Home
News

Motorola One Fusion+ Sale: గొప్ప క్యాష్ బ్యాక్ ఆఫర్‌లు!!! త్వరపడండి...

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటో ఇండియా గత నెలలో అద్భుతమైన స్పెసిఫికేషన్స్ లతో సరికొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మోటరోలా వన్ ఫ్యూజన్ + ను ఇండియాలో విడుదల చేసింది. ఈ ఫోన్ యొక్క అమ్మకాలు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం కానున్నాయి.

మోటరోలా వన్ ఫ్యూజన్ + సేల్స్

మోటరోలా వన్ ఫ్యూజన్ + సేల్స్

మోటరోలా వన్ ఫ్యూజన్ + కొత్త స్మార్ట్‌ఫోన్ యొక్క మొదటి అమ్మకం జూన్ 24, 2020 న పరిమిత సంఖ్యలో మొదలయింది. ఇప్పుడు దీని సేల్స్ మళ్ళి మొదలుకానున్నాయి. ఆసక్తిగల కొనుగోలుదారుల కోసం ఇప్పుడు కంపెనీ అద్భుతమైన ఆఫర్లను కూడా అందిస్తున్నది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రత్యేక ఫీచర్స్ , స్పెసిఫికేషన్స్, మరియు ఆఫర్‌ల వంటి పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

మోటరోలా వన్ ఫ్యూజన్ + ధరల వివరాలు

మోటరోలా వన్ ఫ్యూజన్ + ధరల వివరాలు

మోటరోలా వన్ ఫ్యూజన్ + స్మార్ట్‌ఫోన్ ను ఇండియాలో కేవలం ఓకే ఒక వేరియంట్ లలో మాత్రమే విడుదల చేసారు. ఈ ఫోన్ యొక్క 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్‌ యొక్క ధర 16,999 రూపాయలు. ఇది ట్విలైట్ బ్లూ మరియు మూన్లైట్ వైట్ అనే రెండు కలర్ వేరియంట్ లలో లభిస్తుంది.

మోటరోలా వన్ ఫ్యూజన్ + సేల్స్ ఆఫర్స్

మోటరోలా వన్ ఫ్యూజన్ + సేల్స్ ఆఫర్స్

భారత మార్కెట్లో మోటరోలా వన్ లైనప్ లో తాజా మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మోటరోలా వన్ ఫ్యూజన్ కొనుగోలు మీద ఆసక్తి ఉన్న వినియోగదారుల కోసం ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లో అన్ని రకాల బ్యాంక్లు అద్భుతమైన నో-కాస్ట్ EMI ఆఫర్‌లు అందిస్తున్నాయి. అదనంగా వారు ధరను మరింత తగ్గించడానికి ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌కు కూడా ఉపయోగించవచ్చు.

మోటరోలా వన్ ఫ్యూజన్ + స్పెసిఫికేషన్స్

మోటరోలా వన్ ఫ్యూజన్ + స్పెసిఫికేషన్స్

మోటరోలా వన్ ఫ్యూజన్ + స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ సిమ్ స్లాట్ ను కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 ఆధారంగా రన్ అవుతుంది. దీని యొక్క 6.5-అంగుళాల ఫుల్-హెచ్‌డి + డిస్ప్లే 19.5: 9 కారక నిష్పత్తి మరియు 395ppi పిక్సెల్ సాంద్రతతో వస్తుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 730G SoC చేత శక్తిని పొందుతూ అడ్రినో 618 GPU మరియు 6GB RAM తో జత చేయబడి ఉంటుంది. ఈ ఫోన్ లో 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. అలాగే ఇందులో గల హైబ్రిడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 1TB వరకు విస్తరించడానికి అనుమతిని ఇస్తుంది.

మోటరోలా వన్ ఫ్యూజన్ + ఫీచర్స్

మోటరోలా వన్ ఫ్యూజన్ + ఫీచర్స్

మోటరోలా వన్ ఫ్యూజన్ + స్మార్ట్‌ఫోన్ యొక్క వెనుక భాగంలో నిలువ వరుసలో క్వాడ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఈ సెటప్‌లో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఎఫ్ / 1.8 ఎపర్చర్‌తో , 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ సెకండరీ కెమెరా ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో, 5 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు అమర్చబడి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో పాప్-అప్ కెమెరా మాడ్యూల్‌లో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ కెమెరా ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో వస్తుంది.

మోటరోలా వన్ ఫ్యూజన్ + కనెక్టివిటీ ఎంపికలు

మోటరోలా వన్ ఫ్యూజన్ + కనెక్టివిటీ ఎంపికలు

మోటరోలా వన్ ఫ్యూజన్ + స్మార్ట్‌ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికలలో బ్లూటూత్ V5, వై-ఫై 802.11ac, GPS, 3.5mm ఆడియో జాక్, USB టైప్-C పోర్ట్ మరియు డ్యూయల్ 4G Volte ఉన్నాయి.అలాగే ఈ ఫోన్ యొక్క వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంది. ఇది ప్రత్యేకమైన గూగుల్ అసిస్టెంట్ బటన్‌తో వస్తుంది. ఈ ఫోన్ 162.9x76.9x9.6mm కొలతలతో 210 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Motorola One Fusion+ Smartphone Sale Starts Today at 12PM via Flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X