మొజిల్లా, ఎల్‌జీ భాగస్వామ్యంలో స్మార్ట్‌ఫోన్

Posted By: Prashanth

మొజిల్లా, ఎల్‌జీ భాగస్వామ్యంలో స్మార్ట్‌ఫోన్

 

మొబైల్ కాంగ్రెస్ వరల్డ్ 2012లో కొత్త మొబైల్ ఫోన్ రానుంది. ప్రముఖ సెర్చ్ ఇంజన్ మొజిల్లా.. ఎల్‌జీ తో కలసి ఓ సరిక్రొత్త స్మార్ట్ ఫోన్‌ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుందని సమాచారం. ఈ మొజిల్లా - ఎల్‌జీ స్మార్ట్ ఫోన్ మొజిల్లా సొంతంగా రూపొందించిన Boot to Gecko (B2G) ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా రన్ అవుతుంది. మార్కెట్లోకి త్వరలో రానున్న ఈ మొబైల్ ఫోన్ ప్రస్తుతానికి డెవలపర్స్‌ని దృష్టిలో పెట్టుకోని రూపొందించామని అన్నారు. దీని రాకతో మొజిల్లా పవర్ పుల్ బ్రౌజర్‌గా అవతరిస్తుందని మొజిల్లా ప్రతినిధులు తెలియజేశారు.

త్వరలో రానున్న ఈ మొబైల్‌కి సంబంధించిన ఖరీదు, సాంకేతిక వివరాలు ఇంకా అధికారకంగా విడుదలవ్వ లేదు. ఈ మొబైల్ వివరాలు మొబైల్ కాంగ్రెస్ వరల్డ్ 2012 ఈవెంట్ మద్యలో లేదా చివరిలో తెలియజేయనున్నారు. మొజిల్లా రూపొందించిన ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ Boot to Gecko వెబ్ మార్కెట్‌లో ఓ సంచలనాన్ని సృష్టిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇక మొజిల్లా గతంలో ప్రస్తావించినట్లు సొంత అప్లికేషన్ స్టోర్ 'వెబ్ మార్కెట్‌ప్లేస్' లో ఎవరైనా డెవలపర్స్ రూపొందించిన అప్లికేషన్స్‌ని అందులో పొందుపరచవచ్చు. డెవలపర్స్ పొందుపరచిన అప్లికేషన్స్ ఓపెన్ వెబ్ స్టాండర్డ్స్ CSS5, JavaScript and HTML5కి లోబడి ఉండాలని తెలియజేశారు. ఇక Boot to Gecko ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే కామన్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ మాదిరే అన్ని డివైజ్‌లకు సపోర్ట్ చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ మాదిరే లైనక్స్ లోడింగ్ ఫైర్ ఫాక్స్ ఇంజన్.

మొజిల్లా, ఎల్‌జీ సంయుక్తంగా విడుదల చేస్తున్న ఈ మొబైల్ మొబైల్ కాంగ్రెస్ వరల్డ్ 2012కే హైలెట్‌గా నిలవడమే కాకుండా... సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్, టెక్నాలజీ గెయింట్ ఆపిల్ గుండెల్లో రైళ్లు పరిగెడతాయని పలువురి విశ్లేషణ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot