Home
News

మోటో G22 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది!! ప్రత్యేకమైన ఫీచర్లు ఎన్నో...

మోటరోలా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నేడు ఇండియాలో బడ్జెట్ విభాగంలో తాజాగా మోటో G22 ఫోన్‌ను విడుదల చేసింది. ఇది గత నెలలో యూరప్‌లో మొదటగా లాంచ్ చేయబడింది. మోటో G22 ఫోన్ బడ్జెట్ విభాగంలో పంచ్- హోల్ డిజైన్ డిస్‌ప్లే మరియు క్వాడ్ రియర్ కెమెరా వంటి ఫీచర్లతో వస్తుంది. ఇది 90Hz డిస్‌ప్లేతో పాటు 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది ఒకే ఛార్జ్‌పై 37.8 గంటల బ్యాకప్‌ను అందించడానికి రేట్ చేయబడింది. ఇండియా మార్కెట్ లో రెడ్ మి 10, ఇన్ఫినిక్స్ నోట్ 11S, రియల్ మి C25Y వంటి వాటితో పోటీపడే దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

మోటో G22 స్మార్ట్‌ఫోన్ ధరలు & లాంచ్ ఆఫర్స్

మోటో G22 స్మార్ట్‌ఫోన్ ధరలు & లాంచ్ ఆఫర్స్

భారతదేశంలో మోటో G22 స్మార్ట్‌ఫోన్ కేవలం ఒకే ఒక వేరియంట్లో లాంచ్ అయింది. 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ తో లభించే ఈ ఫోన్ మార్కెట్ లో రూ.10,999 బడ్జెట్ ధర వద్ద లభిస్తుంది. ఈ ఫోన్ ఏప్రిల్ 13 నుండి ఫ్లిప్ కార్ట్ ద్వారా మొదటిసారి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఇది కాస్మిక్ బ్లాక్, ఐస్‌బర్గ్ బ్లూ మరియు మింట్ గ్రీన్ వంటి మూడు విభిన్న కలర్ లలో లభిస్తుంది. పరిమిత స్టాక్‌లలోని లాంచ్ ఆఫర్‌లలో భాగంగా ఏప్రిల్ 13-14 మధ్య ఫ్లిప్‌కార్ట్ ద్వారా చేసే కొనుగోలు చేసే వారు రూ.1,000 వరకు తగ్గింపును పొందుతారు.

మోటో G22 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

మోటో G22 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

మోటో G22 స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 12 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతుంది. ఇది 20:9 యాస్పెక్ట్ రేషియో మరియు 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల HD+ (720x1,600 పిక్సెల్‌లు) మాక్స్ విజన్ డిస్‌ప్లేతో వస్తుంది. అలాగే ఇది హుడ్ కింద IMG PowerVR GE8320 GPU మరియు 4GB RAMతో పాటు ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో G37 SoCతో శక్తిని పొందుతుంది.

ఆప్టిక్స్

మోటో G22 స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఈ కెమెరా సెటప్‌లో f/1.8 లెన్స్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ను, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ మరియు 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కెమెరాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ బ్యాక్ కెమెరా సెటప్ LED ఫ్లాష్‌తో జత చేయబడి ఉండి ఫుల్-HD వీడియోలను 30fps ఫ్రేమ్ రేటుతో రికార్డ్ చేయగలదు. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ఫోన్ ముందు భాగంలో f/2.45 లెన్స్‌తో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ కొత్త ఫోన్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. దీనిని మైక్రో SD కార్డ్ ప్రత్యేక స్లాట్ ద్వారా 1TB వరకు విస్తరించడానికి అనుమతిస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.0, FM రేడియో, GPS/ A-GPS, USB టైప్-C మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. బోర్డులోని సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్ మరియు సామీప్య సెన్సార్ మరియు సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌లను కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Motorola Moto G22 Smartphone Launched in India With 90Hz Display: Price, Specs, Sale Date, Sale Offers and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X