నవంబర్ 13న మోటొ ఎక్స్4 రిలీజ్!

భారత మార్కెట్లో నవంబర్ 13న రిలీజ్ చేస్తున్నట్లు ట్విట్టర్లో ప్రకటించిన మోటో

By Madhavi Lagishetty
|

అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా అక్టోబర్ 3న కొత్త స్మార్ట్‌ఫోన్ ది మోటో ఎక్స్4 లాంచ్ చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల కంపెనీ వాయిదా వేసింది. మోటో ఎక్స్4 రిలీజ్ కాస్త నిరాశపరిచినప్పటికీ...విడుదల తేదీని కంపెనీ ఇంకా రహాస్యంగానే ఉంచింది.

 
Motorola to launch Moto X4 on November 13 in India

అయితే కంపెనీ ఇప్పుడు మోటోరోలా మోడల్ ఎక్స్4 రిలీజ్ తేదీని ప్రకటించింది. ఈ హ్యాండ్సెట్ ఇండియాలో వచ్చే నెలలో ల్యాండింగ్ ఉంటుంది. ఈ విషయాన్ని కంపెనీ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. మోటోరోలా ఎక్స్ 4 స్మార్ట్‌ఫోన్‌ను నవంబర్ 13న లాంచ్ చేయనున్నట్లు వెల్లడించింది.

 

కంపెనీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఈ డివైస్ రిలీజ్ కానుంది. బెర్లిన్లోని ఐఎఫ్ఏ సమావేశం సందర్భంగా ఆగస్టులో ఈ హ్యాండ్సెట్ గురించి అధికారంగా వెల్లడించారు.

ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే... స్మార్ట్‌ఫోన్‌ లవర్స్ మరింత ఆకట్టుకునేలా ఉన్నాయి. మెటల్ unibodyడిజైన్తో సూపర్ బ్లాక్ మరియు స్టెర్లింగ్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో ఈ హ్యాండ్సెట్లు రిలీజ్ కానున్నాయి. ఈ హ్యాండ్సెట్ హోం బటన్ కింద ఫింగర్ ప్రింట్ స్కానర్ను స్పోర్ట్ చేస్తారు. USB- టైప్-సిపోర్ట్ మరియు 3.5ఎంఎం ఆడియో జాక్ హ్యాండ్సెట్లో కింద కనిపిస్తాయి.

BSNL దిమ్మతిరిగే సర్వీసు, రూపాయితో మీ కంప్యూటర్ల భద్రంBSNL దిమ్మతిరిగే సర్వీసు, రూపాయితో మీ కంప్యూటర్ల భద్రం

మోటో ఎక్స్ 4 5.2అంగుళాల పూర్తి హెచ్డి (1080x1920)పిక్సెల్స్ వస్తుంది. LTPS IPSడిస్ల్పేతో 424పిపిఐ పిక్సెల్ డెన్సిటితోపాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. ఈ హ్యాండ్సెట్ 2.2గిగా క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 630 ఆక్టా కోర్ SoC, 3జిబి ర్యామ్ తో రన్ అవుతుంది.

మోటొ ఎక్స్ 4, f/2.0 ఎపర్చరు మరియు 1.4మైక్రోన్ పిక్సెల్స్ తో ఒక 12మెగాపిక్సెల్ డ్యుయల్ ఆటోఫోకస్ సెన్సార్ కలిగి ఉండి...బ్యాక్ డ్యుయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 120డిగ్రీ ఫీల్డ్ వ్యూ, f/2.2 ఎపర్చర్ మరియు 1.12మైక్రాన్ పిక్సెల్స్ తో, 8 మెగాపిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సర్తో వస్తుంది. అడిష్నల్ ఫీచర్స్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ షాట్, ప్రొఫెషనల్ మోడ్, డెప్త్ డిటెక్షన్ మరియు డెప్త్ ఎఫెక్ట్స్, సెలెక్టివ్ ఫోకస్, సెలెక్టివ్ బ్లాక్ అండ్ వైట్ ఫీచర్స్ అడిష్నల్ గా ఉంటాయి. ఫ్లాష్ సపోర్టు, f/2.0ఎపర్చరు మరియు 1 మైక్రాన్ తో 16మెగాపిక్సెల్ సెల్ఫీ సన్సార్ ఉంది.

ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 3000ఎంఏహెచ్ బ్యాటరీ సపోర్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌ వస్తుంది. ఆండ్రాయిడ్ 7.1నూగట్ బాక్స్ నుంచి రన్ అవుతుంది స్మార్ట్‌ఫోన్‌ ఒక సింగిల్ సిమ్ స్లాట్ కు సపోర్ట్ చేస్తుంది. Nfc, బ్లూటూత్5.0, వై-ఫై 802.11ac (డ్యుయల్ బ్యాండ్ 2.4గిగామరియు5గిగా) జిపిఎస్, గ్లోనాస్, 4జి ఎల్టీఈ, ఎఫ్ఎం రేడియో వంటి కనెక్టివిటి ఆప్షన్స్ అందిస్తుంది. మోటో ఎక్స్ 4 అలెక్సా మరియు గూగుల్ అసిస్టెంట్ రెండింటికి సపోర్ట్ ఇస్తుంది. మోటోఎక్స్ 4 148.35 x 73.4 ఎంఎంలను లతో 163గ్రాముల బరువు ఉంటుంది.

Best Mobiles in India

Read more about:
English summary
Motorola has confirmed the launch date of Moto X4 and it will be landing in India next month.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X