కొత్త మోటో G73 5G స్మార్ట్ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ తేదీ,స్పెసిఫికేషన్లు
మోటోరోలా యొక్క మోటో G73 5G స్మార్ట్ ఫోన్ గత నెల ఫిబ్రవరిలో మోటో G53 5G తో పాటు ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేయబడింది. మరియు ఇప్పుడు ఈ ఫోన్ భారతదేశంలో కూడా లాంచ్ కానున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ హ్యాండ్‌సెట్ భారతదేశంలో కొత్త మీడియా టెక్ డైమెన్సిటీ 930 SoC ప్రాసెసర్ తో లాంచ్ అవుతుందని అంచనాలున్నాయి.
ఇంకా, మోటో G72 4G పరికరం కాబట్టి నిజంగా పోలిక చేయాలంటే మోటో G63 5Gకి అప్‌గ్రేడ్ గా మోటో G73 5G రాబోతోంది. ఈ కొత్త మోటోరోలా ఫోన్ యొక్క వివరాలను ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ తమ వెబ్‌సైట్‌లో రాబోయే లాంచ్ మరియు హ్యాండ్‌సెట్ గురించి వివరాలను తెలియజేస్తూ ల్యాండింగ్ పేజీని ప్రకటించింది.

ఫ్లిప్‌కార్ట్‌లోని ఈ ల్యాండింగ్ పేజీ భారత దేశంలో లాంచ్ అయ్యే స్మార్ట్ ఫోన్ గురించి ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తుంది. ఇది ఇంతకు ముందు ప్రకటించిన గ్లోబల్ వేరియంట్ ను పోలి ఉంటుంది. మోటరోలా ల్యాండింగ్ పేజీలో అందించిన సమాచారం ప్రకారం తన మోటో G73 5G ఫోన్ భారతదేశంలో మీడియా టెక్ యొక్క డైమెన్సిటీ 930 SoC ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుందని తెలుస్తోంది.
ఈ ప్రాసెసర్ మే 2022లో లాంచ్ చేయబడింది మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 1050 SoC లాగానే mmWave సామర్థ్యాన్ని (భారతదేశంలో అందుబాటులో లేదు) అందిస్తుంది. ఇది 6nm ప్రక్రియను ఉపయోగించి రూపొందించబడింది మరియు గరిష్టంగా 2.2GHz క్లాక్ స్పీడ్‌ను అందిస్తుందని తెలుస్తోంది.

ఫ్లిప్కార్ట్ యొక్క ల్యాండింగ్ పేజీ, ఫోన్ కెమెరాల గురించి చాలా వివరాలను అందిస్తుంది. ఈ ఫోన్ రెండు వెనుక వైపున ఉన్న కెమెరాలతో వస్తుందని మనకు తెలిసిన విషయమే, ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా మరియు 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉంటాయి. సెల్ఫీలు తీసుకోవడానికి 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. మోటరోలా ప్రైమరీ కెమెరా దాని పెద్ద 2μm పిక్సెల్ పరిమాణంతో మెరుగైన పనితీరును అందిస్తుందని పేర్కొంది.
ఈ ల్యాండింగ్ పేజీ సమాచారం ప్రకారం, ఈ ఫోన్ వాటర్ రిపెల్లెంట్ డిజైన్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది. ఇంతకు ముందున్న మోటో G62 5G కంటే ఇటీవలి మోటో G72కి అనుగుణంగా ఉంటుంది. ఈ ఫోన్ 6.5-అంగుళాల పూర్తి HD+ LCD ప్యానెల్‌ను కలిగి ఉంది. ఇది 120Hz గరిష్ట స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఆ పెద్ద డిస్‌ప్లేతో పాటుగా స్టీరియో స్పీకర్ సెటప్ ఉంది, దీనికి డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉన్నట్లు కూడా సమాచారం తెలుస్తోంది.
మోటో G73 5G ఫోన్ మోటరోలా యొక్క MyUX సాఫ్ట్‌వేర్ స్కిన్‌ను ఆండ్రాయిడ్ 13 బేస్‌గా పని చేస్తుందని చెప్పబడింది. ఈ మోటోరోలా స్మార్ట్‌ఫోన్ 13 5G బ్యాండ్‌లకు మద్దతు ఇస్తుందని కూడా పేర్కొంది. ఈ ఫోన్ Wi-Fi, బ్లూటూత్ 5.3, NFC మరియు కనెక్టివిటీ ఆప్షన్ల పరంగా 3.5mm హెడ్‌ఫోన్ పోర్ట్‌ను అందిస్తుంది. ఇది 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది మరియు 30W వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతు తో వస్తుంది.


Click it and Unblock the Notifications