Home
News

Motorola కొత్త ఫోన్‌ ఎడ్జ్‌ 40 వీడియో లీక్‌.. డిజైన్‌, స్పెసిఫికేషన్ల వివరాలు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ కొత్త ఫోన్‌ సీరిస్‌ Motorola Edge 40 గురించి కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రమోషనల్‌ వీడియో లీక్ కావడంతో పలు స్పెసిఫికేషన్లు, కీలక ఫీచర్లు వెలుగులోకి వచ్చాయి. మోటరోలా తన కొత్త సిరీస్‌ ఫోన్లు ఎడ్జ్‌ 40, ఎడ్జ్ 40 ప్రోను త్వరలో యూరప్‌ ఇతర ఇతర మార్కెట్లలోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

మోటరోలా ఎడ్జ్ 40 సీరిస్‌ ఫోన్ల గురించి బయటకొచ్చిన సమాచారం ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్‌ కర్వడ్‌ ఫినిష్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ముందువైపు డిస్‌ప్లే పైభాగంలో ముందు కెమెరా ఏర్పాటుచేశారు. వెనుక భాగం నలుపు రంగులో వేగన్‌ లెదర్‌ ఫినిష్‌ను కలిగి ఉంది.

Motorola Edge 40

వెనుకవైపు రెండు కెమెరాలతోపాటు డ్యూయల్‌ ప్లాష్‌లైట్‌లను ఏర్పాటుచేశారు. మోటరోలా ఎడ్జ్‌ 40 50MP ప్రైమరీ కెమెరాను అమర్చారు. ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ సపోర్టు చేయనుంది. మరియు f/1.4 అపేచర్‌ను కలిగి ఉంది. వెనుక భాగంలో మరో 13MP అల్ట్రావైడ్‌ కెమెరాను అమర్చారు. ఫోన్‌ ముందు భాగంలో సెల్ఫీల కోసం 32MP కెమెరాను ఏర్పాటుచేశారు.

మైస్మార్ట్‌ప్రైస్‌ నివేదిక ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్‌ 4,400mAh బ్యాటరీ సామర్ధ్యంతో విడుదల కానుంది. 68W ఫాస్ట్ ఛార్జింగ్‌ మరియు 15W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ను సపోర్టు చేయనుంది. ఫోన్‌ కింద భాగంలో ఫోన్‌ను ఛార్జింగ్‌ చేసుకొనేందుకు వీలుగా సీ - టైప్‌ పోర్టును అమర్చారు. స్పీకర్, సిమ్‌ ట్రే కూడా ఫోన్‌ కింద భాగంలోనే ఏర్పాటుచేశారు. మోటరోలా ఎడ్జ్‌ 40 ఫోన్‌కు.. కుడివైపున పవర్‌, వాల్యుమ్‌ బటన్లను ఏర్పాటుచేశారు.

ఈ స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌ - 128GB అంతర్గత స్టోరేజీ, 8GB ర్యామ్‌- 256GB స్టోరేజీ రెండు వేరియంట్లలోనే లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. మోటరోలా ఎడ్జ్ 40 స్మార్ట్‌ఫోన్‌ 6.55 అంగుళాల పూర్తి HD+ పోలెడ్‌ డిస్‌ప్లే, 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో రానుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ డిస్‌ప్లేపైనే ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ను అమర్చారు. ఈ స్కానర్ HDR10+ ను సపోర్ట్ చేయనుంది. మీడియాటెక్‌ డెమెన్సిటీతో 8020 SoCతో చిప్‌సెట్‌ను కలిగి ఉండనుంది. ఆండ్రాయిడ్‌ 13 OSలో ఈ ఫోన్‌ పనిచేయనుంది. మరియు ఈ స్మార్ట్‌ఫోన్‌ IP68 రేటింగ్‌తో నీరు, డస్ట్ రెసిస్టెంట్‌గా విడుదల కానుంది.

టిప్‌స్టర్‌ కథనం ప్రకారం, మోటరోలా ఎడ్జ్ 40 ఫోన్‌ నాలుగు రంగుల్లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. లూనార్‌ బ్లూ (Lunar Blue), నెబులా గ్రీన్‌ (Nebula Green), ఎక్లిప్స్ బ్లాక్‌ (Eclipse Black) మరియు మెజెంటా (Magenta) రంగుల్లో ఈ ఫోన్‌ లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్‌లు సహా టెక్‌న్యూస్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు.

More from GizBot

Best Mobiles in India

English summary
Motorola Edge 40 smart phone specifications leaked
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X