Home
News

Moto G22 స్మార్ట్‌ఫోన్ నేటి మొదటి అమ్మకంలో రూ.1000 వరకు డిస్కౌంట్ ఆఫర్స్...

భారతదేశంలో మోటరోలా సంస్థ గత వారం లాంచ్ చేసిన మోటో G22 స్మార్ట్‌ఫోన్‌ను నేడు వినియోగదారులు కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రానున్నది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్ కార్ట్ లో దీని యొక్క మొదటి సేల్స్ ప్రారంభం కానున్నాయి. మోటరోలా బ్రాండ్ యొక్క సరికొత్త స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ ధరలో లభిస్తూ 50-మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరాసెటప్ మరియు మీడియాటెక్ హీలియో చిప్‌సెట్‌ ఫీచర్లతో పాటు 720x1600 పిక్సెల్‌ల రిజల్యూషన్ మరియు 90 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.53-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. మోటో G22 ఫోన్ యొక్క మొదటి సేల్స్ లో లభించే డిస్కౌంట్ ఆఫర్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

మోటో G22 స్మార్ట్‌ఫోన్ ధరలు & లాంచ్ ఆఫర్స్

మోటో G22 స్మార్ట్‌ఫోన్ ధరలు & లాంచ్ ఆఫర్స్

మోటో G22 స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ ఒకే ఒక వేరియంట్లో రూ.10,999 బడ్జెట్ ధర వద్ద కాస్మిక్ బ్లాక్, ఐస్‌బర్గ్ బ్లూ మరియు మింట్ గ్రీన్ వంటి మూడు విభిన్న కలర్ లలో లాంచ్ అయింది. ఇండియా మార్కెట్ లో మోటరోలా కంపెనీ ఆన్ లైన్ స్టోర్స్ మరియు ఫ్లిప్ కార్ట్ ద్వారా మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదటిసారి కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ లో పరిమిత స్టాక్‌లలో లభించే ఈ ఫోన్ ను కొనుగోలు చేసిన వారికి రూ.1,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

మోటో G22 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

మోటో G22 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

మోటో G22 స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 12 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతుంది. ఇది 20:9 యాస్పెక్ట్ రేషియో మరియు 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల HD+ (720x1,600 పిక్సెల్‌లు) మాక్స్ విజన్ డిస్‌ప్లేతో వస్తుంది. అలాగే ఇది హుడ్ కింద IMG PowerVR GE8320 GPU మరియు 4GB RAMతో పాటు ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో G37 SoCతో శక్తిని పొందుతుంది.

ఆప్టిక్స్

మోటో G22 స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఈ కెమెరా సెటప్‌లో f/1.8 లెన్స్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ను, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ మరియు 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కెమెరాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ బ్యాక్ కెమెరా సెటప్ LED ఫ్లాష్‌తో జత చేయబడి ఉండి ఫుల్-HD వీడియోలను 30fps ఫ్రేమ్ రేటుతో రికార్డ్ చేయగలదు. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ఫోన్ ముందు భాగంలో f/2.45 లెన్స్‌తో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ కొత్త ఫోన్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. దీనిని మైక్రో SD కార్డ్ ప్రత్యేక స్లాట్ ద్వారా 1TB వరకు విస్తరించడానికి అనుమతిస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.0, FM రేడియో, GPS/ A-GPS, USB టైప్-C మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. బోర్డులోని సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్ మరియు సామీప్య సెన్సార్ మరియు సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌లను కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Motorola Moto G22 Smartphone First Sale Starts Today at 12PM via Flipkart: Price, Specifications, Discount offers and Deals
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X