మోటోరోలా నుంచి మరో కొత్త ఫోన్ ! ఆగష్టు 1 న లాంచ్. స్పెసిఫికేషన్ల వివరాలు
మోటోరోలా నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ మోటో G14 యొక్క ఇండియా లాంచ్ తేదీని ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ యొక్క ల్యాండింగ్ పేజీ సమాచారం ప్రకారం. మోటో G14 ఆగస్టు 1న భారతదేశంలో లాంచ్ చేయబడుతుంది. అదనంగా, ఈ ల్యాండింగ్ పేజీ లో Moto G14 యొక్క కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లను కూడా లాంచ్ చేయడానికి ముందు నిర్ధారించారు.
ఆగష్టు 1 న రాబోయే ఈ మోటో G14 స్మార్ట్ ఫోన్ పూర్తి HD+ రిజల్యూషన్‌తో 6.5 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌కు మధ్యలో పంచ్ హోల్ కటౌట్ ఉంటుంది. ఇది సెల్ఫీ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. ఈ పరికరం LED ఫ్లాష్‌తో పాటు వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది.

మోటో G14 ఫీచర్ 6.5 అంగుళాల ఫుల్ HD+ డిస్ప్లే, 50MP కెమెరా కలిగి ఉంది.
ఫ్లిప్‌కార్ట్‌లోని ల్యాండింగ్ పేజీ ఆగస్టు 1 నుండి ప్రీ బుకింగ్ కోసం మోటో G14 అందుబాటులో ఉంటుందని నిర్ధారిస్తుంది. మోటోరోలా నుండి రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్ ఈ సంవత్సరం ప్రారంభంలో లాంచ్ అయిన మోటో G13కి కొనసాగింపుగా వస్తుంది.
పైన చెప్పినట్లుగా, ఆగష్టు 1 న రాబోయే ఈ మోటో G14 స్మార్ట్ ఫోన్ 6.5 అంగుళాల పూర్తి HD+ డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4GB RAM మరియు 128GB UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజీ తో జత చేయబడే ఆక్టా కోర్ యూనిసోక్ T616 SoC ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో మైక్రో SD కార్డ్ సపోర్ట్ కూడా ఉంటుంది, అది 1TB వరకు స్టోరేజీ ని పెంచుకోవడానికి అవకాశం అందిస్తుంది.
ఇక సాఫ్ట్‌వేర్ యొక్క వివరాలు గమనిస్తే, ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13ని తీసుకువస్తుంది. ఇంకా, ఆండ్రాయిడ్ 14 అప్‌డేట్ మరియు మూడేళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లను కూడా అందిస్తుంది. కెమెరా వివరాలు గమనిస్తే, ఈ మోటో G14 స్మార్ట్ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ఇది నైట్ విజన్ మరియు మాక్రో విజన్ వంటి ఫోటోగ్రఫీ ఫీచర్లను కూడా అందిస్తుంది.
ఇక బాటరీ మరియు ఛార్జింగ్ విషయానికి వస్తే,ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీ నుండి శక్తిని పొందుతుంది. ఇది 20W ఫాస్ట్ ఛార్జింగ్ కు మద్దతు ఇస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ పరికరం గరిష్టంగా 34 గంటల టాక్ టైమ్, 94 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ సమయం మరియు 16 గంటల వీడియో ప్లేబ్యాక్‌ని అందిస్తుంది.
ఇక సెక్యూరిటీ భద్రతా ప్రయోజనాల ఫీచర్ల యొక్క వివరాలు గమనిస్తే, ఈ ఫోన్లో పవర్ బటన్‌లో పొందుపరిచిన సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇంకా ఈ ఫోన్, నీటి నిరోధకత కోసం IP52 రేటింగ్‌ను కూడా కలిగి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న టీజర్ ఫోటో ప్రకారం ఈ ఫోన్ బ్లాక్ మరియు బ్లూ కలర్ ఆప్షన్‌లలో లాంచ్ అవుతుందని తెలుస్తోంది.
ఆగస్టు 1 మరెంతో దూరంలో లేదు, ఆగస్టు 1 న భారతదేశంలో లాంచ్ అయిన తర్వాత ఈ స్మార్ట్ ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్‌లు మరియు ధరల సమాచారాన్ని మనం తెలుసుకోవచ్చు. అంత వరకు వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications








