Home
News

60MP సెల్ఫీ కెమెరా తో, మోటోరోలా కొత్త ఫోన్ లాంచ్! ధర,స్పెసిఫికేషన్లు

By Maheswara

వన్ ప్లస్ మరియు వివో వంటి ప్రముఖ కంపెనీలకు పోటీగా మోటోరోలా అనేక అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తోంది. ముఖ్యంగా ఈ కంపెనీ స్మార్ట్‌ఫోన్‌లు నాణ్యమైన ఫీచర్లతో రావడంతో వీటికి మంచి ఆదరణ లభిస్తోంది.

ఈ సందర్భంగా, మోటోరోలా సంస్థ వన్ ప్లస్ ఫోన్‌ల వాటాను ఆక్రమించుకునే స్థాయికి కొత్త ఫోన్‌ ను పరిచయం చేసింది. మోటోరోలా యొక్క తాజా ఫోన్ మోటోరోలా ఎడ్జ్ 40 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ప్రత్యేకించి ఈ ఫోన్ ప్రత్యేకమైన డిజైన్, నాణ్యమైన చిప్ సెట్, అద్భుతమైన కెమెరా వంటి ఎన్నో గొప్ప ఫీచర్లతో బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ కొత్త ఫోన్ ధర మరియు ఫీచర్లను నిశితంగా పరిశీలిద్దాం.

Motorola Edge 40 Pro With 60MP Selfie Camera,120W Fast Charging And 165Hz Display Launched.

ఈ కొత్త మోటోరోలా ఎడ్జ్ 40 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల ఫుల్ HD ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇక ఈ ఫోన్ డిస్‌ప్లే 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో 1,080 x 2,400 పిక్సెల్‌లు రిసొల్యూషన్ కలిగి ఉంటుంది, డాల్బీ విజన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ భద్రత వంటి అనేక ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంది. అంటే ఈ కొత్త మోటోరోలా ఫోన్ ఇతర ఫోన్‌లతో పోలిస్తే ప్రత్యేకమైన డిస్‌ప్లే అనుభవాన్ని అందించగలదని గ్రహించవచ్చు.

అదేవిధంగా, మోటోరోలా ఎడ్జ్ 40 ప్రో అడ్రినో నెక్స్ట్ జెన్ GPUతో కూడిన ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 4nm చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. కాబట్టి ఈ ఫోన్ మెరుగైన పనితీరును అందిస్తుంది. ముఖ్యంగా గేమింగ్ ను ఎక్కువగా ఇష్టపడే వినియోగదారులు ఈ ఫోన్‌ను నమ్మకంగా కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడి పనిచేస్తుంది.

మోటోరోలా ఎడ్జ్ 40 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 50MP ప్రధాన కెమెరా + 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా + 12MP టెలిఫోటో కెమెరా లు కలిగి ఉంటుంది. కాబట్టి మీరు ఈ ఫోన్‌తో నాణ్యమైన ఫోటోలను తీసుకోవచ్చు. మరియు సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం, ఈ అద్భుతమైన మోటోరోలా ఫోన్ 60MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ఈ మోటోరోలా ఎడ్జ్ 40 ప్రో స్మార్ట్‌ఫోన్ 12GB RAM మరియు 256GB స్టోరేజ్‌తో విడుదల చేయబడింది. ఇక ఈ కొత్త ఫోన్‌లో స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మాస్, 4 మైక్రోఫోన్‌లతో సహా అనేక అద్భుతమైన ఫీచర్లు కలిగి ఉంది. అలాగే, ఈ ఫోన్ నీరు మరియు ధూళిని తట్టుకునే IP రేటింగ్ ను కలిగి ఉంది.

ఈ కొత్త మోటోరోలా ఎడ్జ్ 40 ప్రో స్మార్ట్‌ఫోన్ మోడల్ 4600mAh బ్యాటరీని కలిగి ఉంది. కాబట్టి మీరు సుదీర్ఘ బ్యాటరీ బ్యాకప్ పొందుతారు. ఈ కొత్త పరికరం 125W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు 5W రివర్స్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది.

ఈ ఫోన్ 5G టెక్నాలజీ తో వస్తుంది. ఇంకా, డ్యూయల్ 4G VoltE, Wi-Fi 802.11, బ్లూటూత్ 5.3, USB టైప్-C పోర్ట్‌తో సహా వివిధ కనెక్టివిటీ ఆప్షన్లను కలిగి ఉంది. ఈ కొత్త ఫోన్ యూరప్ మరియు UK మార్కెట్లో అమ్మకానికి వచ్చింది. త్వరలోనే అన్ని దేశాల్లోనూ ఈ ఫోన్ విక్రయానికి రాబోతున్నట్లు సమాచారం. ఇక ఈ ఫోన్ యొక్క ధర చూస్తే, మోటోరోలా ఎడ్జ్ 40 ప్రో ఫోన్ ధర US$ 985 (భారత కరెన్సీలో రూ. 80,930) గా లాంచ్ అయింది.

Best Mobiles in India

English summary
Motorola Edge 40 Pro With 60MP Selfie Camera,120W Fast Charging And 165Hz Display Launched.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X