Home
News

మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ మొదటి సేల్ లో రూ.5000 డిస్కౌంట్ ఆఫర్స్!!! మిస్ అవ్వకండి...

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటరోలా గత వారంలో భారతదేశంలో మోటరోలా ఎడ్జ్ 20 తో పాటు మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్‌ను కూడా లాంచ్ చేసింది. ఇప్పటికే మోటరోలా ఎడ్జ్ 20 సేల్స్ మొదలుకాగా మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ ఫోన్ యొక్క మొదటి అమ్మకం ఈరోజు ఆగష్టు 27 మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలయ్యాయి. మోటరోలా ఎడ్జ్ 20 లైట్ యొక్క రీబ్రాండెడ్ వేరియంట్‌గా మరియు అప్‌గ్రేడ్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ లభిస్తుంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ మరియు సెల్ఫీ కెమెరా కోసం హోల్-పంచ్ కట్-అవుట్ లతో పాటుగా వేగవంతమైన ఛార్జింగ్‌ మద్దతుతో పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉండి రెండు కాన్ఫిగరేషన్‌లతో పాటు రెండు కలర్ ఆప్షన్‌లలో అందించబడే ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ ధరల వివరాలు

మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ ధరల వివరాలు

ఇండియాలో మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ ను కొనుగోలు చేయడానికి రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఇందులో 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌ని రూ.21,499 ధర వద్ద మరియు 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌ని రూ.22,999 ధర వద్ద సైబర్ టీల్ మరియు ఎలక్ట్రిక్ గ్రాఫైట్ వంటి రెండు కలర్ ఎంపికలలో లభిస్తుంది. ఈ ఫోన్ ఆగస్టు 27 న అంటే నేడు ఫ్లిప్‌కార్ట్ మరియు ప్రధాన రిటైల్ స్టోర్స్ ద్వారా మధ్యాహ్నం 12 గంటల నుంచి విక్రయించడానికి అందుబాటులో ఉంది.

మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ సేల్స్ ఆఫర్స్

మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ సేల్స్ ఆఫర్స్

ఫ్లిప్‌కార్ట్ లో మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ మొదటిసారి అమ్మకానికి అందుబాటులోకి రానున్నది. ఈ అమ్మకంలో ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డులు మరియు EMI లావాదేవీలపై రూ.5,000 తగ్గింపు లభిస్తుంది. అలాగే కోటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డుల EMI లావాదేవీలపై 5 శాతం డిస్కౌంట్, యస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల EMI లావాదేవీలపై 5 శాతం తగ్గింపు, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ మీద 5 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్ మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా మాస్టర్ కార్డ్ మొదటి లావాదేవీ డెబిట్‌లో 10 శాతం తగ్గింపు లభిస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్‌బిఐ కార్డులు మరియు మొబిక్విక్ జారీ చేసిన అమెక్స్ నెట్‌వర్క్ కార్డ్‌లతో తమ మొదటి లావాదేవీపై కస్టమర్‌లు 20 శాతం తగ్గింపు పొందవచ్చు.

మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ స్పెసిఫికేషన్స్

మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ స్పెసిఫికేషన్స్

మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11. ఆధారంగా మైయుఎక్స్‌లో నడుస్తుంది. ఇందులో 6.7-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ OLED మాక్స్ విజన్ డిస్‌ప్లే 1,080x2,400 పిక్సెల్స్, 20: 9 యాస్పెక్ట్ రేషియో మరియు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ 8GB వరకు ర్యామ్‌తో పాటు ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 800U 5G SoC ద్వారా శక్తిని పొందుతుంది. ఆప్టిక్స్ పరంగా ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో f/1.9 లెన్స్‌తో కూడిన 108-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, అలాగే f/2.2 అల్ట్రా-వైడ్ లెన్స్ మరియు 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌, f/2.4 లెన్స్‌తో 8-మెగాపిక్సెల్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను f/2.25 లెన్స్‌తో అందించింది.

మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్

మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ ప్రాథమికంగా 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5, GPS/ A-GPS మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. బోర్డులోని సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్ మరియు సామీప్య సెన్సార్ ఉన్నాయి. అలాగే ఇది 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని టర్బోపవర్ 30 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ప్యాక్ చేస్తుంది. ఫోన్ పరిమాణం 166x76x8.25mm మరియు బరువు 185 గ్రాములు.

More from GizBot

Best Mobiles in India

English summary
Motorola Edge 20 Fusion Smartphone First Sale Starts Today on Flipkart: Price, Specs, Sale Offers and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X