కెట్లో మొబైల్ వార్ రోజు రోజుకు హీటెక్కుతూపోతోంది. మేఖ్యంగా బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్లో ఈ వార్ మరింత వేడెక్కింది. వారానిక రెండు మూడు కొత్త కంపెనీలు తమ ఫోన్లను అత్యంత తక్కువ ధరకే విడుదల చేస్తున్నాయి. ఇక దిగ్గజ కంపెనీ ఫోన్ల గురించి అయితే చెప్పనే అవసరం లేదు. ప్రీమియం స్మార్ట్ ఫోన్ల సెగ్మెంట్ నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల సెగ్మెంట్ కి ఇవి చేరాయి. ఈ నేపథ్యంలోనే మోటోరోలో కూడా బడ్జెట్ సెగ్మెంట్లో తన సత్తాను నిరూపించుకునేందుకు రెడీ అయింది. ఆ కంపెనీ నుంచి ఈ మధ్య రూ. 7,999 కేటగిరిలో మోటోరోలా ఈ6ఎస్ విడుదల అయంది. ఆండ్రాయిడ్ యుఐ, డ్యూయెల్ రేర్ కెమెరాస్, హెచ్ డి డిస్ ప్లే, రిమూవబుల్ 3,000Mah బ్యాటరీ ప్రధాన ఆకర్షణగా ఈ ఫోన్ విడుదలయింది. ఈ శీర్షికలో ఈ ఫోన్ లో ఉన్న పీచర్ల గురించి విశ్లేషాత్మక కథనం ఇస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

స్పెసిఫికేషన్స్
 

స్పెసిఫికేషన్స్

ఈ ఫోన్‌లో.. 6.1 ఇంచుల డిస్‌ప్లే, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

Motorola E6s: Display

Motorola E6s: Display

The Good HD+ Display With U-Notch

Motorola E6sలో 6.1 ఇంచుల డిస్‌ప్లే ని పొందుపరిచారు.720 x 1560 పిక్సల్ రిజల్యూషన్ తో పాటు 8.1 పర్సంట్ స్క్రీన్ టూ బాడి రేషియో, aspect ratio of 19:5:9గా ఉంది. ఈ డిస్ ప్లే మంచిస్టైలిష్ లుక్ తో పాటుగా అదిరిపోయే బ్రైట్ నెస్ ని అందిస్తుంది. ఈ ఫీచర్ ద్వారా మీరు యూ ట్యూబ్ వీడియోలను పుల్ స్కీన్ మీద నిరంతరాయంగా వీక్షించవచ్చు. అయితే డిస్ ప్లే గురించి మేము రానున్న కథనంలో వివరిస్తాము.

మైక్రో ఎస్ డి కార్డ్ స్లాట్

మైక్రో ఎస్ డి కార్డ్ స్లాట్

ఈ ఫోన్ లో 4 జిబి ర్యామ్, 64జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్న పరిస్ధితులకు ఈ స్పేస్ సరిపోకవచ్చు. కంపెనీ దీన్ని దృష్టిలో పెట్టుకుని మైక్రో ఎస్ డి కార్డ్ స్లాట్ ను అదనంగా తీర్చి దిద్దింది. రెండ సిమ్ లతో పాటు పక్కన ఈ మైక్రో ఎస్ డి కార్డ్ స్లాట్ మీకు కనిపిస్తుంది. దీని ద్వారా మీరు అదనంగా 521జిబి వరకు మీ మెమొరీని విస్తరించుకోవచ్చు.

డ్యూయెల్ కెమెరాస్
 

డ్యూయెల్ కెమెరాస్

ఈ ఫోన్ డ్యూయెల్ రేర్ కెమెరాతో మార్కెట్లోకి వచ్చింది. 13MP primary lens with f/2.0 aperture and a 2MP depth sensorలతో నాణ్యమైన ఫోటోలను తీసుకోవచ్చు. అలాగే ఎల్ ఈడీ ఫ్లాష్ లైట్ కూడా జత చేశారు. HDR, Face Beauty, Panorama, and Bokeh వంటి ఎపెక్ట్ లతో మీరు ఫోటోలను తీసుకోవచ్చు.అలాగే నైట్ మోడ్ ఆప్సన్ కూడా ఉంది. అయితే మేము ఇంకా కెమెరా టెస్ట్ చేస్తున్నాం కాబట్టి మరిన్ని వివరాలు త్వరలో అందిస్తాము.

రిమూవబుల్ బ్యాక్ కవర్

రిమూవబుల్ బ్యాక్ కవర్

ఈ రోజుల్లో ప్రతి స్మార్ట్ ఫోన్ కూడా రిమూవబుల్ బ్యాటరీతో వస్తోంది. దీన్ని పరిగణలోకి తీసుకుని మోటోరోలా కంపెనీ రిమూవబుల్ సెటప్ తో వచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మీరు అదనంగా బ్యాటరీని వెంట తీసుకెళ్లవచ్చు. బ్యాటరీ అయిపోతుందనే బాధ ఉండదు. నాన్ రిమూవబుల్ బ్యాటరీలో అయితే ఇది సాధ్యం కాదు. దీని డిజైన్ కూడా చాలా తేలికగా ఉంటుంది. అంత బరువు అనిపించదు.

Motorola E6s: Processor

Motorola E6s: Processor

The Bad Underpowered Processor

ఈ ఫోన్ 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 P22 chipset ప్రాసెసర్ తో రావడం కొంచెం నిరాశాకరంగా అనిపిస్తోంది. ఇది ఎంట్రీ లెవల్ చిప్ సెట్. మార్కెట్లోకి upgraded SoC వస్తున్న నేపథ్యంలో ఇది కొంచెం ఇబ్బందికరమై. అయితే ఈ ధరలో ఈ చిప్ సెట్ కొంచెం బెటరే అని చెప్పవచ్చు.

స్మాల్ బ్యాటరీ

స్మాల్ బ్యాటరీ

మార్కెట్లో మెజారిటీ స్మార్ట్ ఫోన్లు 4,000 mAh batteryతో వస్తుంటే ఈ ఫోన్ 3000ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చింది. ఈ బ్యాటరీ తో ఫోన్ ఎక్కువ సేపు ఉంటుంది అనేది కొంచె ఆలోచించాల్సిన విషయమే. బ్యాటరీ ఫెర్మెర్మెన్స్ ఎలా ఉంటుందో అనేది ఇప్పుే చెప్పలేని పరిస్థితి. అలాగే ఈ ఫోన్ చూసేందుకు అంత లుక్ గా కనిపించదు. మీరు దీన్ని చేతిలో తీసుకుంటే కొంచెం డర్టీనెస్ అంటుకున్నట్లుగా అనిపించేలా ఉంది. ఓవరాల్ గా ఈ ఫోన్ బడ్జెట్ కేటగిరీలో కొంచెం బెటరనే చెప్పవచ్చు. అయితే వినియోగదారులు తమకు నచ్చిన బ్రాండ్ల వైపు వెళతారు కాబట్టి మోటో అభిమానులకు ఈ ఫోన్ తప్పక నచ్చుతుందని చెప్పవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Motorola E6s: The Good, The Bad, And The X Factor

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X