4,000 ఉద్యోగాలు కట్!

Posted By: Super

4,000 ఉద్యోగాలు కట్!

న్యూయార్క్: తీవ్ర ఆర్ధిక సంక్షోభంతో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘మోటరోలా మొబిలిటీ’, భారత్‌లో తన కార్యకలాపాలను తగ్గించుకోవటంతో పాటు పునర్‌వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 4,000 మంది సిబ్బందిని తొలగించనుంది. ఈ సమాచారన్ని మోటరోలా కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ డెన్నిస్ ఉడ్‌సైడ్‌ను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది.

ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కొంటున్న మోటరోలా మొబిలిటీని గతేడాది ఆరంభంలో సెర్చింజిన్ దిగ్గజం గూగుల్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. గూగుల్ తన మొబైల్ ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్ ఆండ్రాయిడ్‌ను మరింత విస్తృతం చేయడం కోసం మోటరోలాను చేజిక్కించుకుంది.

తాజా పరిణామాల దృష్ట్యా ఆసియా, భారత్‌తో పాటు షికాగోలోని ప్రధాన పరిశోధన, అభివృద్ధి(ఆర్‌అండ్‌డీ) కేంద్రంలోనూ కార్యకలాపాలను తగ్గించుకోనున్నట్లు ఉడ్‌సైడ్ టైమ్స్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డెన్నిస్ ఉడ్‌సైడ్‌ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 94 కార్యాలయాల్లో 1/3వ వంతు ఆఫీసులను మూసేయనున్నామని, మొత్తం సిబ్బందిలో దాదాపు 20% మందికి ఉద్వాసన పలకనున్నట్లు వెల్లడించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot