Motorola One Fusion+ ఫ్లాష్ సేల్స్ నేడే ప్రారంభం!! సేల్స్ ఆఫర్స్ అదుర్స్..
మోటరోలా వన్ ఫ్యూజన్ + స్మార్ట్‌ఫోన్ యొక్క ఫ్లాష్ సేల్స్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా మొదలుకానున్నది. ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క ధర మీద ఇటీవల రూ.500 పెరుగుదల లభించింది. ప్రస్తుతం భారతదేశంలో మోటరోలా వన్ ఫ్యూజన్ + స్మార్ట్‌ఫోన్ యొక్క ధర రూ.17,499 గా నిర్ణయించబడింది.

మోటరోలా వన్ ఫ్యూజన్ + స్మార్ట్‌ఫోన్ ఫ్లాష్ సేల్స్
క్వాడ్ రియర్ కెమెరా సెటప్, 64 మెగాపిక్సెల్ మెయిన్ షూటర్, 5,000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 730G SOC వంటి మరిన్ని టాప్ ఫీచర్లను కలిగి ఉన్న ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

మోటరోలా వన్ ఫ్యూజన్ + ధర మరియు సేల్స్ ఆఫర్స్
మోటరోలా వన్ ఫ్యూజన్ + స్మార్ట్‌ఫోన్ కేవలం ఒకే ఒక వేరియంట్ లో లబిస్తుంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ లలో లభించే ఈ ఫోన్ యొక్క ధర రూ.17,499. ఇది ట్విలైట్ బ్లూ మరియు మూన్లైట్ వైట్ వంటి రెండు కలర్ ఎంపికలో లభిస్తుంది. ఈ ఫోన్ యొక్క సేల్స్ ఆఫర్ల విషయానికొస్తే ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5 శాతం క్యాష్ బ్యాక్ ను అందిస్తోంది. అలాగే యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డుతో 5 శాతం తగ్గింపు మరియు నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా లభిస్తాయి.

మోటరోలా వన్ ఫ్యూజన్ + స్పెసిఫికేషన్స్
మోటరోలా వన్ ఫ్యూజన్ + స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ సిమ్ స్లాట్ ను కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 ఆధారంగా రన్ అవుతుంది. దీని యొక్క 6.5-అంగుళాల ఫుల్-హెచ్‌డి + డిస్ప్లే 19.5: 9 కారక నిష్పత్తి మరియు 395ppi పిక్సెల్ సాంద్రతతో వస్తుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 730G SoC చేత శక్తిని పొందుతూ అడ్రినో 618 GPU మరియు 6GB RAM తో జత చేయబడి ఉంటుంది. ఈ ఫోన్ లో 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. అలాగే ఇందులో గల హైబ్రిడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 1TB వరకు విస్తరించడానికి అనుమతిని ఇస్తుంది.

మోటరోలా వన్ ఫ్యూజన్ + కెమెరా సెటప్
మోటరోలా వన్ ఫ్యూజన్ + స్మార్ట్‌ఫోన్ యొక్క వెనుక భాగంలో నిలువ వరుసలో క్వాడ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఈ సెటప్‌లో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఎఫ్ / 1.8 ఎపర్చర్‌తో , 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ సెకండరీ కెమెరా ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో, 5 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు అమర్చబడి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో పాప్-అప్ కెమెరా మాడ్యూల్‌లో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ కెమెరా ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో వస్తుంది.

మోటరోలా వన్ ఫ్యూజన్ + కనెక్టివిటీ ఎంపికలు
మోటరోలా వన్ ఫ్యూజన్ + స్మార్ట్‌ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికలలో బ్లూటూత్ V5, వై-ఫై 802.11ac, GPS, 3.5mm ఆడియో జాక్, USB టైప్-C పోర్ట్ మరియు డ్యూయల్ 4G Volte ఉన్నాయి.అలాగే ఈ ఫోన్ యొక్క వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంది. ఇది ప్రత్యేకమైన గూగుల్ అసిస్టెంట్ బటన్‌తో వస్తుంది. ఈ ఫోన్ 162.9x76.9x9.6mm కొలతలతో 210 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.


Click it and Unblock the Notifications








