Home
News

మోటోG51 5G స్మార్ట్‌ఫోన్ మొదటి సేల్స్ మొదలయ్యాయి!! ఆఫర్స్ మిస్ అవ్వకండి

Lenovo యాజమాన్యంలోని మోటోరోలా బ్రాండ్ ఇటీవల ఇండియాలో మోటో G51 5G స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేసారు. ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క అమ్మకాలు మొదటిసారిగా ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఈ పాకెట్-ఫ్రెండ్లీ 5G స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకంగా Flipkart ద్వారా గొప్ప ఆఫర్లతో విక్రయించబడుతుంది. హుడ్ కింద ఇది స్నాప్‌డ్రాగన్ 480 ప్లస్ SoC ద్వారా రన్ అవుతూ 4GB RAM మరియు 64GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో జత చేయబడి వస్తుంది. అలాగే ఇది 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. వీటన్నింటికీ 20W రాపిడ్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,000mAh బ్యాటరీ ప్యాక్ చేయబడి వస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

మోటోG51 5G ధరలు & సేల్స్ ఆఫర్స్

మోటోG51 5G ధరలు & సేల్స్ ఆఫర్స్

భారతదేశంలో ఇటీవల లాంచ్ అయిన మోటోG51 5G స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో ఈరోజు మధ్యాహ్నం 12pm IST నుంచి Flipkartలో ప్రత్యేకంగా కొనుగోలు చేయడానికి వినియోగదారులకు అందుబాటులో ఉంది. 4GB RAM + 64GB స్టోరేజ్ ఏకైక వేరియంట్‌లో లభించే ఈ ఫోన్ యొక్క ధర రూ.14,999. ఈ Motorola స్మార్ట్‌ఫోన్‌ ఆక్వా బ్లూ మరియు ఇండిగో బ్లూ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయడానికి వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ లో దీనిని నెలకు రూ.520 EMI ధరతో కొనుగోలు చేయవచ్చు. ఇంకా ఈ హ్యాండ్‌సెట్‌పై 12 నెలల వారంటీ మరియు ఉపకరణాలపై ఆరు నెలల వారంటీతో అందించబడుతుంది.

మోటోG51 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

మోటోG51 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

మోటోG51 5G స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11ఆధారిత My UXతో రన్ అవుతుంది. ఇది 20:9 యాస్పెక్ట్ రేషియో మరియు 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల ఫుల్-HD+ (1,080 x 2,400 పిక్సెల్‌లు) మాక్స్ విజన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. Motorola స్మార్ట్‌ఫోన్‌కు శక్తినిచ్చే Qualcomm Snapdragon 480 Plus SoC 4GB RAMతో జత చేయబడింది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుకభాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ మరియు డెప్త్ సెన్సార్ మరియు 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్‌ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం ముందు భాగంలో 13-మెగాపిక్సెల్ సెన్సార్ సెల్ఫీ కెమెరాతో ప్యాక్ చేయబడి వస్తుంది.

స్టోరేజ్

Moto G51 5G స్మార్ట్‌ఫోన్ 64GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ తో ప్యాక్ చేయబడి వస్తుంది. అయితే అదనపు స్టోరేజ్ ను విస్తరించడం సాధ్యం కాదు. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.1, GPS/ A-GPS, NFC, FM రేడియో, USB టైప్-C మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్ మరియు ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి. అలాగే ఈ ఫోన్ 20W రాపిడ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 170.47x76.54x9.13mm కొలతల పరిమాణంతో 208 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Motorola Moto G51 5G Smartphone First Sale Live on Flipkart India: Price, Specs, Sale Offers and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X