రేపు విడుదలకానున్న Motorola Edge 40 Neo స్మార్ట్‌ఫోన్.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలు..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ మోటోరోలా నుంచి కొత్త ఫోన్ విడుదల కానుంది. Motorola Edge 40 Neo స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 21న భారత్ మార్కెట్‌లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఇప్పటికే యూరప్‌లో లాంచ్ అయింది. అందువల్ల ఈ మోటోరోలా కొత్త ఫోన్ స్పెసిఫికేషన్లు చాలా వరకు వెల్లడయ్యాయి. అయితే ధరపై స్పష్టత రావాల్సి ఉంది.
మోటోరోలా ఎడ్జ్ 40 నియో స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సీటి 7030 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 144Hz రీఫ్రెష్ రేట్‌తో 6.55 అంగుళాల pOLED 10 బిట్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. 409ppi పిక్సల్ డెన్సిటీతో వస్తుంది. ఈ ఫోన్ కర్వడ్ డిస్‌ప్లే డిజైన్ సహా పంచ్ హోల్ కటౌట్‌ను కలిగి ఉంటుంది. ఫోన్ వెనుక ప్యానల్ లెదర్ ఫినిష్‌తో వస్తుంది.

మోటోరోలా కొత్త ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. మోటోరోలో సంస్థ ఈ ఫోన్‌కు రెండు ఆండ్రాయిడ్ వెర్షన్‌ల అప్‌గ్రేడ్‌లను ఇవ్వనుంది. అంటే ఆండ్రాయిడ్ 14, ఆండ్రాయిడ్ 15 వెర్షన్‌లను కూడా సపోర్టు చేయనుంది. ఇతర మోటోరోలా ఫోన్ల మాదిరిగానే స్టాక్ ఆండ్రాయిడ్ ఇంటర్‌ఫేస్‌తో రానుంది.
ఇక ఫోన్ కెమెరా విషయానికి వస్తే మోటోరోలో ఎడ్జ్ 40 నియో ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరా, 13MP ఆల్ట్రావైడ్ యాంగిల్ సెన్సార్‌లను కలిగి ఉంటుంది. ప్రైమరీ కెమెరా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) ఫీచర్‌ను కలిగి ఉంటుంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరా ఉంటుంది.
మోటోరోలా ఎడ్జ్ 40 నియో స్మార్ట్‌ఫోన్ 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ ఫోన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు IP68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. గత మోటోరోలా స్మార్ట్‌ఫోన్ల మాదిరిగా ఈ కొత్త ఫోన్ కూడా డాల్పీ అట్మాస్ స్టీరియో స్పీకర్లు, మోటో స్పాథియల్ సౌండ్‌ను కలిగి ఉంటుంది.
టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ నివేదిక ప్రకారం మోటోరోలా ఎడ్జ్ 40 నియో స్మార్ట్‌ఫోన్ 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ రూ.24,999కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్ లాంచ్ అనంతరం ప్రముఖ ఈ కామర్స్ ఫ్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి రానుంది.
* మోటోరోలా సంస్థ నుంచి ఇటీవలే G సిరీస్‌కు చెందిన Moto G54 5G స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. రూ.15,999 ప్రారంభ ధరతో భారత్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ మీడియో టెక్ డెమెన్సిటీ 7020 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. 33W ఛార్జర్‌తో 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ 8GB ర్యామ్, 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.15,999గా ఉంది. 12GB ర్యామ్, 256GB అంతర్గత స్టోరేజీ రూ.18,999గా ఉంది. మిడ్‌నైట్ బ్లూ, పెరల్ బ్లూ, మింట్ గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. ఈ ఫోన్ 6.5 అంగుళాల LED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. డిస్‌ప్లేకు రక్షణగా అల్యూమినోసిలికేట్ గ్లాస్‌తో వస్తుంది.


Click it and Unblock the Notifications








