Motorola Razr 40 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ కొత్త వేరియంట్ విడుదల.. రూ.10 వేల తగ్గింపు!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ మోటోరోలా సంస్థ ఈ సంవత్సరం జులైలో Motorola Razr 40 Ultra స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 8+ జెన్ 1 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 30W వైరడ్ ఛార్జర్, 5W వైర్‌లెస్ ఛార్జర్ సపోర్టుతో 3800mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ విడుదల సమయంలో ఒక స్టోరేజీ వేరియంట్, రెండు రంగుల వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.
రూ.10 వేలు తగ్గింపు: తాజాగా మోటోరోలా ఫోన్ గ్లాసియర్ బ్లూ వేరియంట్‌ను విడుదల చేసింది. విడుదల మయంలో 8GB ర్యామ్, 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌తో అందుబాటులోకి వచ్చింది. లాంచింగ్ సమయంలో ఫోన్ ధర రూ.89,999గా ఉంది. ఇన్‌ఫినెట్ బ్లాక్, వివా మెజెంటా రంగుల్లో అందుబాటులో ఉంది. తాజాగా గ్లేసియర్ బ్లూ రంగులోనూ అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం అమెజాన్‌లో ఈ ఫోన్ ధర రూ.79,999గా ఉంది.

మోటోరోలా రేజర్ 40 అల్ట్రా కొత్త వేరియంట్ : మోటోరోలా Razr 40 అల్ట్రా ఈ స్మార్ట్‌ఫోన్ 6.9 అంగుళాల పుల్ HD+ pOLED లోపలి డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 165Hz రీఫ్రెష్ రేట్‌తోపాటు 1200 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు 3.6 అంగుళాల pOLED బాహ్య డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1056*1066 పిక్సల్ మరియు 144Hz రీఫ్రెష్ రేట్‌తో రానుంది.
కార్నింగ్ గొరెల్లా గ్లాస్‌తో భద్రత : మోటోరోలో రేజర్ 40 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ కవర్ డిస్‌ప్లే కార్నింగ్ గొరెల్లా గ్లాస్‌తో భద్రతతో రానుంది. 4nm క్కాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 SoC ప్రాసెసర్‌తో అడెన్నో 730 GPU, 8GB LPDDR5 ర్యామ్ మరియు 256GB అంతర్గత స్టోరేజీతో జతచేయబడుతుంది. ఈ మోటోరోలా స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ది బాక్స్‌గా రానుంది.
మోటోరోలో రేజర్ 40 అల్ట్రా ఫోన్ కెమెరా, బ్యాటరీ వివరాలు: ఈ స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 12MP ప్రైమరీ కెమెరా సహా 13MP అల్ట్రా వైడ్ లెన్స్‌ను కలిగి ఉంటుంది. లోపలి డిస్‌ప్లేలో 32MP కెమెరాను అమర్చారు. ఈ స్మార్ట్‌ఫోన్ 30W వైరడ్, 5W వైర్‌లెస్ సపోర్టుతో 3800 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
7 వేల డిస్కౌంట్ : ఈ ఫోన్ డస్ట్, స్ప్లేష్ రెసిస్టెన్స్ IP52 రేటింగ్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్ బరువు 189 గ్రాములు ఉంటుంది. భద్రత కోసం ఈ స్మార్ట్‌ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ను కలిగి ఉంటుంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసిన వారికి 7 వేల వరకు డిస్కౌంట్ ఉంటుందని తెలిపింది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications