Motorola నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! ధర ,ఫీచర్ల వివరాలు. 

By Maheswara
|

Motorola భారతదేశంలో తమ కొత్త ఫోన్ Moto G72 స్మార్ట్ ఫోన్ ని 10-బిట్ pOLED ప్యానెల్ మరియు 108MP ప్రైమరీ కెమెరాతో లాంచ్ చేసింది. ఈ Motorola G72 స్మార్ట్ ఫోన్ భారత దేశంలో అక్టోబర్ 12 నుండి ప్రత్యేకంగా Flipkart లో అందుబాటులో ఉంటుంది. మోటోరోలా అధికారిక ట్వీట్ ప్రకారం, ఈ ఫోన్ రిటైల్ ధర రూ. 18,999 గాఉంది. అయితే, ఇది కొంత కాలం వరకు చాలా తక్కువ ధరలో అందుబాటులోకి ఉంటుంది.

Motorola G72

Motorola G72

ప్రస్తుతం వినియోగదారులు ఈ కొత్త Motorola G72ని కేవలం రూ.14,999 (పరిమిత కాల ఆఫర్ )  కి కొనుగోలు చేయవచ్చు.ఈ ఆఫర్ ధర లో ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై  రూ.1,000 తక్షణ తగ్గింపులు మరియు ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్‌లపై రూ.3,000 అదనపు మార్పిడి విలువ. కాబట్టి, Motorola G72ని కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు తమ పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేయకుండా రూ. 17,999.కి కొనుగోలు చేయవచ్చు.

Motorola G72 స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లు.

Motorola G72 రెండు రంగులలో వస్తుంది. మెటోరైట్ బ్లాక్ మరియు పోలార్ బ్లూ. ఈ స్మార్ట్‌ఫోన్ FHD+ రిజల్యూషన్‌తో, 6.55-అంగుళాల pOLED డిస్‌ప్లేను మరియు HDR10+ వంటి ధృవీకరణలతో 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ఇటీవల విడుదల చేసిన ఇతర మోటరోలా స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగానే ఈ పరికరం నీరు మరియు ధూళి నిరోధకత కోసం IP52 రేటింగ్ తో వస్తుంది.

ట్రిపుల్ కెమెరా సెటప్‌

ట్రిపుల్ కెమెరా సెటప్‌

Motorola G72 స్మార్ట్ ఫోన్ యొక్క వైపు ఉన్న ట్రిపుల్ కెమెరా సెటప్‌లో 108MP ప్రైమరీ వైడ్ యాంగిల్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ మరియు 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. 1080p వీడియో రికార్డింగ్ సామర్థ్యాలకు మద్దతుతో 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉంది.Motorola G72 ఫోన్ 6GB RAM మరియు 128GB అంతర్గత నిల్వతో సరికొత్త MediaTek Helio G99 SoC ఆధారంగా రూపొందించబడింది.ఈ పరికరం మైక్రో SD కార్డ్ స్లాట్ మరియు డ్యూయల్ నానో SIM కార్డ్ స్లాట్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్ బ్లూటూత్ 5.1 మరియు డ్యూయల్-బ్యాండ్ వై-ఫైకి కూడా మద్దతు ఇస్తుంది. సాఫ్ట్‌వేర్ పరంగా,ఈ ఫోన్ Android 12 OSతో వస్తుంది. మరియు మూడు సంవత్సరాలు భద్రతా నవీకరణలతో పాటు ఒక ప్రధాన Android OS అప్‌గ్రేడ్‌ను అందుకోవడం మీరు చూడవచ్చు.

ఫాస్ట్ ఛార్జింగ్‌

ఫాస్ట్ ఛార్జింగ్‌

USB టైప్-C పోర్ట్ ద్వారా 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,000 mAh బ్యాటరీని  రెండు గంటల కంటే తక్కువ వ్యవధిలో పూర్తి బ్యాటరీని ఛార్జ్ చేయగలదని చెప్పబడింది. ఈ ఫోన్ యొక్క బ్యాటరీ పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఈ ఫోన్ ఎటువంటి సమస్య లేకుండా చాలా మంది వినియోగదారులకు రోజంతా బ్యాటరీ కాలాన్ని అందించగలదు.

మీరు గొప్ప డిస్‌ప్లే మరియు హై-రిజల్యూషన్ కెమెరాతో ఉన్న స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే, Motorola G72 స్మార్ట్ ఫోన్  గొప్ప స్మార్ట్ ఫోన్ గా మీకు కనిపిస్తుంది. అయితే, ఈ ఫోన్ 5G నెట్‌వర్క్‌కు మద్దతు ఇవ్వదని మీరు గుర్తుంచుకోవాలి.ఇది 4G వేరియంట్ లో మాత్రమే వస్తుంది. ఇదే ఈ ఫోన్‌కు ఉన్న ఒక ముఖ్యమైన లోపం, ప్రస్తుతం భారతదేశం లో  కేవలం Airtel మరియు Jio వంటి ప్రధాన టెల్కోల నుండి 5G నెట్‌వర్క్‌ను లాంచ్ చేశారు. మరికొద్ది రోజులలో దేశం మొత్తం మీద అన్ని నెట్వర్క్ లు 5G ని తీసుకురాబోతున్నాయి.

Best Mobiles in India

Read more about:
English summary
Motorola G72 Launched In India With 6.55inch pOLED Display And 108MP Camera. Check Price Here.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X