Home
News

Motorola స్మార్ట్‌ఫోన్లపై రూ.10 వేల తగ్గింపు.. ఆఫర్ ఎప్పటి వరకు ఉందంటే?

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ మోటోరోలా కీలక నిర్ణయం తీసుకుంది. మోటోరోల Razr 40 అల్ట్రా మరియు Razr 40 (Motorola Razr 40 and Razr 40 Ultra) స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లపై రూ.10 వేల ధరను తగ్గించింది.

ఈ ఆఫర్ డిసెంబర్‌ 15 నుంచి అందుబాటులోకి వచ్చింది. రేజర్‌ 40 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 8+ జెన్‌ 1 SoC చిప్‌ను కలిగి ఉంటుంది. అదే రేజర్‌ 40 స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 1 SoC ఆధారంగా పనిచేస్తుంది.

Motorola slashed RS 10000 price on few model

మోటోరోలా రేజర్‌ 40 అల్ట్రా, రేజర్‌ 40 స్మార్ట్‌ఫోన్ల కొత్త ధరలు : మోటోరోలా రేజర్‌ 40 మోడల్‌ స్మార్ట్‌ఫోన్లపై రూ.10000 తగ్గింపును ప్రకటించింది. కొత్త ధరలు డిసెంబర్ 15 నుంచి అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం రేజర్‌ 40 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌, 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.79,999గా ఉంది.

అదే రేజర్ 40 స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌, 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర ప్రస్తుతం రూ.49,999 గా ఉంది. మోటోరోల రేజర్‌ 40 అల్ట్రా మోడల్‌ ఇన్ఫినిట్‌ బ్లాక్‌, వివా మెజెంటా రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. అదే రేజర్‌ 40 హ్యాండ్‌సెట్ సేజ్‌ గ్రీన్‌, సమ్మర్‌ లిలక్, వెనిలా క్రీమ్‌ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.

దీంతోపాటు మోటో డేస్‌ పేరుతో మోటోరోల ప్రత్యేక సేల్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రేజర్‌ 40 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌పైన రూ.7,000 మరియు రేజర్‌ 40 స్మార్ట్‌ఫోన్‌ పైన రూ.5000 డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌ డిసెంబర్‌ 24 వరకు ఉంది. దీంతోపాటు నో కాస్ట్‌ ఈఎంఐ ఆఫర్‌ కూడా ఉందని తెలిపింది.

మోటోరోలా రేజర్‌ 40 అల్ట్రా, రేజర్‌ 40 స్పెసిఫికేషన్లు : ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత MyUX పైన పనిచేస్తుంది. అల్ట్రా మోడల్‌ 165Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.9 అంగుళాల పుల్‌ HD+ ఫోల్డబుల్‌ pOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

మరియు 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 3.6 అంగుళాల pOLED అవుటర్‌ ప్యానల్‌ను కలిగి ఉంటుంది. అదే రేజర్ 40 మోడల్‌ 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.9 అంగుళాల పుల్‌ HD+ pOLED ప్రధాన డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1.5 అంగుళాల OLED అవుటర్‌ స్క్రీన్‌ కలిగి ఉంది.

దీంతోపాటు అల్ట్రా మోడల్‌ స్నాప్‌డ్రాగన్‌ 8+ జెన్‌ 1 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. అదే రేజర్‌ 40 మోడల్‌ స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 1 SoC చిప్‌తో వస్తుంది. ఈ రెండు మోడళ్లు డ్యూయల్‌ రియర్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. అల్ట్రా మోడల్‌ OIS అప్టికల్‌ అమేజ్ స్టేబిలైజేషన్‌తో 12MP ప్రధాన కెమెరా, 13MP అల్ట్రావైడ్‌ కెమెరాను కలిగి ఉంటుంది.

అదే మోటోరోలా రేజర్‌ 40 మోడల్‌ 64MP ప్రైమరీ కెమెరా మరియు 13MP అల్ట్రావైడ్‌ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. మెరుగైన ఫోటోగ్రఫీ అనుభూతిని అందిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Motorola Razr 40 series smartphones price slashed by RS 10000
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X