Home
News

Motorola Razr 50 Ultra డిజైన్,స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి! లాంచ్ వివరాలు 

మోటోరోలా నుంచి తర్వాతి తరం క్లామ్‌షెల్ స్మార్ట్‌ఫోన్‌లను చైనా మరియు భారతదేశంతో సహా ప్రపంచ మార్కెట్‌లలో త్వరలో విడుదల చేయనుంది. రాబోయే ఈ Motorola Razr 50 ని గీక్ బెంచ్ డేటాబేస్‌లో లిస్ట్ అయింది. ఈ కొత్త మోటోరోలా ఫోన్ చైనా యొక్క 3C ధృవీకరణను కూడా పొందింది. ఇది జాబితా మోడల్ నంబర్ XT2451-4 తో కనిపిస్తుంది. ఈ మోడల్ ఫోన్ Motorola Razr 50 Ultra కావచ్చునని సూచిస్తుంది. ఇదే తరహా మోడల్ నంబర్ (XT-2453-2)తో Motorola Razr 50 ఇటీవల అదే ప్లాట్‌ఫారమ్‌లో కనిపించింది.

Motorola Razr 50 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు మోటోరోలా రేజర్ 40 కి కొనసాగింపుగా భారతదేశంలో కూడా లాంచ్ చేయబడుతుంది లీక్ లు తెలియచేస్తున్నాయి.

Motorola Razr 50 Ultra Gets 3C Certificate

Motorola Razr 50 అల్ట్రా ఛార్జింగ్ వేగం స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి.
లీక్ అయిన నివేదిక ప్రకారం, గుర్తించబడిన ఈ మోటోరోలా రేజర్ 50 అల్ట్రా 3C సర్టిఫికేషన్, ఫోన్ 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుందని చూపిస్తుంది. ఇది పోల్చి చూస్తే, మోటోరోలా రేజర్ 40 అల్ట్రా ఫీచర్లు 33W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 5W వైర్‌లెస్ ఛార్జింగ్ కంటే ఎక్కువ. అంటే,దీని అర్థం ఛార్జింగ్ వేగం పరంగా ఈ కొత్త ఫోన్ చాలా అప్‌గ్రేడ్ అయ్యే అవకాశం ఉంది.

ఇక, ఇందులో టెస్ట్ కోసం ఉపయోగించే ఛార్జర్ మోడల్ నంబర్ MS-688Nని కలిగి ఉంది మరియు 15W (5V/3A), 27W (9V/3A), 45W (15V/3A), 68W (20V/3.4A మరియు 11V/6.2A) ఛార్జింగ్ వేగాన్ని సపోర్ట్ చేస్తుంది. ఇది కాకుండా, 3C సర్టిఫికేషన్ 5G నెట్‌వర్క్ మద్దతు ఉంటుందని చూపిస్తుంది.

Motorola Razr 50 Ultra అంచనా స్పెసిఫికేషన్లు
ఇటీవలే లీక్ అయిన మోటోరోలా రేజర్ 50 అల్ట్రా రెండర్‌లు మునుపటి మోడల్ మాదిరిగానే పెద్ద కవర్ స్క్రీన్‌ను కలిగి ఉన్నాయని చూపిస్తుంది. ఇది 3.6-అంగుళాల OLED ప్యానెల్ అయితే ప్రధాన స్క్రీన్ 6.9-అంగుళాల OLED ప్యానెల్ ఉంటుంది. ఈ ఫోన్ యొక్క అల్ట్రా వేరియంట్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8s జెన్ 3 SoC ద్వారా శక్తిని పొందుతుందని భావిస్తున్నారు.

ఈ ఫోల్డబుల్ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా మరియు 2x జూమ్‌తో 50MP సెకండరీ టెలిఫోటో సెన్సార్‌ని పొందవచ్చు. బ్యాటరీ 3,800mAh నుండి 4,000mAh యూనిట్‌కు అప్‌గ్రేడ్ చేయబడిందని చెప్పబడింది. పీచ్ ఫజ్, గ్రీన్ మరియు బ్లూ కలర్ ఆప్షన్‌లలో రావచ్చని లీక్‌లు వెల్లడించాయి.

మోటోరోలా రేజర్ 50 అల్ట్రా ఫోన్ భారతదేశంలో లాంచ్ చేయబడుతుంది. మేము అంత ఖచ్చితంగా చెప్పగలగడానికి రెండు ఆధారాలు ఉన్నాయి. ఒకటి, ఈ ఫోన్ ఇప్పటికే BIS ధృవీకరణను పొందింది. ఇంకా, మోటరోలా రేజర్ 40 అల్ట్రా ఇప్పటికే దేశంలో సేల్ చేయబడుతోంది.అంటే, త్వరలో మోటోరోలా రేజర్ 50 అల్ట్రా ఇండియాలో కూడా లాంచ్ కాబోతోంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Motorola Razr 50 Ultra Gets 3C Certificate And Appears On TENAA Listings. Design,Specifications Leaked.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X