Home
News

Moto G8 Power Lite Sale: బడ్జెట్ ధరలో మంచి స్మార్ట్‌ఫోన్‌ కోసం చూస్తున్నారా!! ఇదే మంచి ఎంపిక...

ప్రస్తుతం ఇండియాలోని ప్రజలు ఎక్కువ మంది సరసమైన ధరల విభాగంలో లభించే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లను కొనడానికి అధికంగా ఇష్టపడుతున్నారు. ఇండియాలో మర్చి నుండి మొదలైన లాక్ డౌన్ కారణంగా మరియు చాలా మంది ఉద్యోగాలు పోవడం లేదా సగం జీతాలు రావడం కారణంగా కూడా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్

ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్

ఇండియాలోని స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ల విభాగంలో ఆధిపత్యం చెలాయించిన మోటరోలా సంస్థ ఇప్పుడు మోటో జి 8 పవర్ లైట్‌తో మరోసారి దూకుడుగా ఉంది. లెనోవా యాజమాన్యంలోని స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ మోటోరోలా ఇటీవల మోటరోలా వన్ ఫ్యూజన్ + ను లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ సంస్థ యొక్క బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మోటో G8 పవర్ లైట్ యొక్క అమ్మకాలు ఈ రోజు ఫ్లిప్‌కార్ట్‌లో 12:00 PM నుండి మొదలు కానున్నాయి. మోటరోలా యొక్క ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

మోటో జి 8 పవర్ లైట్ Vs రియల్‌మి నార్జో 10A

మోటో జి 8 పవర్ లైట్ Vs రియల్‌మి నార్జో 10A

మోటరోలా తన కొత్త ఎంట్రీ లెవల్ మోటో జి-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ కేవలం ఒకే ఒక స్టోరేజ్ ఎంపికలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది ఈ ధర విభాగంలో చాలా స్మార్ట్‌ఫోన్లకు పోటీగా మంచి ఆసక్తిని కనబరిచినట్లు తెలుస్తోంది. మోటో జి 8 పవర్ లైట్ ఫోన్ రియల్‌మి నార్జో 10A, రియల్‌మి C3 మరియు రెడ్‌మి 8A డ్యూయల్ వంటి స్మార్ట్‌ఫోన్‌ల నుండి నిజమైన సవాలును ఎదురుకుంటున్నది.

మోటో G 8 పవర్ లైట్ ధరల వివరాలు

మోటో G 8 పవర్ లైట్ ధరల వివరాలు

మోటరోలా యొక్క మోటో G 8 పవర్ లైట్ స్మార్ట్‌ఫోన్ కేవలం ఒకే ఒక వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. ఇందులో భాగమైన 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ యొక్క సింగిల్ వేరియంట్‌ ధర 8,999 రూపాయలు. ఈ ఫోన్ ఆర్కిటిక్ బ్లూ మరియు రాయల్ బ్లూ వంటి రెండు కలర్ ఆప్షన్లలో ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

 

మోటో G 8 పవర్ లైట్ సేల్స్ ఆఫర్స్

మోటో G 8 పవర్ లైట్ సేల్స్ ఆఫర్స్

ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా జరిగే మోటో జి 8 పవర్ లైట్‌ సేల్స్ యొక్క ఆఫర్లలో భాగంగా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ఐదు శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇంకా నో-కాస్ట్ ఇఎంఐ ఎంపికలతో పాటుగా నెలవారీ రూ.750 EMI ఎంపిక కూడా ఉంది. ఇంకా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లో 5 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్ కూడా ఉంది.

మోటో G 8 పవర్ లైట్ స్పెసిఫికేషన్స్

మోటో G 8 పవర్ లైట్ స్పెసిఫికేషన్స్

మోటరోలా యొక్క మోటో G8 పవర్ లైట్‌ స్మార్ట్‌ఫోన్‌ యొక్క 6.5-అంగుళాల డిస్ప్లే 20: 9 కారక నిష్పత్తితో IPS LCD మాక్స్ విజన్ ప్యానల్‌ను కలిగి ఉంది. ఇది వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్డ్ డిస్‌ప్లేను HD + రిజల్యూషన్‌తో కలిగి ఉంటుంది. ఇది మీడియాటెక్ హెలియో P 35 చిప్‌సెట్ ను కలిగి ఉండి ఆండ్రాయిడ్ 9 పై ఓఎస్‌తో రన్ అవుతుంది. అలాగే ఇది 10W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ తో 5,000mah బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంది.

మోటో G 8 పవర్ లైట్ కెమెరా సెటప్‌

మోటో G 8 పవర్ లైట్ కెమెరా సెటప్‌

మోటో G8 పవర్ లైట్‌ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఈ సెటప్‌లో 16 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఎఫ్ / 2.0 ఎపర్చర్‌తో వస్తుంది. అలాగే ఈ సెటప్‌లో ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ సెకండరీ కెమెరా మరియు ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు జతచేయబడి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియోల కోసం ఫోన్ యొక్క ముందుభాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఇది డ్యూయల్ కెమెరా బోకె, ఫేస్ బ్యూటీ, హెచ్‌డిఆర్, గూగుల్ లెన్స్ వంటి మరిన్ని ఫీచర్లకు కూడా మద్దతు ఇస్తుంది. ముందు మరియు వెనుక కెమెరా సెన్సార్లు రెండూ 30fps 1080p వీడియో రికార్డింగ్ కోసం మద్దతునిస్తాయి.

మోటో G8 పవర్ లైట్ కనెక్టివిటీ

మోటో G8 పవర్ లైట్ కనెక్టివిటీ

మోటరోలా మోటో జి 8 పవర్ లైట్ స్మార్ట్‌ఫోన్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఎంపికతో లభిస్తుంది. ఈ కొత్త ఫోన్‌లో గల ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 500GB వరకు విస్తరించవచ్చు. కనెక్టివిటీ ఎంపికలలో డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11 b/g/n, బ్లూటూత్ 4.2, జిపిఎస్, మైక్రో యుఎస్‌బి పోర్ట్ మరియు 3.5mm ఆడియో జాక్ లు ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ గల ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం ఒక ఛార్జ్‌లో రెండు రోజుల లైఫ్ ను అందిస్తుంది. ఇది స్ప్లాష్-రెసిస్టెంట్ ను కలిగి ఉండి 200 గ్రాముల బరువు ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Motorola Moto G8 Power Lite Sale Start at 12PM Via Flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X