మోటోరోలా మోటో z 2016 మోడల్ కి ఆండ్రాయిడ్ 8.0 వర్షన్ అప్డేట్

Posted By: ChaitanyaKumar ARK

మోటోరోలా ఎల్లప్పుడూ తన వినియోగదారులకు స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికే మొగ్గు చూపుతుంది. స్టాక్ ఆండ్రాయిడ్ ను వినియోగదారులకు తగ్గట్లు మార్పులు చేసినా కూడా స్టాక్ ఎక్స్పీరియన్స్ ఉండేలా చూసుకోవడంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటుంది. అందువల్లనే ఎక్కువమంది మోటోరోలా ఫోన్స్ వైపే మొగ్గు చూపుతూ ఉంటారు . మోటోరోలా తదుపరి ఆండ్రాయిడ్ వర్షన్స్ రిలీజ్ అయిన పక్షంలో అనేక పరీక్షలు చేసిన తర్వాతే వినియోగదారులకు అందుబాటులోకి తెస్తుంది. అలాగే మోటో z 2016 మోడల్ కు కూడా ఆండ్రాయిడ్ ఓరియో స్టాక్ వర్షన్ ను విడుదల చేసింది. ఇక్కడ మా పాఠకులకోసం కెర్నల్ గురించిన వివరాలను అందిస్తున్నాం. కెర్నల్, ఆపరేటింగ్ సిస్టమ్ కు గుండె (heart of OS)వంటిది. ఈ కెర్నల్, వినియోగదారునికి డివైజ్ హార్డ్వేర్ విభాగానికి మద్య అనుసంధానకర్తగా ఉంటుంది . మరియు డెవెలపర్ నియంత్రించే విధంగా ఈ కెర్నల్ రూపు దిద్దబడి ఉంటుంది. తద్వారా ఏదైనా సెక్యూరిటీ పాచెస్ వచ్చినప్పుడు, కొత్త OS అప్డేట్ చేయవలసి వచ్చినప్పుడు , డెవలపర్ ఈ మాద్యమాన్ని వినియోగించుకుని OS లో మార్పులూ చేర్పులూ చేసి కొత్త వర్షన్ కు అప్డేట్ చేయగలుగుతాడు. ఇందులో భద్రతా పరమైన చర్యలు అనేకం తీసుకోబడి ఉంటాయి , తద్వారా వినియోగదారుని వివరాలకు సంబంధించిన ప్రమాదమేమీ ఉండదు.

JioJuiceతో దుమ్మురేపిన ముకేష్ అంబానీ, యూజర్లకు పండగే, పూర్తి వివరాలు ఇవే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మోటో z 2016

ఇక మోటో z 2016 విషయానికి వస్తే , ఇది అక్టోబర్ 2016 నందు ఆoడ్రాయిడ్ మార్ష్మల్లో 6.0.1 వర్షన్ తో ప్రతిష్టాత్మకంగా విడుదల చేయబడినది. ఇప్పుడు ఈ మొబైల్ కి ఆండ్రోయిడ్ ఓరియో 8.0 వర్షన్ అప్డేట్ ను విడుదల చేశారు.

ఇక ఈ మొబైల్ లో పొందపరచబడిన ఫీచర్ల విషయానికి వస్తే:

Motorola Moto Z 5.5-inch కెపాసిటీవ్ టచ్ స్క్రీన్ తో , 1440 x 2560 pixels AMOLED రిసొల్యూషన్ తో వినియోగదారుని ఆలోచనలకు తగినట్లుగా రూపుదిద్దుకుని ఉంటుంది. ఇందులో Quad Core 1.8 GHz, Qualcomm MSM Snapdragon 820 ప్రాసెసర్ ,Adreno 530GPU ను పొందుపరచారు. 4 GB RAM , 64 GB అంతర్గత మెమరీ microSD card స్లాట్ ద్వారా 2 TB సామర్ధ్యం పెంచుకోగలిగిన విధంగా తీర్చిదిద్దారు.

ఫీచర్లు

Motorola Moto Z , 13 MP కెమరా తో జియో టాగింగ్ సర్వీసుతో మరియు ఫ్రంట్ కెమరా 5 మెగా పిక్సెల్స్ గా ఉంటుంది . మరియు 2600 mah non removable బాటరీ తో వస్తుంది. హార్డ్వేర్ బేస్ చేసుకుని కనీసం ఒక రోజు బాటరీ బాకప్ ఇవ్వగలదు.

ఓరియో 8.0 తో

ఓరియో 8.0 తో కెర్నల్ సోర్స్ అప్డేట్ చేయబడిన మోటో z 2016 ను వినియోగించాక, కొత్తగా చేయబడిన మార్పులు చేర్పుల గురించిన పూర్తివివరములను మీకు తెలియజేస్తాము.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Motorola rolls out Android 8.0 Oreo kernal source for Moto Z 2016 model More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot