మోటో G52 స్మార్ట్‌ఫోన్ అందుబాటు ధరలో లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్ ఇవిగో

|

మోటరోలా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నేడు ఇండియాలో తాజాగా మోటో G52 ఫోన్‌ను విడుదల చేసింది. గత సంవత్సరం విడుదలైన మోటో G51 5Gకి అప్ డేట్ వెర్షన్ గా వస్తున్న మోటరోలా కొత్త స్మార్ట్‌ఫోన్ 90Hz poLED డిస్‌ప్లేతో పాటుగా ట్రిపుల్ రియర్ కెమెరాలను మరియు డాల్బీ అట్మాస్ సపోర్ట్ సౌండ్ టెక్నాలజీతో కూడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంటుంది. అలాగే ఇది ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 SoC ద్వారా శక్తిని పొందుతు గరిష్టంగా 6GB RAMతో జతచేయబడి వస్తుంది. ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో రెడ్ మి10 పవర్, ఒప్పోK10 మరియు రియల్ మి 9i వంటి వాటితో పోటీపడుతున్న ఈ కొత్త ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

మోటో G52 ధరల వివరాలు

మోటో G52 ధరల వివరాలు

భారతదేశంలో మోటో G52 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. ఇందులో 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.14,499 కాగా 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్‌ యొక్క ధర రూ.16,499. ఇది చార్‌కోల్ గ్రే మరియు పింగాణీ వైట్ వంటి కలర్ లలో లభిస్తుంది. ప్రస్తుత ధరలు పరిచయ ధరలు కావున భవిష్యత్తులో ధరలలో మార్పులు ఉండవచ్చు. దీనికి సంబంధించి ఖచ్చితమైన వివరాలను సంస్థ వెల్లడించలేదు. ఇవి ఫ్లిప్‌కార్ట్ మరియు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌ల ద్వారా మే 27 మధ్యాహ్నం 12 గంటల నుండి విక్రయించబడనున్నది.

మోటో G52 స్మార్ట్‌ఫోన్ లాంచ్ ఆఫర్‌లు

మోటో G52 స్మార్ట్‌ఫోన్ లాంచ్ ఆఫర్‌లు

మోటో G52 ఫోన్ యొక్క మొదటి సేల్స్ లాంచ్ ఆఫర్‌లలో భాగంగా HDFC క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించే కస్టమర్‌లకు రూ.1,000 వరకు తక్షణ తగ్గింపును పొందవచ్చు. అలాగే జియో వినియోగదారులు కూడా రూ.2,549 విలువైన ప్రయోజనాలను పొందుతారని పేర్కొన్నారు. ఇందులో రీఛార్జ్‌పై రూ.2,000 క్యాష్‌బ్యాక్ మరియు Zee5 వార్షిక సబ్‌స్క్రిప్షన్‌పై రూ.549 తగ్గింపు ఉన్నాయి. అదనంగా ఫ్లిప్‌కార్ట్‌లో EMI ఎంపికలు అలాగే పాత ఫోన్‌కు బదులుగా Moto G52ని పొందే ఎంపిక కూడా ఉంటుంది.

మోటో G52 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్
 

మోటో G52 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

మోటో G52 స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 12 తో రన్ అవుతుంది. ఇది 20:9 యాస్పెక్ట్ రేషియో మరియు 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల ఫుల్-HD+ (1,080x2,400 పిక్సెల్‌లు) పోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. హోల్-పంచ్ డిజైన్‌తో వచ్చే ఈ డిస్‌ప్లేలో 360Hz టచ్ శాంప్లింగ్ రేట్, DCI-P3 కలర్ గామట్ మరియు DC డిమ్మింగ్ కూడా ఉన్నాయి. హుడ్ కింద ఇది స్నాప్‌డ్రాగన్ 680 SoCతో పాటు Adreno 610 GPU మరియు 6GB వరకు LPDDR4X RAMని కలిగి ఉంది.

ఆప్టిక్స్

మోటో G52 స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో f/1.8 లెన్స్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో పాటు 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్‌తో పాటు డెప్త్ సెన్సార్‌ కోసం అదనంగా f/2.4 లెన్స్‌తో 2-మెగాపిక్సెల్ సెన్సార్‌ని కలిగి ఉంటుంది. ఇందులోని కెమెరా డ్యూయల్ క్యాప్చర్, స్మార్ట్ కంపోజిషన్, స్పాట్ కలర్, లైవ్ మోటో, ప్రో మోషన్ మరియు అల్ట్రా-వైడ్ డిస్టార్షన్ కరెక్షన్ వంటి ఫీచర్లకు మద్దతు ఇస్తుంది. ఇది 30fps ఫ్రేమ్ రేటుతో పూర్తి-HD వీడియో రికార్డింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. సెల్ఫీలను క్యాప్చర్ చేయడం మరియు వీడియో చాట్‌ల కోసం ముందు భాగంలో f/2.45 లెన్స్‌తో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్ ను కలిగి ఉంది. ఫోన్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.0, FM రేడియో, GPS/ A-GPS, USB టైప్-C, NFC మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. బోర్డులోని సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్ మరియు సామీప్య సెన్సార్ ఉన్నాయి. ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Motorola Moto G52 Smartphone Launched in India With Triple Rear Camera Setup: Price, Specs, Sale Date and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X