మోటోరోలా కొత్త టాబ్లెట్ మోటో ట్యాబ్ G70 LTE లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసా?

|

లెనోవా యాజమాన్యంలోని మోటోరోలా బ్రాండ్ మోటో ట్యాబ్ G70 LTE ను నేడు భారతదేశంలో ప్రారంభించింది. మోటోరోలా బ్రాండ్ భారతీయ మార్కెట్లో సెప్టెంబరు 2021లో మోటో ట్యాబ్ G20ని ప్రారంభించిన తర్వాత ఇప్పుడు ఈ కొత్త టాబ్లెట్ ను రెండవ సమర్పణగా లాంచ్ చేస్తున్నారు. ఈ మోటో ట్యాబ్ G70 LTE మీడియాటెక్ హీలియో G90T SoC ద్వారా ఆధారితంగా రన్ అవుతూ 4GB RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జత చేయబడి వస్తుంది. ఈ టాబ్లెట్ 11-అంగుళాల 2K LCD డిస్ప్లేతో అమర్చబడడమే కాకుండా 2-టోన్ డిజైన్‌ను మరియు వెనుక వైపు సింగిల్ రియర్ కెమెరాను కలిగి ఉంటుంది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

మోటో ట్యాబ్ G70 LTE ధరలు & లభ్యత వివరాలు

మోటో ట్యాబ్ G70 LTE ధరలు & లభ్యత వివరాలు

మోటోరోలా సంస్థ ఇండియాలో మోటో ట్యాబ్ G70 LTE కొత్త టాబ్లెట్ ను కేవలం ఒకే ఒక వేరియంట్ లో లాంచ్ అయింది. 4GB RAM మరియు 64GB స్టోరేజ్ ఒకే ఒక ఎంపికలో లాంచ్ అయిన ఈ టాబ్లెట్ యొక్క ధర రూ.21,999. Motorola యొక్క కొత్త టాబ్లెట్ ఒకే మోడరన్ టీల్ కలర్‌వేలో విక్రయించబడుతుంది. ఈ Moto Tab G70 జనవరి 22 వరకు జరిగే రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు ICICI బ్యాంక్ కార్డ్‌పై 10 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చు. దీని వలన టాబ్లెట్ రూ. 21,249 ప్రభావవంతమైన ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

Flipkart బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో కెమెరాల కొనుగోలుపై 80% డిస్కౌంట్ ఆఫర్స్...Flipkart బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో కెమెరాల కొనుగోలుపై 80% డిస్కౌంట్ ఆఫర్స్...

మోటో ట్యాబ్ G70 LTE స్పెసిఫికేషన్స్
 

మోటో ట్యాబ్ G70 LTE స్పెసిఫికేషన్స్

మోటో ట్యాబ్ G70 LTE స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ బాక్స్‌లో రన్ అవుతుంది. ఈ టాబ్లెట్ ఆక్టా-కోర్ MediaTek Helio G90T ప్రాసెసర్‌ను కలిగి ఉండి 4GB RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జత చేయబడి వస్తుంది. మెమొరీని మైక్రో SD కార్డ్ ద్వారా మరింత విస్తరించవచ్చు. ఈ మోటో ట్యాబ్ G70 LTE 400 nits గరిష్ట ప్రకాశంతో 11-అంగుళాల IPS 2K (2,000x1,200 పిక్సెల్‌లు) LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. Motorola ప్రకారం ఈ టాబ్లెట్ స్క్రీన్ TUV రైన్‌ల్యాండ్‌ని తగ్గించిన బ్లూ లైట్ ఎక్స్‌పోజర్ మరియు మెరుగైన కంటి సౌలభ్యం కోసం సర్టిఫికేట్ పొందింది.

ఆప్టిక్స్

కొత్త మోటో ట్యాబ్ G70 LTE టాబ్లెట్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే వెనుక భాగంలో 13-మెగాపిక్సెల్ సెన్సార్‌ను f/2.2 అపెర్చర్ లెన్స్‌తో జత చేసిన సింగిల్ రియర్ కెమెరాను కలిగి ఉంది. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం టాబ్లెట్‌లో 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను f/2.2 ఎపర్చరు లెన్స్‌తో అమర్చబడి ఉంటుంది. కనెక్టివిటీ ఎంపికలలో ఈ టాబ్లెట్ GPS మరియు GLONASSతో పాటు 4G LTE, Wi-Fi మరియు బ్లూటూత్ v5.1కి మద్దతు ఇస్తుంది. టాబ్లెట్‌లోని సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, హాల్-ఎఫెక్ట్ సెన్సార్ మరియు యాంబియంట్ లైట్ సెన్సార్ ఉన్నాయి. Moto Tab G70 ట్యాబ్ ఇటీవలే బ్రెజిల్‌లో Wi-Fi కనెక్టివిటీతో ప్రారంభించబడింది.

బ్యాటరీ

మోటో ట్యాబ్ G70 LTE కొత్త టాబ్లెట్ 7,700mAh పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది USB టైప్-C ద్వారా 20W వద్ద టర్బోపవర్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. టాబ్లెట్‌లో డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో క్వాడ్-స్పీకర్ సెటప్ అమర్చబడింది. Motorola ప్రకారం కొత్త టాబ్లెట్ చిన్న పిల్లల కోసం ఉపాధ్యాయులు ఆమోదించిన 10,000 యాప్‌లకు యాక్సెస్‌తో పాటు ప్రత్యేక గూగుల్ కిడ్స్ ని కూడా అందిస్తుంది. కంపెనీ ప్రకారం టాబ్లెట్ 258.4x163x7.5mm కొలతలు, 490 గ్రాముల బరువు మరియు దుమ్ము మరియు నీటి నిరోధకత కోసం IP52 రేటింగ్‌ను కలిగి ఉంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Motorola New Tablet Moto Tab G70 LTE Launched in India With MediaTek Helio G90T SoC: Price, Specs, Sale Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X