మలేషియాలో హాల్ చల్ చేస్తున్న మోటరోలా స్మార్ట్ పోన్ ఆట్రిక్స్

Posted By: Staff

మలేషియాలో హాల్ చల్ చేస్తున్న మోటరోలా స్మార్ట్ పోన్ ఆట్రిక్స్

మలేషియా: మోటరోలా కంపెనీ మొబైల్స్ నాణ్యతకు పెట్టింది పేరు. అలాంటి మోటరోలా నుండి కొత్తగా మోటరోలా ఆట్రిక్స్ అనే స్మార్ట్ ఫోన్ జూన్ 17నుండి మలేషియాలో ఉన్నటువంటి అన్ని రిటైలర్స్‌లో లభించనున్నట్లు తెలిపింది. ఇక దీని ధర విషయానికి వస్తే RM 1,999. మోటరోలా ఆండ్రాయిడ్ స్మార్ట్ పోన్ ఆట్రిక్స్ ఒక చిన్నసైజు నోట్ బుక్ మాదిరి, 11.6 స్క్రీన్ సైజు కలిగిఉండి అన్ని ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ రన్ అయ్యే విధంగా చూపరులను చాలా బాగా ఆకట్టుకుంటుంది.

వీటితోపాటు పెద్ద స్క్రీన్‌ని కలిగి ఉండి, డాక్ ఫీచర్స్‌తో పుల్ కీబోర్డు, ట్రాక్ ప్యాడ్, స్టీరియో స్పీకర్స్, 36Wh మూడు సెల్స్ బ్యాటరీ సామర్ద్యం కలిగి ఉండి ఎనిమిది గంటల పాటు బ్యాటరీ లైఫ్ వస్తుంది. ఆట్రిక్స్ ప్రాసెసర్ విషయానికి వస్తే 1GhZ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1GB ర్యామ్, qHD డిస్ల్పేతోపాటుగా 16GB మొమొరీ స్టోరజి సామర్ద్యం కలిగిఉంటుందని అన్నారు. ఇక మోటరోలా ఆట్రిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 2.2తో రన్ అవుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot