తైవాన్‌లో కొత్త ఆఫీసు, ఇక దంచుడే దంచుడు

Posted By: Staff

తైవాన్‌లో కొత్త ఆఫీసు, ఇక దంచుడే దంచుడు

ఓపెన్ సోర్స్ సాప్ట్‌వేర్ డవలప్‌మెంట్ సంస్ద అయిన మొజిల్లా తైవాన్‌లో కొత్త ఆఫీసుని ప్రారంభించడం వల్ల ఆసియాలో తన బిజినెస్‌ని కొనసాగించనుంది. మొజిల్లా ఫైర్ ఫాక్స్‌తో మనకు అందరికి సుపరిచితం. ప్రపంచ మార్కెట్లో 26.7 శాతాన్ని ఆక్రమించి బ్రౌజింగ్ పరంగా యూజర్స్‌కు ఎంతగానో ఉపయోగపడుతుంది. మార్కెట్లో మైక్రోసాప్ట్, యాపిల్ కంపెనీల మద్య ఉండే పోటీని తట్టుకొనేందుకు గాను కొత్త కొత్త ప్రణాళికలను సిద్దం చేస్తుందని తెలిపారు.

ఈ సందర్బంలో మొజిల్లా చైర్మన్, సిఈవో లి గోంగ్ బ్లాగులో పోస్ట్ చేసిన సమాచారం ప్రకారం తైవాన్‌లో 40 మంది డవలపర్స్‌ని ఉద్యోగాలలోకి తీసుకొవడమే కాకుండా, కొత్త కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు తెలియజేశారు. ఈ తైవాన్ మొజిల్లా ఆఫీసులో కొత్తగా రానున్న ఇంజనీర్స్‌తో B2G, మొబైల్ ప్రాజెక్టుల మీద ప్రత్యేకంగా దృష్టిని పెట్టనున్నట్లు తెలిపారు.

మొజిల్లా తైవాన్‌లో ఆఫీసుని నెలకొల్పడం వల్ల ఆసియా రీజియన్‌లో ప్రస్తుతానికి నాలుగు ఆఫీసులు ఉన్నట్లు తెలిపారు. అంతక ముందు టొక్యో, ఆక్‌ల్యాండ్, బీజింగ్‌లలో ఆఫీసులు ఉన్నట్లు ఈ సందర్బంగా తెలిపారు. 2002వ సంవత్సరం నుండి మొజిల్లా సేవలు చైనాలో కొనసాగుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఇక మొజిల్లా ఆసియాలో ఎక్కువ మంది వాడే వెబ్ బ్రౌజర్లలలో రెండవ స్దానంలో ఉంది.

ప్రపంచం మొత్తం మీద ఎక్కువగా మొజిల్లా వాడే దేశం ఇండోనేషియా. ఇండోనేషియాలో మొజిల్లా మార్కెట్ షేర్ శాతం 70. తైవాన్‌లో కంపెనీ ఖర్చుల నిమిత్తం మొజిల్లా సుమారు $2 మిలియన్లు వరకు ఖర్చు చేయనుందని సమాచారం.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot