Home
News

తక్కువ ధరలో, Motorola నుంచి మరో కొత్త 5G స్మార్ట్ ఫోన్!ధర, లాంచ్ వివరాలు

మోటోరోలా సంస్థ గత నెలలో Moto G34 5G స్మార్ట్ ఫోన్ ని చైనాలో లాంచ్ చేయబడింది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 695 SoC ప్రాసెసర్ తో లాంచ్ చేయబడింది. లెనోవో యాజమాన్యంలోని మోటరోలా బ్రాండ్ త్వరలో భారతదేశంలో కూడా ఈ మధ్య-శ్రేణి స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయాలనీ సన్నాహాలు చేస్తోంది.

సంస్థ ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీని ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. అయితే, తాజా లీక్ ప్రకారం Moto G34 5G జనవరి 9న భారత దేశంలో అధికారికంగా అందుబాటులోకి వస్తుంది. మోటో G34 5G ఫోన్ 50 మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్‌తో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. మోటో G34 యొక్క చైనీస్ వేరియంట్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్ 5,000mAh బ్యాటరీతో మద్దతు ఇస్తుంది.

Motorola Moto G34 5G Expected To Launch On January 9 In India. India Price And Specifications Details.

ప్రముఖ, Tipster Mukul Sharma (@stufflistings) X లో జనవరి 9న భారత మార్కెట్లో Moto G34 5G లాంచ్ అవుతుందని పేర్కొన్నారు. చైనీస్ వేరియంట్ లాగా, భారతదేశంలోకి వచ్చే వెర్షన్ స్నాప్‌డ్రాగన్ 695 SoC ప్రాసెసర్ తో పనిచేస్తుందని చెప్పబడింది. ఇది దాని విభాగంలో అత్యంత వేగవంతమైన 5G స్మార్ట్ ఫోన్ గా నిలుస్తుందని అంచనాలున్నాయి.

మోటో G34 5G ఆగష్టు 2022 లో ప్రారంభమైన Moto G32 స్మార్ట్ ఫోన్ కు కొనసాగింపుగా వస్తుందని అంచనా వేయబడింది. దీని ధర 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ కోసం రూ.12,999 గా ఉండబోతోంది

మోటో G34 5G ప్రస్తుతం చైనాలో ధర CNY 999 (దాదాపు రూ. 11,600)కి 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ కోసం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది సీ బ్లూ మరియు స్టార్ బ్లాక్ రంగులలో అందించబడుతుంది.

Moto G34 5G స్పెసిఫికేషన్ల వివరాలు
Moto G34 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 లో పనిచేస్తుంది. మరియు 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 20:9 యాస్పెక్ట్ రేషియోతో 6.5 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. చెప్పినట్లుగా, ఇది 8GB RAM మరియు 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో పాటు ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 695 SoC ద్వారా శక్తిని పొందుతుంది. ఇది వర్చువల్ ర్యామ్‌గా 8GB వరకు ఉపయోగించని నిల్వను ఉపయోగించవచ్చు.

ఇక కెమెరా ఆప్టిక్స్ వివరాలు గమనిస్తే, మోటో G34 5G డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మరియు 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉన్నాయి. మోటరోలా హ్యాండ్‌సెట్ సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.

ఈ ఫోన్ బయోమెట్రిక్ ప్రమాణీకరణ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది మరియు డాల్బీ అట్మోస్‌తో కూడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది. మోటోరోలా 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,000mAh బ్యాటరీతో హ్యాండ్‌సెట్‌ను అమర్చింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Motorola Moto G34 5G Expected To Launch On January 9 In India. India Price And Specifications Details.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X