మోటోరోలా మోటో G51 స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 480+తో ఇండియాలో త్వరలో లాంచ్ కానున్నది!! ఫీచర్స్ ఇవిగో...

|

Lenovo యాజమాన్యంలోని మోటోరోలా బ్రాండ్ ఇటీవల యూరోప్‌లో మోటోరోలా మోటో G51 స్మార్ట్‌ఫోన్‌ను ట్రిపుల్ రియర్ కెమెరా మరియు 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్‌తో వంటి స్పెసిఫికేషన్‌లతో లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు మోటరోలా సంస్థ ఈ బ్రాండ్ ఫోన్‌ను భారతదేశంలో లాంచ్ చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టింది. మోటోరోలా బ్రాండ్ స్నాప్‌డ్రాగన్ 480+ ఫీచర్ తో రాబోతున్న మొట్టమొదటి ఫోన్‌గా డిసెంబర్‌లో భారతదేశంలో లాంచ్ చేయవచ్చని తాజా లీక్ సూచిస్తుంది. అయితే ఖచ్చితమైన తేదీని కంపెనీ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. Moto G51 ఫోన్ 4GB RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో పాటు 5,000mAh బ్యాటరీతో ప్యాక్ వస్తుంది.

 

మోటో G51 5G

91మొబైల్స్ నివేదిక ప్రకారం మోటో G51 5G డిసెంబర్‌లో భారతదేశంలో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దేశంలోనే లాంచ్ కానున్న మొట్టమొదటి స్నాప్‌డ్రాగన్ 480+ చిప్‌సెట్-ఆధారిత స్మార్ట్‌ఫోన్ ఈ హ్యాండ్‌సెట్ కావడం విషేషం. స్నాప్‌డ్రాగన్ 480+ అక్టోబర్‌లో స్నాప్‌డ్రాగన్ 480కి సక్సెసర్‌గా వచ్చింది. ప్రాసెసర్ గరిష్టంగా 2.2GHz క్లాక్ స్పీడ్‌తో ఆక్టా-కోర్ క్రియో 460 CPUని కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ యొక్క ఇతర ఫీచర్లలో అడ్రినో 619 GPU, హెక్సాగన్ 686 ప్రాసెసర్, స్నాప్‌డ్రాగన్ X51 5G మోడెమ్-RF సిస్టమ్ మరియు ఫాస్ట్‌కనెక్ట్ 6200 సిస్టమ్ ఉన్నాయి.

ధర

Moto G51 స్మార్ట్‌ఫోన్ యూరోప్‌లో EUR 229.99 ధర వద్ద లాంచ్ అయింది. ఇండియా యొక్క కరెన్సీ ప్రకారం దీని విలువ దాదాపు రూ.19,300 ధరను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ త్వరలో భారతదేశం, లాటిన్ అమెరికా మరియు మిడిల్ ఈస్ట్‌లోని ఎంపిక చేసిన ధర వద్ద మార్కెట్‌లో విడుదల కానుంది. ఇతర Moto G-సిరీస్ ఫోన్‌లు Moto G31, Moto G71 మరియు Moto G200 కూడా తర్వాత భారతదేశంలో లాంచ్ అవుతాయని భావిస్తున్నారు.

Moto G51 స్పెసిఫికేషన్స్
 

Moto G51 స్పెసిఫికేషన్స్

Moto G51 స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ 11-ఆధారితంగా 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 20:9 యాస్పెక్ట్ రేషియోతో 6.8-అంగుళాల ఫుల్-HD+ (1,080x2,400 పిక్సెల్‌లు) LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. పైన పేర్కొన్నట్లుగా ఈ హ్యాండ్‌సెట్ కొత్త Qualcomm స్నాప్‌డ్రాగన్ 480+ SoCతో రన్ అవుతూ 4GB RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో ప్యాక్ చేయబడి వస్తుంది. అలాగే ఇందులో గల మైక్రో SD కార్డ్ ఉపయోగించి మెమొరీని మరింత విస్తరించడానికి అవకాశం ఉంది.

Moto G51

Moto G51 ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ మరియు 2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియోల కోసం ఫోన్ ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంది. Moto G51 10W ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.

మోటో G200

** మోటో G200 ఫోన్ 6.8-అంగుళాల FHD+ LCD డిస్‌ప్లే, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ, వెనుకవైపు ట్రిపుల్-కెమెరా సెటప్ మరియు స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం రేట్ చేయబడిన IP52ని కలిగి ఉంది. అయినప్పటికీ, Moto G71 Qualcomm Snapdragon 695 చిప్‌సెట్, 6.4-అంగుళాల FHD+ OLED డిస్‌ప్లే, 30W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 5000mAh బ్యాటరీ మరియు వాటర్ రిపెల్లెంట్ కోసం IP52 రేటింగ్‌తో ఆధారితమైనది.

** మోటో G51 ఫోన్ 6.8-అంగుళాల FHD+ IPS LCD డిస్‌ప్లే, Qualcomm Snapdragon 480+ చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 11 OS అవుట్ ఆఫ్ ది బాక్స్, 10W ఛార్జింగ్ స్పీడ్‌కు మద్దతు ఇచ్చే 5000mAh బ్యాటరీ ఉన్నాయి.

** మోటో G41 ఫోన్ 6.4-అంగుళాల FHD+ OLED డిస్ప్లే, MediaTek Helio G85 చిప్‌సెట్, 5000mAh బ్యాటరీ మరియు IP52 రేటింగ్‌ను కలిగి ఉంది. Moto G31 6.4-అంగుళాల OLED డిస్ప్లే, 5000mAh బ్యాటరీ మరియు భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.

 

Best Mobiles in India

English summary
Motorola Moto G51 Smartphone to be Launched in India Next Month With Snapdragon 480+ Soc

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X