మోటోరోలా కొత్త ఫోల్డబుల్ ఫోన్ డిజైన్ మరియు మోడల్ లు లీక్! వివరాలు
మోటోరోలా సంస్థ నుంచి గత సంవత్సరం లాంచ్ అయిన మోటోరోలా మోటో రేజర్ 2022 కి కొనసాగింపుగా క్లామ్‌షెల్ ఫోల్డబుల్ డిజైన్ తో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు రిపోర్టులు వెలువడ్డాయి. ఈ ఫోన్ యొక్క మోనికర్ మరియు కోడ్‌నేమ్ లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.ఇప్పుడు ఆ వివరాలు ఇక్కడ చూద్దాం.
మోటోరోలా నుంచి ఊహించబడిన ఈ ఫోల్డబుల్ పరికరం కొత్త మోటోరోలా రేజర్ ప్లస్ మోనికర్ మరియు XT2321 మోడల్ పేరుతో వస్తుందని భావిస్తున్నారు. మోటోరోలా రేజర్ ప్లస్ 2.7 అంగుళాల కవర్ డిస్‌ప్లేను కలిగి ఫోల్డబుల్ డిజైన్ ను కలిగి ఉంది. మరియు 2,850 mAh బ్యాటరీతో వస్తుందని పుకారు ఉంది. దీని ముందు వెర్షన్, స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoC ప్రాసెసర్ తో వచ్చే మోటో రేజర్ 2022 గత ఏడాది ఆగస్టులో చైనాలో లాంచ్ చేయబడింది.

మై స్మార్ట్ ప్రైస్ నివేదిక ప్రకారం, మోటోరోలా రేజర్ బ్రాండ్ పేరుకు బదులుగా రేజర్ ప్లస్ మోనికర్‌తో ఈ కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తుంది. ఈ నివేదిక మోటోరోలా రేజర్ ప్లస్ యొక్క మోడల్ నంబర్ XT2321ని కూడా సూచిస్తుంది. ఇటీవల, మోటోరోలా రేజర్ ప్లస్ యొక్క ప్రత్యక్ష చిత్రం వెబ్‌లో లీక్ చేయబడింది.
ఈ ఫోటో లో చూపిన దాని ప్రకారం, ఈ పరికరం కోసం డ్యూయల్ కలర్ వెనుక ప్యానెల్ మరియు డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ని సూచించింది. ఇది 2.7-అంగుళాల బాహ్య డిస్ప్లేతో వస్తుందని పుకారు ఉంది మరియు 30W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 2,850 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
ఫిబ్రవరిలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2023 సందర్భంగా, లెనోవో CEO యువాన్‌కింగ్ యాంగ్ రేజర్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల తదుపరి ఎడిషన్ రాకను టీజర్ విడుదల చేసారు. మరియు ఇది "అతి త్వరలో" లాంచ్ చేయబడుతుందని కూడా ధృవీకరించారు. అంచనాల ప్రకారం ఈ ఫోన్ జూన్‌లో అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది మోటోరోలా ద్వారా ఇంకా ధృవీకరించబడలేదు కాబట్టి, సమాచారాన్ని అంచనాగా మాత్రమే తీసుకోవాలి.
మోటోరోలా రేజర్ ప్లస్ గత సంవత్సరం ఆగస్టులో చైనాలో లాంచ్ చేయబడిన మోటోరోలా రేజర్ 2022 కంటే మెరుగైన అప్‌గ్రేడ్‌లతో వచ్చే అవకాశం ఉంది. ఇది బేస్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ కోసం ధర CNY 5,999 (దాదాపు రూ. 70,750) ప్రారంభ ధర ట్యాగ్‌తో వస్తుందని అంచనాలున్నాయి.
మోటోరోలా రేజర్ 2022లో 6.7-అంగుళాల ఫోల్డబుల్ OLED మెయిన్ డిస్‌ప్లే మరియు 2.7-అంగుళాల OLED ఔటర్ కవర్ డిస్‌ప్లే తో లాంచ్ అయింది. ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 SoC ద్వారా పనిచేస్తుంది. ఈ ఫోన్ లో గరిష్టంగా 12GB వరకు RAM ఉంటుంది. మరియు ఈ హ్యాండ్‌సెట్ 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ మరియు 13 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 3,500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications








