నవంబర్ 13న ‘మోటో ఎక్స్ 4’ విడుదల
బెర్లిన్ వేదికగా సెప్టంబర్‌లో నిర్వహించిన IFA 2017 టెక్నాలజీ ట్రేడ్ షోలో భాగంగా, మోటరోలా తన Moto X4 స్మార్ట్‌ఫోన్‌ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఫోన్‌కు సంబంధించిన ఆండ్రాయిడ్ వన్ వేరియంట్‌ను కూడా మోటరోలా ఆ తరువాత అనౌన్స్ చేయటం జరిగింది.

తాజాగా, ఈ ఫోన్‌కు సంబంధించిన ఇండియా రిలీజ్ డేట్ అఫీషియల్‌గా ఫిక్స్ అయ్యింది. నవంబర్ 13ను ఈ ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేయబోతున్నట్లు మోటరోలా ఇండియా ప్రకటించింది.
కొద్ది రోజుల క్రితమే ఈ ఫోన్‌కు సంబంధించిన రిటైల్ బాక్స్ ఫోటో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. ఈ రిటైల్ బాక్స్ పై సూచించిన వివరాల ప్రకారం ఇండియన్ మార్కెట్లో 'మోటో ఎక్స్ 4’ 4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ వర్షన్ ధర రూ.23,999గా ఉండబోతోంది. సూపర్ బ్లాక్ ఇంకా స్టెర్లింగ్ బ్లు కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.
మోటో ఎక్స్4 స్మార్ట్‌ఫోన్‌కు మెటల్ అండ్ గ్లాస్ డిజైన్‌తో పాటు డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ ప్రధాన హైలైట్స్‌గా నిలుస్తాయి. IP68 రేటింగ్‌తో వస్తోన్న ఈ డివైస్ నీరు ఇంకా దుుమ్ము నుంచి తలెత్తే ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతుంది. గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా వంటి అత్యాధునిక వాయిస్ అసిస్టెంట్ ఫీచర్లను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.
Moto X4 స్పెసిఫికేషన్స్..
5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ 1080 పిక్సల్ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 630 సాక్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), 12 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000mAh బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్.


Click it and Unblock the Notifications