Motorola Edge 2022 లాంచ్ అయింది! ధర మరియు ఫీచర్లు చూడండి.

By Maheswara
|

మోటరోలా కొత్త స్లిమ్ మోటరోలా ఎడ్జ్ 2022 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ముఖ్యంగా ఈ కొత్త స్మార్ట్ ఫోన్ కాస్త ఎక్కువ ధర మరియు నాణ్యమైన ఫీచర్లతో వస్తోంది. అలాగే, ఈ Motorola Edge 2022 ఫోన్ US మరియు కెనడాలో మాత్రమే ప్రస్తుతం లాంచ్ చేయబడింది. త్వరలో అన్ని దేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం ఉంది. ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్ ధర మరియు ఫీచర్లను నిశితంగా పరిశీలిద్దాం.

 

స్పెసిఫికేషన్లు

స్పెసిఫికేషన్లు

Motorola Edge 2022 స్మార్ట్‌ఫోన్ 6.6-అంగుళాల ఫుల్ HD ప్లస్ OLED డిస్‌ప్లేతో వస్తుంది. ఈ అందమైన స్మార్ట్‌ఫోన్ 1,080×2,400 పిక్సెల్‌లు, 144 Hz రిఫ్రెష్ రేట్, 10-బిట్ కలర్, 20:9 యాస్పెక్ట్ రేషియో, HDR 10 ప్లస్ సపోర్ట్ మరియు అద్భుతమైన సెక్యూరిటీ ఫీచర్‌లతో వస్తుంది. Motorola Edge 2022 స్మార్ట్‌ఫోన్ 6nm చిప్‌తో కూడిన ప్రామాణిక MediaTek డైమెన్సిటీ 1050 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కాబట్టి ఈ స్మార్ట్‌ఫోన్ మెరుగైన పనితీరును అందిస్తుంది. అలాగే, ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడి ఉండటం గమనార్హం.

కెమెరా సెటప్

కెమెరా సెటప్

కొత్త మోటరోలా ఎడ్జ్ 2022 స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ 50MP ప్రైమరీ సెన్సార్ + 13MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ + 2MP డెప్త్ సెన్సార్. ఈ అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం 32MP కెమెరాతో వస్తుంది.

కనెక్టివిటీ ఫీచర్లు
 

కనెక్టివిటీ ఫీచర్లు

ఈ Motorola Edge 2022 ఫోన్‌కు 8GB RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ మద్దతు ఉంది. ఈ కొత్త మోటరోలా స్మార్ట్‌ఫోన్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ సపోర్ట్‌తో వచ్చింది. అలాగే, ఈ కొత్త Motorola Edge 2022 స్మార్ట్‌ఫోన్ 5000 mAh బ్యాటరీ సపోర్ట్‌తో వచ్చింది. కాబట్టి ఛార్జింగ్ గురించి చింతించకండి. ఈ కొత్త మోటరోలా స్మార్ట్‌ఫోన్ 30W టర్బోపవర్ వైర్డ్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు 5W రివర్స్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

స్మార్ట్‌ఫోన్ ధర

స్మార్ట్‌ఫోన్ ధర

అద్భుతమైన Motorola Edge 2022 స్మార్ట్‌ఫోన్‌లో సింగిల్ SIM 5G, బ్లూటూత్ 5.2, NFC, Wi-Fi 6 మరియు USB-C పోర్ట్ వంటి కనెక్టివిటీ మద్దతు ఉంది. అలాగే ఈ ఫోన్ బ్లాక్ కలర్ లో లాంచ్ చేయబడింది.

8GB RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ ఉన్న Motorola Edge 2022 స్మార్ట్‌ఫోన్ ధర $499.99 (భారత కరెన్సీలో రూ. 40,000). ముఖ్యంగా ఈ స్మార్ట్‌ఫోన్‌కు మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు.

ఇండియా లో మోటో ట్యాబ్ G62 టాబ్లెట్

ఇండియా లో మోటో ట్యాబ్ G62 టాబ్లెట్

ఇంకా, ఇటీవలే ఇండియా లో మోటరోలా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటో ట్యాబ్ G62 టాబ్లెట్ ని లాంచ్ చేసింది. ఈ టాబ్లెట్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 680 SoC ద్వారా శక్తిని పొందుతూ 4GB LPDDR4X RAMతో జతచేయబడి అందించబడింది. ఇది 2K+ రిజల్యూషన్‌తో 10.61-అంగుళాల IPS LCD డిస్‌ప్లేను 16:10 యాస్పెక్ట్ రేషియో మరియు TUV రైన్‌ల్యాండ్ బ్లూ లైట్ ఎమిషన్ సర్టిఫికేషన్‌తో లభిస్తుంది. వెనుక భాగంలో 8-మెగాపిక్సెల్ ఆటో-ఫోకస్ సింగిల్ రియర్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

మోటో ట్యాబ్ G62 టాబ్లెట్ ధరల వివరాలు

మోటో ట్యాబ్ G62 టాబ్లెట్ ధరల వివరాలు

మోటో ట్యాబ్ G62 టాబ్లెట్ ఇండియాలో రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. ఇందులో Wi-Fi-ఓన్లీ వేరియంట్ యొక్క ధర రూ.15,999 కాగా LTE వేరియంట్ రూ.17,999 ధర వద్ద ఫ్రాస్ట్ బ్లూ కలర్ ఎంపికలో లభిస్తుంది. ఈ టాబ్లెట్ యొక్క Wi-Fi వేరియంట్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. అయితే మోటో ట్యాబ్ G62 టాబ్లెట్ యొక్క LTE వేరియంట్ ప్రస్తుతం ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది. ఇది ఫ్లిప్‌కార్ట్ లో ఆగస్టు 22 మధ్యాహ్నం 12 గంటల నుండి విక్రయించబడుతుంది.  

Best Mobiles in India

English summary
Motorola New 5G Phone Motorola Edge 2022 Launched. Price And Specifications Details.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X