మోటరోలా నుంచి 4జీ ఫోన్.. త్వరలో

Posted By:

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను శాసిస్తోన్న మొబైల్ బ్రాండ్‌లలో మోటరోలా ఒకటి. మోటో జీ, మోటో ఇ, మోటో ఎక్స్  స్మార్ట్‌ఫోన్‌లతో మార్కెట్లో రిఎంట్రీ ఇచ్చి తన సత్తాను చాటుకున్న మోటరోలా మరో విప్లవాత్మక ఆవిష్కరణకు శ్రీకారం చుట్టబోతోంది. భారత్, బ్రెజిల్ మార్కెట్లను టార్గెట్ చేస్తూ మోటరోలా ఓ బడ్జెట్ ఫ్రెండ్లీ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను 2015లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎకనామిక్స్ టైమ్స్ ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. ఈ అంశానికి సంబంధించి మోటరోలా అధికారికంగా స్పందించాల్సి ఉంది.

మోటరోలా నుంచి 4జీ ఫోన్.. త్వరలో

మోటరోలా నుంచి త్వరలో రాబోతోన్న స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి వివరాలను పరిశీలించినట్లయితే.. ‘మోటో ఇ' సెకండ్ జనరేషన్‌ను ఫో‌న్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు మోటరోలా సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మోటో ఇ2 స్పెసిఫికేషన్‌లకు సంబంధించి మార్కెట్లో ఇప్పటికే అనేక రకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా విడుదలైన మరో రూమర్ మోటో ఇ2కు ప్రత్యేకతలను మరోసారి తేటతెల్లం చేసింది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

మోటో ఇ2 స్పెసిఫికేషన్‌లు (అనధికారికంగా)...

ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 960×540పిక్సల్స్),
1.2గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ 400 క్వాడ్-కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా గురించి వివరాలు తెలియరాలేదు,
ఈ ఫోన్ ఎల్టీఈ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేసే అవకాశముంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Motorola to Launch Affordable 4G Mobile in India Soon. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting