గొప్ప ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ లో మొదలైన మోటరోలా వన్ విజన్ అమ్మకాలు

|

మోటరోలా వన్ విజన్ మొబైల్ అమ్మకాలు ఈ రోజు ఇండియాలో మొదలవుతున్నాయి. కొత్తగా రిలీజ్ అయిన మోటరోలా ఫోన్ ఈ రోజు మధ్యాహ్నం 12గంటల IST నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా లభిస్తుంది. మోటరోలా వన్ విజన్ గత వారం భారతదేశంలో ప్రారంభించబడింది. ఇది హోల్-పంచ్ సెల్ఫీ కెమెరా సెన్సార్ తో, 21: 9కారక నిష్పత్తి గల డిస్ప్లే మరియు శామ్సంగ్ Exynos 9609 SoC వంటి లక్షణాలతో వస్తుంది.

గొప్ప ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ లో మొదలైన మోటరోలా వన్ విజన్ అమ్మకాలు

 

ఈ ఫోన్‌లో వెనుక వైపు 25-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ సెన్సార్ మద్దతుతో రెండు కెమెరాలు ఉంటాయి మరియు ఇది15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 3,500 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంటుంది.

ఇండియాలో మోటరోలా వన్ విజన్ ధర మరియు అమ్మకపు సమయం:

ఇండియాలో మోటరోలా వన్ విజన్ ధర మరియు అమ్మకపు సమయం:

మోటరోలా వన్ విజన్ మొబైల్ 4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ గల ఒకే ఒక వేరియంట్‌తో వస్తుంది.దీని యొక్క ధర19,999రూపాయలుగా ఉంది.ఈ స్మార్ట్‌ఫోన్ దేశంలోని ఈ రోజు అంటే 27జూన్2019న ఫ్లిప్‌కార్ట్ ద్వారా మధ్యాహ్నం 12 గంటలకు IST కి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. లెనోవా యాజమాన్యంలోని మోటరోలా వన్ విజన్ మొబైల్ కాంస్య మరియు నీలమణి వంటి రెండు రంగుల ఎంపికలలో విడుదల చేయనుంది. అయితే నీలమణి కలర్ మాత్రమే ఈ రోజు అందుబాటులో ఉంది. రాబోయే వారాల్లో కాంస్య కలర్ కూడా అందుబాటులోకి రానున్నది.

 ఆఫర్స్:

ఆఫర్స్:

ఆఫర్స్ విషయానికొస్తే మోటరోలా వన్ విజన్ మొబైల్ కొనుగోలుదారులు మొదటి వారంలో (జూన్ 27 నుండి జూలై 4 వరకు) అన్ని క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల మీద 6 నెలల పాటు నో-కాస్ట్ EMI లను పొందుతారు. అదనంగా వొడాఫోన్ ఐడియా చందాదారులు రూ.3,750 విలువైన క్యాష్‌బ్యాక్ కూపన్స్ రూపంలో పొందుతారు మరియు 250 జిబి వరకు అదనపు డేటాను కూడా పొందుతారు.

స్పెసిఫికేషన్స్:
 

స్పెసిఫికేషన్స్:

మోటరోలా వన్ విజన్ ఆండ్రాయిడ్ 9 పై తో రన్ అవుతుంది మరియు ఇది 6.3-అంగుళాల ఫుల్-హెచ్‌డి + (1080x2520 పిక్సెల్స్) డిస్ప్లేతో వస్తుంది. కొత్త మోటరోలా ఫోన్ ఆక్టా-కోర్ శామ్‌సంగ్ ఎక్సినోస్ 9609 SoC తో పనిచేస్తుంది.డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ మరియు 4GB RAM తో ఇది జతచేయబడి ఉంటుంది.

కెమెరా సామర్థ్యాల దృష్ట్యా మోటరోలా వన్ విజన్ మొబైల్ వెనుక వైపు 48 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్ మరియు 5 మెగాపిక్సెల్ సెకండరీ షూటర్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీల కోసం మొబైల్ ముందు భాగంలో 25 మెగాపిక్సెల్ కెమెరాను ప్యాక్ చేయబడి ఉంటుంది.

కనెక్టివిటిలు:

కనెక్టివిటిలు:

అదనంగా మోటరోలా వన్ విజన్ 15W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 3,500 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది.ఇది 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది మరియు మైక్రో ఎస్‌డి కార్డ్ స్లాట్‌తో మెమొరీని 512 జిబి వరకు విస్తరించవచ్చు.ఫేస్ అన్‌లాక్ సపోర్ట్,FM రేడియో, 4G LTE, వై-ఫై 802.11ac, బ్లూటూత్ 5.0, GPS, వెనుక వైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు డాల్బీ ఆడియో వంటి స్పెసిఫికేషన్స్ తో ఈ మొబైల్ లభిస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
motorola one vision sale price in india rs 19999 12 noon june 27

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X