50MP సెల్ఫీ కెమెరా తో, Motorola కొత్త ఫోన్ లాంచ్ తేదీ ఖరారైంది! Flipkart లో ఫీచర్లు లీక్
మోటరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ఏప్రిల్ 3వ తేదీన భారతదేశంలో లాంచ్ చేస్తున్నట్లు సంస్థ ధృవీకరించింది. ఇది స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 SoC ప్రాసెసర్ తో సహా ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్లను కూడా విడుదల చేసింది.మరియు ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ద్వారా అందుబాటులోకి రానుంది. ఫ్లిప్ కార్ట్ ల్యాండింగ్ పేజీ ద్వారా ఈ హ్యాండ్ సెట్ అనేక వివరాలు వెల్లడయ్యాయి.
ఈ మోటరోలా ఫోన్ 3 OS అప్‌డేట్‌లతో కూడిన ఆండ్రాయిడ్ 14, హలో UI, బాక్స్‌లో 68W ఛార్జర్‌తో 125W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కంపెనీ ధృవీకరించింది.

వార్తలలో అనేక పుకార్లు మరియు టీజర్‌ల తర్వాత, మోటరోలా ఇండియా త్వరలో ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తున్నట్లు ధృవీకరించింది. ఈ ఫోన్ యొక్క టీజర్, ఫోన్ డిజైన్ మరియు స్పెసిఫికేషన్‌లను Flipkart పేజీ లో నిర్ధారిస్తుంది.
ఈ ఫోన్ కు "ఇంటెలిజెన్స్ మీట్స్ ఆర్ట్" అనే ట్యాగ్ లైన్ కూడా ఉంది మరియు ఈ ఫోన్ ఆఫ్‌లైన్ స్టోర్‌లతో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ కు వస్తుందని కంపెనీ తెలిపింది.
ప్రపంచంలో మొదటిసారిగా పాంటోన్ ద్వారా ధృవీకరించబడిన 6.7″ 1.5K 144Hz కర్వ్ పోలెడ్ డిస్‌ప్లేను కంపెనీ ధృవీకరించింది. ఇది గరిష్టంగా 2000 నిట్స్ బ్రైట్‌నెస్‌ని అందిస్తుంది, HDR 10+కి మద్దతు ఇస్తుంది మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో వస్తుంది.ఈ డిస్‌ప్లే SGS టెక్నాలజీతో బ్లూ లైట్ ను నియంత్రిస్తుంది. ఫలితంగా కంటికి రక్షణ కల్పిస్తుంది. మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణను పొందుతుంది.
మీరు జెనరేటివ్ AI థీమింగ్‌తో ఈ ఫోన్ స్టైల్ ని సింక్ చేయవచ్చు అని కంపెనీ తెలిపింది. ఇది 50MP వెనుక కెమెరా, 13MP అల్ట్రా-వైడ్ కెమెరాతో మాక్రో ఆప్షన్, 10MP టెలిఫోటో కెమెరాతో 50x హైబ్రిడ్ జూమ్ మరియు AI అడాప్టివ్ స్టెబిలైజేషన్, ఆటోఫోకస్ ట్రాకింగ్, AI ఫోటో మెరుగుదల ఇంజిన్ మరియు టిల్ట్ మోడ్ వంటి ప్యాక్ కెమెరా ఫీచర్లను ప్యాక్ చేస్తుంది.
అలాగే 50MP సెల్ఫీలే కెమెరా కూడా వస్తుంది.
ఈ ఫోన్ 3 పాంటోన్ క్యూరేటెడ్ రంగులలో వస్తుంది. రూమర్ల ప్రకారం, ఈ ఫోన్ 12GB RAMతో వస్తుంది. Snapdragon 7 Gen 3 SoC ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది, IP68 రేటింగ్‌లతో వస్తుంది మరియు 125W వైర్డ్ ఛార్జింగ్ మరియు 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతుతో 4,500 mAh బ్యాటరీని కలిగి ఉంది. మోటోరోలా ఎడ్జ్ 50 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను ఏప్రిల్ 3వ తేదీన న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో లాంచ్ చేస్తారు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








