Motorola One Fusion+ Sale అద్బుతమైన క్యాష్ బ్యాక్ ఆఫర్‌లు!!!

|

లెనోవా యాజమాన్యంలోని స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటరోలా యొక్క సరికొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మోటరోలా వన్ ఫ్యూజన్ + ను గత నెలలో ఇండియాలో లాంచ్ చేసారు. ఇప్పుడు దీని యొక్క అమ్మకాలు మధ్యాహ్నం 12PM గంటల నుండి ఫ్లిప్ కార్ట్ లో మొదలుకానున్నాయి. వన్ ఫ్యూజన్ + స్మార్ట్‌ఫోన్‌ మీద సంస్థ ఇటీవల ధరను పెంచింది.

మోటరోలా వన్ ఫ్యూజన్ + “మేడ్ ఇన్ ఇండియా”

మోటరోలా వన్ ఫ్యూజన్ + “మేడ్ ఇన్ ఇండియా”

మోటరోలా సంస్థ ఈ స్మార్ట్‌ఫోన్ ను గత వారం యూరప్‌లో తొలిసారిగా విడుదల చేశారు. మోటరోలా వన్ ఫ్యూజన్ + "మేడ్ ఇన్ ఇండియా" స్మార్ట్‌ఫోన్ అనే పేరుతో భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. గ్లోబల్ మోడల్‌లో కనిపించే చిప్‌సెట్‌కు ఇండియాలో లభించే మోడల్ యొక్క చిప్‌సెట్‌లో మార్పులను బట్టి ఈ మార్పులోని తేడాను స్పష్టంగా కనుగొనవచ్చు.

 

Also Read: 16GB RAM తో లెనోవో కొత్త ఫోన్ ,ఈ నెల 22 న లాంచ్.Also Read: 16GB RAM తో లెనోవో కొత్త ఫోన్ ,ఈ నెల 22 న లాంచ్.

మోటరోలా వన్ ఫ్యూజన్ + ధరల వివరాలు

మోటరోలా వన్ ఫ్యూజన్ + ధరల వివరాలు

ఇండియాలో మోటరోలా వన్ ఫ్యూజన్ + స్మార్ట్‌ఫోన్ గత నెలలో 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్‌ రూ.16,999 ధర వద్ద లాంచ్ అయింది. అయితే గత వారం ఈ స్మార్ట్‌ఫోన్‌ యొక్క ధర మీద సంస్థ రూ.500లను పెంచింది. ఇప్పుడు ఈ ఫోన్ యొక్క ధర రూ.17,499. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో మూన్‌లైట్ వైట్ మరియు ట్విలైట్ బ్లూ కలర్ లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

 

Also Read: Oppo Find X2 Pro యొక్క కొత్త ఎడిషన్ ఫీచర్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో చూడండి...Also Read: Oppo Find X2 Pro యొక్క కొత్త ఎడిషన్ ఫీచర్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో చూడండి...

మోటరోలా వన్ ఫ్యూజన్ + సేల్స్ ఆఫర్స్

మోటరోలా వన్ ఫ్యూజన్ + సేల్స్ ఆఫర్స్

భారత మార్కెట్లో మోటరోలా వన్ లైనప్ లో తాజా మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మోటరోలా వన్ ఫ్యూజన్+ను కొనుగోలు మీద ఆసక్తి ఉన్న వినియోగదారుల కోసం ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లో అన్ని రకాల బ్యాంక్లు అద్భుతమైన నో-కాస్ట్ EMI ఆఫర్‌లు అందిస్తున్నాయి. అదనంగా వారు ధరను మరింత తగ్గించడానికి ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌కు కూడా ఉపయోగించవచ్చు.

 

Also Read: వాట్సాప్ బిజినెస్ లో కొత్త ఫీచర్స్!!! మీరు ట్రై చేసారా??Also Read: వాట్సాప్ బిజినెస్ లో కొత్త ఫీచర్స్!!! మీరు ట్రై చేసారా??

మోటరోలా వన్ ఫ్యూజన్ + స్పెసిఫికేషన్స్

మోటరోలా వన్ ఫ్యూజన్ + స్పెసిఫికేషన్స్

మోటరోలా వన్ ఫ్యూజన్ + స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ సిమ్ స్లాట్ ను కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 ఆధారంగా రన్ అవుతుంది. దీని యొక్క 6.5-అంగుళాల ఫుల్-హెచ్‌డి + డిస్ప్లే 19.5: 9 కారక నిష్పత్తి మరియు 395ppi పిక్సెల్ సాంద్రతతో వస్తుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 730G SoC చేత శక్తిని పొందుతూ అడ్రినో 618 GPU మరియు 6GB RAM తో జత చేయబడి ఉంటుంది. ఈ ఫోన్ లో 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. అలాగే ఇందులో గల హైబ్రిడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 1TB వరకు విస్తరించడానికి అనుమతిని ఇస్తుంది.

మోటరోలా వన్ ఫ్యూజన్ + ఫీచర్స్

మోటరోలా వన్ ఫ్యూజన్ + ఫీచర్స్

మోటరోలా వన్ ఫ్యూజన్ + స్మార్ట్‌ఫోన్ యొక్క వెనుక భాగంలో నిలువ వరుసలో క్వాడ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఈ సెటప్‌లో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఎఫ్ / 1.8 ఎపర్చర్‌తో , 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ సెకండరీ కెమెరా ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో, 5 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు అమర్చబడి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో పాప్-అప్ కెమెరా మాడ్యూల్‌లో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ కెమెరా ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో వస్తుంది.

మోటరోలా వన్ ఫ్యూజన్ + కనెక్టివిటీ ఎంపికలు

మోటరోలా వన్ ఫ్యూజన్ + కనెక్టివిటీ ఎంపికలు

మోటరోలా వన్ ఫ్యూజన్ + స్మార్ట్‌ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికలలో బ్లూటూత్ V5, వై-ఫై 802.11ac, GPS, 3.5mm ఆడియో జాక్, USB టైప్-C పోర్ట్ మరియు డ్యూయల్ 4G Volte ఉన్నాయి.అలాగే ఈ ఫోన్ యొక్క వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంది. ఇది ప్రత్యేకమైన గూగుల్ అసిస్టెంట్ బటన్‌తో వస్తుంది. ఈ ఫోన్ 162.9x76.9x9.6mm కొలతలతో 210 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Best Mobiles in India

English summary
Motorola One Fusion+ Smartphone Sale Starts Today at 12PM via Flipkart

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X