Moto G 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్!!! అందుబాటు ధరలోనే, ఫీచర్స్ బ్రహ్మాండం...

|

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటరోలా " మేడ్ ఇన్ ఇండియా" ఫీచర్ తో ఈ రోజు భారతదేశంలో తన యొక్క 5G ఫోన్ మోటోG ని అధికారికంగా విడుదల చేసింది. సరసమైన ధరలోనే ఈ 5G స్మార్ట్‌ఫోన్ ను మోటరోలా సంస్థ విడుదల చేసింది. భారతదేశంలో చౌకైన 5G స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో చేరిన ఈ స్మార్ట్‌ఫోన్ డిసెంబర్ 7 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా మొదటిసారి అమ్మకానికి అందుబాటులోకి రానున్నది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 750G ప్రాసెసర్ తో రన్ అవుతూ 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఫీచర్లతో వోల్కానిక్ గ్రే మరియు ఫ్రాస్ట్డ్ సిల్వర్ కలర్ ఎంపికలతో లభించే ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

మోటోG 5G ధరలు & లాంచ్ సేల్ ఆఫర్లు

మోటోG 5G ధరలు & లాంచ్ సేల్ ఆఫర్లు

మోటోG 5G స్మార్ట్‌ఫోన్ ఇండియాలో 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ యొక్క ఒకే ఒక వేరియంట్ రూ.20,999 ధర వద్ద విడుదల అయింది. లాంచ్ సేల్ లో భాగంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డుల కొనుగోలు మీద రూ.1000 తక్షణ డిస్కౌంట్‌ను కూడా అందిస్తోంది. అంటే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డుతో మోటోG 5G స్మార్ట్‌ఫోన్‌ను షాపింగ్ చేసే వినియోగదారులు దీనిని కేవలం రూ.19,999 ధర వద్దనే పొందగలుగుతారు.

 

Also Read: Reliance Jio నుంచి రానున్న కొత్త స్మార్ట్ ఫోన్. OTT App లు,షాపింగ్ ఆఫర్లు ఇంకా ఎన్నో ..Also Read: Reliance Jio నుంచి రానున్న కొత్త స్మార్ట్ ఫోన్. OTT App లు,షాపింగ్ ఆఫర్లు ఇంకా ఎన్నో ..

మోటోG 5G స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 750G ప్రాసెసర్ ఫీచర్స్

మోటోG 5G స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 750G ప్రాసెసర్ ఫీచర్స్

మోటోG 5G స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే ఇది 6.7-అంగుళాల మాక్స్ విజన్ HDR10 డిస్ప్లేను 20: 9 కారక నిష్పత్తితో కలిగి ఉంటుంది. ఇది 6GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉండి క్వాల్కమ్ యొక్క స్నాప్‌డ్రాగన్ 750G ప్రాసెసర్ ద్వారా రన్ అవుతుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ మద్దతుతో మెమొరిని 1TB వరకు విస్తరించడానికి కూడా అవకాశం ఇస్తుంది. అలాగే ఇది టర్బోపవర్ 20W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంటుంది.

మోటోG 5G స్మార్ట్‌ఫోన్ కెమెరా సెటప్ ఫీచర్స్

మోటోG 5G స్మార్ట్‌ఫోన్ కెమెరా సెటప్ ఫీచర్స్

మోటోG 5G స్మార్ట్‌ఫోన్ కెమెరా లెన్స్ విషయానికి వస్తే దీని వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో ఎఫ్ / 1.7 ప్రైమరీ సెన్సార్ తో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, వైడ్ యాంగిల్ లెన్స్ తో 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరాలు ఫ్లాష్ తో కలుపుకొని చతురస్రాకారంలో ప్యాక్ చేయబడి ఉంటాయి. అలాగే ఫోన్ ముందు భాగంలో పంచ్-హోల్ డిజైన్ లో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే ప్రస్తుతానికి ఈ ఫోన్ స్టాక్-ఆండ్రాయిడ్ 10తో రన్ అవుతుంది కాని త్వరలోనే ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్ ను అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది.

Best Mobiles in India

English summary
Motorola Moto G 5G Smartphone Released in India: Price, Specs, Sale Date and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X