Motorola G85 5G సేల్ మొదలైంది! ధర, ఆఫర్లు, స్పెసిఫికేషన్లు
Motorola నుంచి జూలై 10న భారతదేశంలో Moto G85 5G ఫోన్ లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఈరోజు July 16 న మొదటి సేల్ Flipkart, Motorola యొక్క అధికారిక సైట్ మరియు ఎంపిక చేసిన రిటైల్ ఛానెల్‌లలో ఈ రోజు 12గంటలకు సేల్ మొదలైంది. ఇది కర్వ్డ్ స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ 6s Gen 3 చిప్‌సెట్, 50MP OIS వెనుక కెమెరా మరియు వెనుక భాగంలో వేగన్ లెదర్ ఫినిష్ (అర్బన్ గ్రే కలర్ మినహా) అందిస్తుంది.
Moto G85 5G ఈ ధర పరిధిలోని ఇతర పరికరాలతో పాటు తాజా CMF ఫోన్ 1, POCO X6 మరియు Redmi Note 13తో పోటీపడుతుంది. మీరు పరికరాన్ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తే, వేరియంట్ వారీగా ధరలు, స్పెసిఫికేషన్‌లు మరియు ఆఫర్‌ల వివరాలు ఇక్కడ ఉన్నాయి.

Motorola G85 5G ధర వివరాలు
మోటోరోలా G85 5G యొక్క ప్రారంభ ధర రూ. 17,999 (8GB + 128GB) వద్ద అందుబాటులో ఉంటుంది. 12GB + 256GB వేరియంట్ ధర రూ.19,999. ఇది కోబాల్ట్ బ్లూ, ఆలివ్ గ్రీన్ మరియు అర్బన్ గ్రే షేడ్స్‌లో అందుబాటులో ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీల ద్వారా కొనుగోలుదారులు రూ. 1,000 తగ్గింపును పొందవచ్చు. అంతేకాకుండా, డీల్‌ను సులభతరం చేయడానికి మీరు నో-కాస్ట్ EMI ఆఫర్‌లను చూడవచ్చు. ఇప్పుడు, ఈ పరికరం యొక్క స్పెసిఫికేషన్లు వివరాలు చూద్దాం.
Motorola G85 5G స్పెసిఫికేషన్ల వివరాలు
మోటో G85 5G స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల పుల్ HD+ 3D కర్వడ్ pOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1080*2400 పిక్సల్ రిజల్యూషన్, 120Hz రీఫ్రెష్ రేట్, 1600 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 20:9 ఆస్పెక్ట్ రేషియోతో అందుబాటులో ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణను కలిగి ఉంటుంది.
ఈ మోటో G85 5G హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత Hello UI ను కలిగి ఉంటుంది. మరియు క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ Adreno 619 GPU, 12GB ర్యామ్, 256GB UFS 2,2 తో జతచేయబడింది. 24GB వరకు ర్యామ్‌ను పొడిగించే వీలుంది.
ఈ హ్యాండ్‌సెట్ రెండు సంవత్సరాల OS అప్‌డేట్‌లు, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందవచ్చు. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఈ మోటో G85 5G స్మార్ట్‌ఫోన్ 33W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. సింగిల్ ఛార్జింగ్‌తో 34 గంటల ప్లేటైంను పొందవచ్చు.
కెమెరా విభాగం పరంగా ఈ మోటో కొత్త హ్యాండ్‌సెట్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషషన్ (OIS) 50MP సోనీ Lytia 600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంది. మరియు LED ప్లాష్ లైట్‌ను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను కలిగి ఉంది.
కనెక్టివిటీ పరంగా ఈ మోటో హ్యాండ్ సెట్ బ్లూటూత్, వైఫై 802.11, GPS, A-GPS, LTEPP, Galileo, USB-C పోర్టు వంటి ఫీచర్లను కలిగి ఉంది. యాక్సిలిరోమీటర్, యాంబియంట్ లైట్, ఈ-కంపాస్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ, సెన్సార్ హబ్, SAR సెన్సార్‌లను అమర్చారు.
ఈ హ్యాండ్‌సెట్ భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంటుంది. డాల్బీ అట్మాస్ సపోర్టుతో స్టీరియో స్పీకర్లను కలిగి ఉంటుంది. మరియు IP52 రేటింగ్‌తో వాటర్, డస్ రెసిస్టెంట్ ఫీచర్లు అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








