మోటరోలా ఎడ్జ్ 30 ప్రో మొదటి సేల్లో రూ.10,000 విలువైన జియో ప్రయోజనాలు

|

భారతదేశంలో గత వారం లాంచ్ అయిన మోటరోలా ఎడ్జ్ 30 ప్రో స్మార్ట్‌ఫోన్ నేడు మొదటిసారి మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేయడానికి వినియోగదారులకు అందుబాటులో ఉంది. మోటరోలా బ్రాండ్ యొక్క ఈ కొత్త హ్యాండ్‌సెట్ 144Hz OLED డిస్‌ప్లే మరియు ట్రిపుల్ రియర్ కెమెరా ఫీచర్లతో లభిస్తుంది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ మరియు ప్రముఖ భారతీయ రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ యొక్క తాజా స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 SoC ద్వారా శక్తిని పొందుతూ 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ఒకే ఒక కాన్ఫిగరేషన్‌లో లభించే ఈ హ్యాండ్‌సెట్‌ను రెండు కలర్ ఎంపికలలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

మోటరోలా ఎడ్జ్ 30 ప్రో ధరల వివరాలు

మోటరోలా ఎడ్జ్ 30 ప్రో ధరల వివరాలు

భారతదేశంలో మోటరోలా ఎడ్జ్ 30 ప్రో స్మార్ట్‌ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజ్ ఒకే ఒక వేరియంట్లో రూ.49,999 ధర వద్ద లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ను కాస్మోస్ బ్లూ మరియు స్టార్‌డస్ట్ వైట్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఇది ఫ్లిప్‌కార్ట్ మరియు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రిటైల్ స్టోర్‌ల ద్వారా ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

మోటరోలా ఎడ్జ్ 30 ప్రో సేల్స్ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్స్

మోటరోలా ఎడ్జ్ 30 ప్రో సేల్స్ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్స్

నేటి సేల్స్ ఆఫర్‌లలో భాగంగా SBI క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించే కస్టమర్‌లకు రూ.5,000 తక్షణ తగ్గింపు మరియు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి కొనుగోలు చేసిన వారికి ఐదు శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. ఇంకా నో-కాస్ట్ EMIలు రూ.5,556లతో ప్రారంభమవుతాయి. అంతేకాకుండా ఈ ఫోన్ కొనుగోలు మీద జియో వినియోగదారులకు రూ.10,000 విలువైన ప్రయోజనాలు లభిస్తాయి.

మోటరోలా ఎడ్జ్ 30 ప్రో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్
 

మోటరోలా ఎడ్జ్ 30 ప్రో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

మోటరోలా ఎడ్జ్ 30 ప్రో స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 12 తో రన్ అవుతుంది. అలాగే ఇది 20:9 యాస్పెక్ట్ రేషియో మరియు 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఫుల్ -HD+ (1,080x2,400 పిక్సెల్‌లు) OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్ప్లే HDR10+కి మద్దతు ఇస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 SoC ద్వారా శక్తినిపొందుతూ 8GB LPDDR5 RAMతో ఈ కొత్త హ్యాండ్‌సెట్‌ జతచేయబడి ఉంటుంది. మోటరోలా ఎడ్జ్ 30 ప్రో స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్-LED ఫ్లాష్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. కెమెరా సెటప్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్ మరియు 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ముందు భాగంలో 60-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్ ఉంది. అలాగే ఇది 128GB UFS 3.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది.

కనెక్టివిటీ

ఫోన్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 6E, బ్లూటూత్ v5.2, GPS/ A-GPS, NFC మరియు USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. బోర్డులోని సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్ మరియు సామీప్య సెన్సార్ ఉన్నాయి. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. Motorola Edge 30 Pro కూడా Dolby Atmos సపోర్ట్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. అంతేకాకుండా, ఇది మూడు మైక్రోఫోన్‌లను కలిగి ఉంటుంది. హ్యాండ్‌సెట్ నీరు మరియు దుమ్ము-నిరోధకత కోసం IP52 రేట్ చేయబడింది. అలాగే ఇది 68W టర్బో పవర్ ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,800mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇందులో 15W వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు 5W వైర్‌లెస్ పవర్-షేరింగ్ కూడా ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Motorola Edge 30 Pro Sale Start Today in India at 12PM Via Flipkart: Price, Specifications, Launch Offers, Cashback Offers and more

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X